For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ ని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి..

మనం వాసన చూసే విధానం మన వ్యక్తిత్వంలో పెద్ద భాగం. మీ దగ్గర వచ్చే సువాసనే శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అందుకోసమే మనం ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉండటం ఉత్తమం.

|

ఎలాంటి పర్ఫ్యూమ్ నుండి అయినా సువాసన దీర్ఘకాలం పాటు రాదు. పర్ఫ్యూమ్ ల నుండి సువాసన కేవలం కొన్ని నిమిషాల వరకే వెదజల్లుతూ ఉంటుంది. అయితే ఇలాంటివి మనం అస్సలు ఇష్టపడం. నిరంతరం సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ కోసం మనమెంతగానో ఖర్చు చేస్తుంటాం. అయితే అది పెద్ద విషయం కాదు. ఆ సువాసన తీవ్రత కేవలం కొన్ని గంటల్లోనే పూర్తిగా ఆవిరైపోతుందన్న వాస్తవాన్ని తప్పకుండా మీరు అంగీకరించాలి.

మనం వాసన చూసే విధానం మన వ్యక్తిత్వంలో పెద్ద భాగం. మీ దగ్గర వచ్చే సువాసనే శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. అందుకోసమే మనం ప్రత్యేకమైన సువాసనను కలిగి ఉండటం ఉత్తమం. కానీ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని పర్ఫ్యూమ్ లు లభిస్తున్నాయి. వాటిలో ఏది మంచిదో తేల్చుకోలేకపోతున్నారా? ఇప్పటికీ మంచి సువాసన వచ్చే వాటి కోసం వెతుకుతున్నారా? అయితే ఈరోజు స్టోరీలో సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ ల గురించి తెలుసుకుందాం.

Right Fragrance

అద్భుతమైన పరిమళం వెదజల్లే సరైన సువాసన కోసం మీరు షాపులకు, మాల్స్ కు వెళితే అక్కడ అన్ని రకాల సువాసనలతో మిమ్మల్ని గందరగోళ పరుస్తారు. మీరు ఇష్టపడే సువాసనతో పాటు దానికన్నా మంచిది ఉందని, ఇది ఒకసారి ట్రై చెయ్యండని చురుకైన సేల్స్ మెన్లు మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు. అందుకే వారు మిమ్మల్ని బోల్తా కొట్టించకుండా.. మీరు వారి బుట్టలో పడకుండా మేము మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తాం. వాటిని ప్రయత్నించి చూడండి. సక్సెస్ అయితే వాటిని పాటించండి.

1) లింగో గురించి తెలుసుకోండి..

1) లింగో గురించి తెలుసుకోండి..

ప్రతి ఒక్క పర్ఫ్యూమ్ బాటిల్స్ గురించి తొలుత అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటిపై ఉండే గమనికలు(నోట్స్). అవి కాలంతో పాటు మారుతుంటాయి. ఈ పర్ఫ్యూమ్ కు మూడు నోట్స్ ఉన్నాయి. టాప్ అండ్ బాటమ్ అండ్ మిడిల్. టాప్ నోట్ ఏంటంటే మీరు స్ప్రే చేసిన తర్వాత తొలి 15 నిమిషాలు వాసన పడుతుంది. ఆ తర్వాత అది మసకబారుతుంది. అదే మిడిల్ నోట్ విషయానికొస్తే అది కొన్ని గంటల వరకు ఉంటుంది. ఇక బాటమ్ నోట్ కి వస్తే ఇది రోజంతా ఉండే వాసన. కాబట్టి మీరు మంచి సువాసన వెదజల్లే పర్ఫ్యూమ్ ఎంపిక చేసుకునేటప్పుడు మీరు టాప్ నోట్ మాత్రమే కాకుండా బాటమ్ అండ్ మిడిల్ నోట్స్ ను కూడా నిర్ధారించుకోండి.

2) మీకు తెలిసిన కొన్ని సుగంధాలు..

2) మీకు తెలిసిన కొన్ని సుగంధాలు..

మీరు ఇప్పటికే ప్రేమించే, మీకు తెలిసిన కొన్ని పర్ఫ్యూమ్ లను కనుగొనడానికి ప్రయత్నించండి. మీరు ప్రేమించే, మీకు తెలిసిన కొన్ని సుగంధాలు కూడా ఉండొచ్చు. ఆ సువాసనతో ప్రతిధ్వనించే పర్ఫ్యూమ్ ను కనుక్కునేందుకు ప్రయత్నించి చూడండి. మీరు ఏదైనా షాపుకు లేదా మాల్స్ కు వెళ్లినపుడు మీరు అలాంటి సువాసన వచ్చేవి కావాలని వారికి చెప్పండి. అది పూలు, లేదా కలప లేదా సిట్రస్ వంటి సువాసన కావచ్చు. మీరు ఒకవేళ ఆన్ లైన్లో షాపింగ్ చేస్తుంటే మీ సువాసన ఎంపికను వివరించే ఫిల్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ చుట్టూ ఉన్న సువాసనలతో మీ సమయాన్ని గడపండి. మీరు ఇష్టపడేది ఏంటో తెలుసుకోండి.

3) ఫస్ట్ లైట్ గా ఉండే వాటిని ట్రై చెయ్యండి..

3) ఫస్ట్ లైట్ గా ఉండే వాటిని ట్రై చెయ్యండి..

ఫస్ట్ లైట్ గా ఉండే సువాసనలను ప్రయత్నించండి. మీరు వేర్వేరు పర్ఫ్యూమ్ లను ప్రయత్నిస్తుంటే, ముందుగా లైట్ (తేలికైన) సువాసన వెదజల్లే వాటిని ప్రయత్నించండి. తర్వాత భారీ సువాసనలకు వెళ్లండి.మస్కీ మరియు కలప వంటివి తేలికైన సువాసనలు వెదజల్లుతాయి.

4) అన్నింటినీ ఒకేసారి ప్రయత్నించొద్దు..

4) అన్నింటినీ ఒకేసారి ప్రయత్నించొద్దు..

అన్ని పర్ఫ్యూమ్ లను ఒకేసారి ప్రయత్నించొద్దు. సువాసనలను పరీక్షించడంలో అస్సలు తొందర పడొద్దు. మీరు ఎంత ఎక్కువగా వాసన చూస్తే మంచి సువాసన ఉన్న వాటిని ఎన్నుకోవడంలో అంత గందరగోళ పడతారు. కాబట్టి ఒకేసారి మూడు పర్ఫ్యూమ్ ల కంటే ఎక్కువగా ప్రయత్నించవద్దు.

5) మీ పల్స్ పాయింట్ల పర్ఫ్యూమ్ ను ప్రయత్నించండి..

5) మీ పల్స్ పాయింట్ల పర్ఫ్యూమ్ ను ప్రయత్నించండి..

పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో పరీక్షించడానికి ఉత్తమ మార్గం మీ శరీరం యొక్క పల్స్ పాయింట్ల వద్ద పరీక్షించడం. మీ శరీరం యొక్క పల్స్ పాయింట్లు చెవుల వెనుక, మీ గొంతు యొక్క బేస్, మణికట్టు మీద, మీ లోపలి మోచేతులు మరియు మీ మోకాళ్ల వెనుక ఉంటాయి. ఈ భాగాలే సువాసనను తీవ్రతరం చేసేందుకు సహాయపడతాయి.

6) సువాసన టెస్ట్ చేసేటపుడు బ్రేక్ తీసుకోండి..

6) సువాసన టెస్ట్ చేసేటపుడు బ్రేక్ తీసుకోండి..

పర్ఫ్యూమ్ ను పరీక్షించేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వాటి మధ్య బ్రేక్ తీసుకోవడం. రకరకాల పర్ఫ్యూమ్ లతో మిమ్మల్ని మీరు ముంచుకోకండి. సుగంధాల మధ్య కాఫీ వాసన చూడండి లేదా చిన్న బ్రేక్ తీసుకుని తిరిగి వచ్చి ప్రయత్నించండి.

7) పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ కోసం సమయాన్ని ఇవ్వండి

7) పర్ఫెక్ట్ పర్ఫ్యూమ్ కోసం సమయాన్ని ఇవ్వండి

మీరు మొదట చూసే సువాసన అది రోజంతా వాసన ఎలా వస్తుందో కాదు. మీ శరీర వాసన కూడా పర్ఫ్యూమ్ వాసన పడే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఒకే పర్ఫ్యూమ్ వేర్వేరు వ్యక్తులపై భిన్నంగా ఉంటుంది. కాబట్టి, మీరు అలాంటి పర్ఫ్యూమ్ ను ఇష్టపడుతున్నారో లేదో తెలుసుకోవడానికి శ్యాంపిల్ తీసుకొని రోజంతా పరీక్షించండి.

English summary

How To Choose The Right Fragrance For You

If you go to the shops and malls for the perfect scent of amazing perfume, you will be confused with all kinds of fragrances. There is a good scent that you like and that is better than it is. That's why they'll roll you in. We'll give you some tips for not getting into their basket. Give them a try. If Success Follow them.
Story first published:Tuesday, September 3, 2019, 17:42 [IST]
Desktop Bottom Promotion