For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు మాయం ఇలా..?

|
Home Remedies for Dandruff
''చుండ్రు సమస్యతో భాదపడేవారు, ఇక పై ఎటువంటి ఆందోళణకు గురికావల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెళుకువలను కాస్తంత ఓర్పు, సహనంతో పాటిస్తే నెలల వ్యవధిలోనే తలకు పట్టిన చుండ్రు మటుమాయమవుతుంది.''

- చుండ్రు సమస్య మరింత అధికంగా ఉందా..? ఏమాత్రం ఆలోచించకండి వెంటనే 'కేశ' నిపుణులను సంప్రదించి వారి సలహాలు పాటించండి.

- మీరు వాడుతన్న షాంపూ జుత్తు పే ఏ మేర ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. షాంపూను డైరెక్టుగా తల పై రుద్దకండి. మగ్ నీటిలో షాంపూ మిశ్రమాన్ని పోసి ఆపై తలకు రుద్దండి.

- చుండ్రుతో భాదపడేవారు కుంకుడి కాయ రసంతో తల స్నానం చేయ్యటం ఉత్తమం.

- గ్లిజరిన్ చుండ్రు నివారణకు తోడ్పడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. తలస్నానానికి రెండు గంటల ముందు గ్లిజరిన్ ను తలకు పట్టించి మర్దనా చేస్తే చుండ్రు నశిస్తుందట.

- తాజా మందారపూలను మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుముఖం పడుతుందట.

- మన్నికైన 4 చెంచాల కొబ్బరినూనెలో , రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని జోడించి తలకు మర్దనా చేసి, ఆ తరువాత తలస్నానం చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.

- గసగసాలను పాలలో కలిపి తలకు పట్టించి, కొద్ది సేపటి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

- టీ ఆకులను నీటిలో ఉడికించి, ఆ నీరు చల్లబడిన తరువాత అరస్పూన్ నిమ్మరసంలో కలపి తలకు పట్టించాలి. ఓ గంట తరువాత శుభ్రం చేసుకుంటే చుండ్రు తొలగిపోవటంతో పాటు వెంట్రుకలు నిఘారింపును సంతరించుకుంటాయి.

English summary

Home Remedies for Dandruff | చుండ్రు మాయం ఇలా..?

Dandruff, also known as scruff, is due to excessive shedding of dead skin cells from the scalp.
Story first published:Thursday, September 29, 2011, 11:21 [IST]
Desktop Bottom Promotion