Just In
- 3 min ago
తల్లి తన కూతురికి మొదటి రుతుక్రమం(పీరియడ్స్) గురించి ఏం చెప్పాలో తెలుసా?మొదటి పీరియడ్‌కి ఎలా ప్రిపేర్ చేయాలి
- 17 min ago
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం జీవితంలో వీటిని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవద్దు
- 1 hr ago
మీరు మీ శరీరానికి పని చెప్పడం లేదా? అది మీకు ఎంత పెద్ద ప్రమాదమో మీకు తెలుసా?
- 6 hrs ago
Today Rasi Palalu 01February 2023: ఈ రోజు ఫిబ్రవరి 1, ఏకాదశి, బుధవారం ద్వాదశ రాశులకు ఎలా ఉందో ఇక్కడ చూడండి
Facial Exercise: ఈ వ్యాయామాలతో ముఖంపై ముడతలు పోతాయి
Facial Exercise: ఎన్ని క్రీములు రాసినా, ఎంత పౌడర్ రుద్దినా.. కళ్ల కింద నల్ల మచ్చలు, ముఖంపై ముడతలు, కళ్ల కింద క్యారీ బ్యాగులు ఉంటే చూడ్డానికి ఏం బాగోదు. అయితే ఇప్పటి జీవనశైలి వల్ల చాలా మందికి చర్మ సమస్యలు చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ౩౦ల్లోకి వచ్చేసరికి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. పోషకాల లోపం, ఒత్తిడి, నిద్రలేమి, అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్లు చూడటం ఇలాంటి కారణాల వల్ల ముఖం అందవిహీనంగా తయారవుతోంది. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వీటికి అదనం అనే చెప్పాలి.
రోజూ కొన్ని ఫేషియల్ వర్కవుట్స్ చేస్తే ముఖంపై ముడతలు పోవడంతో పాటు మరింత యవ్వనంగా కనిపిస్తారు. మచ్చలు, ముడతలు ఇలాంటి సమస్యలు ఉండవు.

ఫేషియల్ వర్కవుట్స్ వల్ల ప్రయోజనాలు:
రోజూ కొన్ని నిమిషాల పాటు ఫేస్‌పై మర్దన చేస్తే వ్యాయామం చేసినన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముఖ కండరాలు, ముఖ చర్మం బిగుతుగా మారి ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు. రక్త ప్రసరణ మెరుగుపడి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఒక క్రమపద్ధతిలో ఫేషియల్ వ్యాయామం చేయడం వల్ల అందవిహీనమైన ముఖం కాస్త అందంగా నవయవ్వనంగా మెరిసిపోతుంది.

కళ్ల కింద క్యారీ బ్యాగులా అయితే ఇలా చేయండి:
సరైన నిద్ర లేకపోతే కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. కొందరిలో అయితే కళ్ల కింద ఉబ్బు కనిపించి క్యారీ బ్యాగుల్లా కనిపిస్తాయి.
రెండు చేతుల మధ్య వేళ్లను కనుబొమ్మల మధ్య, రెండు చేతుల చూపుడు వేళ్లను కళ్ల చివర్లలో ఉంచి వి-ఆకారంలో మర్దన చేస్తుండాలి. కింది రెప్పలను పైకి లేపుతూ నెమ్మదిగా మర్దన చేయాలి.

కళ్ల కింద ముడతలు తగ్గడానికి..
రెండు చేతుల చూపుడు, మధ్య వేళ్లను కంటి కొలను దగ్గర ఉంచాలి. చూపుడు వేళ్లను నెమ్మదిగా మర్దన చేస్తూ మరో కొన వరకు తీసుకు వెళ్లాలి. అలా తీసుకువెళ్తున్న సమయంలో మధ్య వేలితో చర్మాన్ని బిగుతుగా పట్టి ఉంచాలి. ఇలా రెండు నిమిషాల పాటు చేయాలి.

సాగిన కనురెప్పల కోసం:
చూపుడు వేలితో కనుబొమ్మల పైన చర్మాన్ని ఎత్తి పట్టుకోవాలి. మధ్యవేలితో రెప్ప కింది భాగంలో నొక్కి ఉంచాలి. తర్వాత కాసేపయ్యాక... కళ్లను 20 సార్లు మూసి తెరుస్తూ ఉండాలి.

నుదుటి మీద ముడతలు వచ్చేశాయా అయితే..
నుదుడి మీద ముడతలు వచ్చిన వారు కనుబొమ్మల cనుండి నుదిటి వరకు ఉన్న చర్మాన్ని లాగి పట్టుకోవాలి. ఇలా కనీసం రోజూ పది సార్లు చేస్తే నుదిటి మీద ముడతలు క్రమంగా పోతాయి.

మూతి చుట్టూ ముడతలు:
తరచూ మూతి తిప్పడం వల్ల నోటి చుట్టూ ముడతలు వచ్చేస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే ఈ వ్యాయామం చక్కగా పని చేస్తుంది. మొదటి నోటిలో గాలి నింపి పెదాలను గట్టిగా బిగపట్టాలి. నోట్లో గాలి నింపితే బుగ్గలు ఉబ్బుతాయి. అప్పుడు పెదాలను చేతితో నొక్కి పట్టాలి. ఇలా 15 నిమిషాల పాటు చేస్తే నోటి చుట్టూ ముడతలు క్రమంగా తగ్గుతాయి.

చర్మాన్ని బిగుతుగా మార్చేందుకు..
వయస్సు పెరిగే కొద్దీ చర్మం, కండరాల మధ్య ఉండే కొవ్వు సబ్కటానియస్ పొర క్రమంగా అదృశ్యం అవుతుంది. దీని వల్ల చర్మం లూజ్‌గా తయారవుతుంది. క్రమంగా ఆకృతి పోతుంది. యాంటీ ఏజింగ్ ఫేషియల్ వ్యాయామాల ద్వారా చర్మాన్ని బిగుతుగా మార్చుకోవచ్చు.
చూపుడు వేళ్లను బుగ్గలపై ఉంచాలి. నవ్వడానికి ప్రయత్నించాలి. బిగ్గరగా నోరు తెరిచి బుగ్గలపై ఉన్న చర్మాన్ని వేళ్లతో కింది వైపు నొక్కాలి.