Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కేశ సంపదను పెంచే విటిమిన్స్ వేటిలో ఉంటాయో తెలుసా...!
అనేక కారణాలతో రాలిపోతున్న కురులను చూసి మహిళలు ఆవేదన చెందుతున్నారు. అయితే రాలేజుట్టును కాపాడుకోవడానికిపట్టులాంటి కురుల పెరుగుదలకు ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు ఎంతగానో ఉపయో గపడుతాయి. ప్రతి రోజూ ఆహారంతో పాటు విటమిన్స్ మరియు మినరల్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల కేశ సంపదను కాపాడు కోవచ్చు. ఆహారంలో భాగంగా ప్రతిరోజూ తాజా పండ్లు తింటే కురుల పెరుగుదలకు ఉపయోగ పడుతాయి. పండ్లలో ఉండే ఏయో విటమిన్స్, మినరల్స్ ఏ విధమైన పోషణను అందిస్తాయో తెలుసుకుందాం...
విటమిన్ సి: కురుల పెరుగుదలకు బయోప్లె వనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి ఎంతో ఉపయో గపడు తాయి. తల మాడుకు కావల్సింత రక్త ప్రసరణను అందించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో విలమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు విటమన్ సి ఎక్కువగా ఉన్న ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రి కాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.

విటమిన్ ఇ: విటమిన్ ఇ కురులకు మెరుపు వస్తుంది. పెలుసుగా ఉన్న కురు లు పట్టుకుచ్చులా మారు తాయి. తల మాడుకు రక్త ప్రసరణకు కావల్సి నంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉన్న మామిడి పండ్లు, కివి ఎక్కువగా తీసుకోవాలి. చేపలల్లోనూ ఈ విటమిన్ అధికంగా ఉంటుం ది.
బీటా కెరోటీస్: శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మారి శరీరానికి, కురులకు సహజత్వాన్ని అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను) సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ అధికంగా ఉంటే దోసకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కురులు రాలిపోకుండా నివారించవచ్చు.
ఫోలిక్ ఆసిడ్: ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురులకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
మెగ్నీషియం: కురుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మెగ్నీషియం ఎంతగానో దోహదడుతుంది. అరటి పండులో ఈ పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఇన్ అసిటోల్: విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా కూరగాయలు, పండ్లు దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడంతో అందమైన కేశసంపదను పొందవచ్చు.



Click it and Unblock the Notifications
