For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దాల్చిన చెక్కలో స్కిన్&హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్, ఎలా వాడాలి?

దాల్చిన చెక్కలో స్కిన్&హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్, ఎలా వాడాలి?

|

వివిధ రకాల వంటల్లో దాల్చిన చెక్కను వాడతారు. దీనిని జోడించడం వలన వంటకాల ఫ్లేవర్ పెరుగుతుంది. స్వీట్స్ దగ్గరనుంచి అన్ని రకాల వంటకాల తయారీలో దీనిని వాడటం వలన ఆ వంట రుచి మరింత పెరుగుతుంది. ప్రత్యేకించి సాంప్రదాయ వంటకాలలో దాల్చిన చెక్కను కచ్చితంగా వాడతారు. వంటలకు రుచికి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, చర్మ అందాన్ని, జుట్టు అందాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ రోజుల్లో అనేక స్కిన్ డిజార్డ్స్ కొరకు దాల్చిన చెక్కను విరివిగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆరోమా థెరఫీ మరియు కాస్మోటాలజీ వంటి వాటిలో వాడుతున్నారు.

దాల్చిన చెక్కలో న్యూట్రియెంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం, మాంగనీస్, కేల్షియం, జింక్ మరియు ఐరన్ లకు నిలయంగా దాల్చిన చెక్కను చెప్పుకోవచ్చు. అందువల్ల ఆరోగ్యంతో పాటు, చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడుతాయి. పరిశోధన ప్రకారం దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్స్ మరియు మినిరల్స్ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు ప్రకాశంతంగా మార్చుతుంది.

Benefits Of Cinnamon For Skin And Hair,

దాల్చిన చెక్క అన్ని రకాల చర్మతత్వాలకు ఉపయోగించవచ్చు. ఇది చర్మ రంద్రాలను మాపుతుంది, చర్మం స్మూత్ గా తయారవుతుంది. దాల్చిన చెక్కను రెగ్యులర్ గా ఉపయోగిస్తే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దాల్చిన చెక్కలో దాగున్న మరికొన్ని బ్యూటీ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది:

జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది:

దాల్చిన చెక్క జుట్టుకు క్లెన్సర్ పనిచేసి కావల్సిన పోషకాలను అందిస్తుంది. దాల్చిన చెక్కకు కొద్దిగా పెసరపిండి జత చేసి తలకు మాస్క్ లేదా వాటర్ లో కలిపి క్లెన్సర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది తలలో మురికి మరియు చుండ్రును ప్రభావంతంగా తొలగిస్తుంది.

జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది:

జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది:

దాల్చిన చెక్క జుట్టు మొదళ్ళను బలోపేతం చేసి, జుట్టుకు కావల్సిన షైనింగ్ ను అందిస్తుంది. దాల్చిన చెక్క పొడికి కొద్దిగా తేనె మరియు ఆలివ్ ఆయిల్ జత చేసి జుట్టుకు మాస్క్ వేసుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం ద్వారా బెస్ట్ రిజల్ట్ పొందుతారు.

జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్ మరియు సాప్ట్ గా పెరుగుతుంది

జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్ మరియు సాప్ట్ గా పెరుగుతుంది

దాల్చిన చెక్కను హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా, షైనింగ్ తో సాఫ్ట్ పెరుగుతుంది. దాల్చిన చెక్క పౌడర్ ఒక బౌల్లో తీసుకుని దానికిఒ గుడ్డులోని మిశ్రామన్ని వేసి, తేనె మరియు ఆలివ్ ఆయిల్ జత చేసి మూడింటిని మిక్స్ చేయాలి. దీన్ని హెయిర్ ప్యాక్ గా వేసుకుని అరగంట అలాగే ఉంచి , తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. దాల్చిన చెక్క మరియు తేనెను డైలీ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించవచ్చు.

మొటిమలు, మచ్చలను నివారణకు

మొటిమలు, మచ్చలను నివారణకు

దాల్చిన చెక్కలోని యాంటీ సెప్టిక్ గుణాలు మొటిమలు, మచ్చలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. దాల్చిన చెక్క పౌడర్ కు కొద్దిగా తేనె జోడించి, మిక్స్ చేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి 20 నిముషాల తర్వాత కడగాలి. దాంతో మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి.

ఎగ్జిమా నయం చేస్తుంది.

ఎగ్జిమా నయం చేస్తుంది.

చర్మ సమస్యల్లో ఒకటి అయినా ఎగ్జిమాను క్యూర్ చేయడంలో మరియు డ్రై స్కన్ నివారించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్క పౌడర్ మరియు తేనె సమంగా తీసుకుని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత నీటితో కడగాలి.

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది:

ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది:

దాల్చిన చెక్కను ఎక్కువగా చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్ ను పెంచుతుంది . దాంతో ఎలాంటి సైటో టాక్సిక్ ప్రభావంకు గురికాకుండా ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. ఉత్తమ ఫలితాల కోసం తేనె చేర్చుకోవచ్చు.

ఫేస్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది:

ఫేస్ స్క్రబ్బర్ గా పనిచేస్తుంది:

దాల్చిన చెక్క పౌడర్ చర్మానికి స్క్రబ్బర్ గా పచిేస్తుంది. చర్మంలో మ్రుత కణాలను తొలగిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాల్చిన చెక్కకు ఓట్ మీల్ పౌడర్ మరియు పాలు జతచేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేసి చన్నీటితో ముఖం కడగాలి.

స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది:

స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది:

చర్మం యొక్క క్వాలిటీని పెంచుతుంది. దాంతో చర్మం కాంతి పెరుగుతుంది. దాల్చిన చెక్క పౌడర్ కు కొద్దిగా పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ వేసుకుని కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎఫెక్టివ్ రిజల్ట్ పొందుతారు

English summary

Benefits Of Cinnamon For Skin And Hair

Cinnamon plays a crucial role in providing to the skin certain essential ingredients that help in maintaining skin health. According to a research, the antioxidants present in cinnamon is known to reduce the signs of ageing. The vitamins and minerals present in it make the skin radiant and the hair lustrous. Cinnamon suits all skin types. It can be used to improve the texture of your skin. It tightens the skin pores and makes the skin look smooth. Cinnamon also promotes hair growth when used on a regular basis.
Story first published:Thursday, September 19, 2019, 13:04 [IST]
Desktop Bottom Promotion