For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాదాల పగుళ్లు పోగొట్టి మృదువుగా..కోమలంగా మార్చే అరటి మాయిశ్చరైజర్, ఏం చేయాలి, ఎలా చేయాలి?

పాదాల పగుళ్లు పోగొట్టి మృదువుగా..కోమలంగా మార్చే అరటి మాయిశ్చరైజర్, ఏం చేయాలి, ఎలా చేయాలి?

|

మహిళలు అందం విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. అందరిలోకి తామే అందంగా కనబడాలని కోరుకుంటారు. అందం అంటే ముఖం నుండి పాదాల వరకు అందమైన చర్మ సౌందర్య, శరీర సౌష్టవం అంతకు తగ్గట్లు అందంగా అలకరించుకోవడం. అందంగా ఉండాలని ప్రతి అమ్మాయి , మహిళ కోరుకుంటుంది. అయితే అది ముఖం వరకే పరిమితం అవుతుంది. అందంగా కనబడాలంటే ముఖం ఒకటి సంరక్షించుకుంటే సరిపోదు, కాళ్లు, చేతులు కూడా అందంగా కనబడాలి. స్త్రీలు, ముఖానికి తీసుకున్నంత శ్రద్ద కాళ్ళపై చూపరు. ముఖం అందంగా కనబడుతుంది, కానీ పాదాలు చూస్తే పగుళ్లతో చీకాకు పెడుతుంది. అలాంటప్పుడు పాదాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

How to Use Banana Moisturizer For Cracked Heels

పాదాలను పద్మాల్లా వర్ణిస్తుంటారు కవులు. పాదాలపట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే పాదాలు పద్మాల్లా సున్నితంగా.. కోమలంగా..ఎలా ఉంటాయి.!పాదాలు మృదువుగా ఉంటే అందంగా ఉంటాయని! అలా అందంగా, శుభ్రంగా పాదాలను ఉంచుకోడానికి ప్రయత్నిస్తే పాదాలు పద్మాలుగా మారవచ్చు. దాంతో ముఖానికి మాత్రమే కాదు, పాదాలకు మంచి కాంప్లిమెంట్లు వస్తాయి. మరి పాదాల పగుళ్లను పోగొట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. దానికి గురించి తెలుసుకుందాం..

కావల్సినవి

కావల్సినవి

అరటిపండ్లు: 2

మంచి నీళ్లు

ఏం చేయాలి:

ఏం చేయాలి:

1. బాగా పండిన అరటి పండ్లను రెండు తీసుకుని, తొక్క తీసి లోపలి అరటిపండును మెత్గగా గుజ్జు తయారుచేసుకోవాలి. అరటిపండ్లు ఖచ్చితంగా పండైనవి మాత్రమే తీసుకోవాలి. పచ్చివాటిలో యాసిడ్స్ ఉండటం వల్ల ఇవి చర్మంపై ఉపయోగించడానికి కఠినంగా ఉంటుంది.

2. ఈ అరటి పండు గుజ్జును పాదాల మొత్తానికి అప్లై చేసి సున్నితంగా మర్ధనా చేయాలి.

3. కాలి వేళ్లతో సహా, కాలి మడమలు, కాలి వేళ్లు, వేళ్ల సందులకు కూడా గుజ్జును చేర్చి, చిన్న మసాజ్‌లాంటిది ఇవ్వండి. అలా రెండు పాదాలకూ రాసి, అరగంట అలాగే వదిలేయాలి.

4. అరగంట తర్వాత క్లీన్ వాటర్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి.

ఎంత తరచుగా ఈ పద్దతి అనుసరించాలి?

ఎంత తరచుగా ఈ పద్దతి అనుసరించాలి?

ఈ ఫూట్ మాస్క్ పద్దతి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు ప్రయత్నించండి.

ఈ పద్దతిని కనీసం రెండు వారాలు క్రమం తప్పకుండా అనుసరిస్తుంటే మంచి ఫలితాలను పొందుతారు.

పాదాల పగుళ్లను నివారించడంలో అరటి పండు ఎలా పనిచేస్తుంది:

పాదాల పగుళ్లను నివారించడంలో అరటి పండు ఎలా పనిచేస్తుంది:

అరటి పండు న్యాచురల్ స్కిన్ మాయిశ్చరైజర్. అంటే చర్మాన్ని తేమగా ఉంచే స్వభావం గలది. ఇందులో విటమిన్ ఎ, బి6 మరియు సి, పొటాషియం లు ఉండటం వల్ల స్కిన్ ఎలాసిటిని మెరుగుపరుస్తుంది.

పగిలిన పాదాలను, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది.

పగిలిన పాదాలను, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది.

పగిలిన పాదాలను, పొడిబారిన పాదాలను సున్నితంగా మార్చుతుంది. అలాగే అరటి తొక్కలోని అమినో యాసిడ్స్ చర్మంను హైడ్రేషన్లో ఉంచుతుంది.పాదాలను మృదువుగా మార్చేస్తాయి. మడమల పగుళ్లకు ఇది తిరుగులేని మంత్రం.

English summary

How to Use Banana Moisturizer For Cracked Heels

banana for your feet! Yea, you heard that right! Bananas contain potassium, making them an excellent moisturiser.
Story first published:Friday, September 20, 2019, 15:18 [IST]
Desktop Bottom Promotion