For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు కావలసిన మంచి పోషకాహారం....

|

Nutritional Foods For Strong & Healthy Hair
జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకుంటుంటారు. అందంగా కనిపించాలనే చాలా మంది తాపత్రయ పడుతుంటారు. కానీ ముఖంపై వచ్చే మొటిమలు, హెయిర్ ఫాల్ వారిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే చర్మం నిగారింపు సంతరించుకోవాలన్నా, శిరోజాలకు షైనింగ్ రావాలన్నా చక్కటి ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గము. ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా మెరుస్తుంటాయి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి. .

ఈ శిరోజాలు రాలడంతో పాటు తల పొడిబారటం వంటి లక్షణాలున్నట్లయితే బయోటిన్, జింక్, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ లోపం ఉన్నట్లుగా భావించాలి. ఈ ఒత్తిడి, ప్రెగ్నెసీ, చర్మవ్యాధులు, మందులు, జన్యుపరమైన కారణాలతోపాటు వయస్సు కూడా కారణం కావచ్చు. శిరోజాలకు వాడే రంగులు కూడా హెయిర్ ఫాల్‌ కు కారణం కావచ్చు. ఈ హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉందంటే తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫ్యాట్ శాతంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నదే చాలామందిలో తలెత్తే సందేహం.

రోజు వారి మెనూలో విటమిన్-ఎ, సి, బి-కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్‌ యాసిడ్ తగినంత లభించేలా చూసుకోవాలి. శిరోజాలు ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉపకరిస్తాయి. ఈ చేపలు, కోడిగుడ్లు, పండ్లు, తాజా ఆకుకూరలు, రాగులు, జొన్నలు, సజ్జలు, ఓట్స్ గోధుమలు, ఫిగ్స్, ఆప్రికాట్ తదితరాలు ఎక్కువగా తీసుకోవాలి.

అన్ని రకాల నిమ్మజాతి పండ్ల ద్వారా విటమిన్‌ 'సి' సమృద్ధిగా లభిస్తుంది. ఇనుము ఆధారిత ఆహారపదార్ధాలు తీసుకుంటున్న శాకాహారులు మాత్రం వాటితోపాటు విటమిన్‌ 'సి' ఉండే వస్తువులూ తప్పనిసరిగా తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కాఫీ, ఆల్కహాల్, నికోటిన్, కూల్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఈ సలాడ్‌ తో పాటు వాల్‌ నట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వెజిటబుల్ జ్యూస్, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకుంటే శిరోజాలు ధృడంగా ఉంటాయి.

English summary

Nutritional Foods For Strong & Healthy Hair | మెరిసే జుట్టుకు పౌష్టికాహారం...

Healthy and strong hair is something that everyone desires. Continuous hair-fall, dandruff and other problems associated with hair also indicate lack of necessary nutrients in our body. Having healthy food is one way to gain healthy hair.
Story first published:Monday, March 12, 2012, 16:00 [IST]
Desktop Bottom Promotion