For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Breast Milk Beauty Tips: తల్లిపాలలో దాగి ఉన్న సౌందర్య రహస్యాలు

తల్లిపాలలో లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి. ఎన్నో సౌందర్య రహస్యాలు దాగి ఉన్నాయి. తల్లి పాల వల్ల చాలా సౌందర్య సమస్యల నుండి బయటపడవచ్చు. తల్లి పాలను సౌందర్యానికి ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

|

Breast Milk Beauty Tips: ప్రపంచంలో స్వచ్చతలో తల్లిప్రేమంత సరితూగేవి కొన్నే ఉన్నాయి.వాటిల్లో మొదటిది తల్లిపాలు. ప్రపంచంలో ఉన్న అన్ని జీవులలో కేవలం ఆడజాతులకే పిల్లలను కనే శక్తి, వారికి ప్రకృతిలోనే మంచి పోషకాహారం- తల్లిపాలను ఇవ్వగలిగే శక్తి ఉంటాయి. కొత్తగా అప్పుడే పుట్టిన పాపాయికి ఏ తల్లి అయినా తల్లిపాలకంటే మంచి ఆహారం ఇవ్వలేదు. పుట్టినప్పటి నుంచి కొన్ని నెలల వరకూ, శిశువు సరిగా ఎదిగే వరకూ ఇవే తాగటం మంచిది. నిజానికి తల్లిపాలు ఎంత మంచివి అంటే బేబీకి ఇంకే సప్లిమెంట్ ఫుడ్ కానీ, ప్యూరిఫై చేసిన నీళ్ళు కూడా అవసరం ఉండదు.

Beauty secrets hidden in breast milk in Telugu

తల్లిపాలలో లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి. పిల్లల ఎదుగుదల, ఆరోగ్యం అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. ఇంత అద్భుతమైన తల్లి పాలల్లో ఎన్నో సౌందర్య రహస్యాలు దాగి ఉన్నాయి. తల్లి పాల వల్ల చాలా సౌందర్య సమస్యల నుండి బయటపడవచ్చు. తల్లి పాలను సౌందర్యానికి ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

కళ్ల సమస్యకు చక్కని పరిష్కారం

కళ్ల సమస్యకు చక్కని పరిష్కారం

సరైనా నిద్ర లేకపోతే కళ్లు వాచిపోతాయి. కళ్ల నుండి అదే పనిగా నీళ్లు కూడా కారతాయి. కళ్లు ఎర్రబడతాయి. అయితే వీటన్నింటికి తల్లి పాలు చక్కని పరిష్కారంగా ఉంటాయి. శిశువుకు తల్లిపాలు పట్టనప్పుడు, లేదా పట్టిన తర్వాత కొన్ని పాలను చిన్న స్పూన్ లో తీసుకుని వాటిని నెమ్మదిగా కంట్లో వేసుకోవాలి. తల్లి పాలలోని సహజ శోధ నిరోధక లక్షణాలు కంటి ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయి. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు తొలగిపోతాయి. కళ్లు వాచినప్పుడు కాటన్ క్లాత్ ను పాలలో ముంచి ఆ వాపుపై రాస్తే వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.

ఫేస్ వాష్

ఫేస్ వాష్

తల్లి పాలు చక్కని ఫేస్ వాష్. తల్లి పాలతో ముఖాన్ని వాష్ చేస్తే మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. తల్లి పాలలో పుష్కలంగా ఉండే లారిక్ యాసిడ్ చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు, ముఖంపై ఉన్న మృతకణాలను తొలగిస్తాయి. రోజూ తల్లి పాలతో ముఖాన్ని వాష్ చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.

చిన్న దూది తీసుకుని దానిని తల్లిపాలలో ముంచి ముఖంపై మర్దన చేసినట్లుగా రాయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే మంచి వర్చస్సు మీ సొంతం అవుతుంది.

మృదువైన పెదాలు

మృదువైన పెదాలు

చలికాలంలో పెదవులు పొడిబారి పగిలిపోతాయి. ఏమాత్రం కాంతివంతంగా కనిపించవు. పెదవులపై చర్మం వెళ్లి పోతుంది. రొమ్ము పాలు యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తల్లి పాలను పెదాలపై రాస్తే చాలా త్వరగా మీ పెదాలు ఆరోగ్యంగా తయారవుతాయి. పెదాల పగుళ్లు తొలగిపోతాయి. మృతకణాలు పోయి కాంతివంతంగా కనిపిస్తాయి.

గొప్ప ఔషధం

గొప్ప ఔషధం

మీ చర్మం సున్నితమైనదా.. తేమ లేకుండా పొడిబారిపోయి ఉంటుందా అయితే దీనికి పరిష్కారం తల్లి పాలు. తల్లి పాలలో ఉండే మృదుత్వం ముఖానికి మెరుపును ఇస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 1 టీ స్పూన్ ఓట్స్ మైదా, కొద్దిగా తేనె, కొద్దిగా పాలు తీసుకుని బాగా కలిపి, చల్లార్చిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. కాటన్ క్లాత్ తో మర్దన చేయాలి. ఓ 15 నిమిషాలు అలా చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి.

మాస్క్

మాస్క్

కొంచెం ముల్తానీ మట్టిని తీసుకుని తల్లి పాలలో కలపాలి. తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను 15 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేసి వదిలేయాలి. తల్లి పాలు, ముల్తానీ మట్టిలోని పోషకాలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. చర్మ దురదను దూరం చేస్తాయి.

హీట్ స్ట్రోక్

హీట్ స్ట్రోక్

ముఖం మరియు భుజాలపై ఎక్కువ హాట్ స్పాట్స్ ఉన్నాయా.. దీని నివారణకు తల్లి పాలు మంచి ఔషధంలా పని చేస్తాయి. తల్లిపాలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఎలాంటి చర్మపు మొటిమలను అయినా నయం చేయడంలో చక్కగా పని చేస్తాయి.

English summary

Beauty secrets hidden in breast milk in Telugu

read on to know Beauty secrets hidden in breast milk in Telugu
Story first published:Wednesday, November 30, 2022, 18:20 [IST]
Desktop Bottom Promotion