For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందపాటి జుట్టు పెరుగుదలకు జ్యూసులే ఆహారం...

|

సాధారణంగా మహిళల అందం విషయంలో కేశాలు కూడా ప్రధానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవాటి జుట్టు కలిగి ఉండావలని ప్రతి అమ్మాయి డ్రీమ్. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలరు. ఎందుకంటే, జుట్టు వేగంగా, మరియు మందంగా పెంచుకోవాలంటే అందుకు చాలా ప్రయత్నం చేయాలి.

జుట్టు పెరుగుదల దాని సొంత సమూహాన్ని కలిగి ఉంటుంది. కేశాలకు సరైన పోషణ(తలకు తరచూ నూనె పెట్టడం, కండీషన్, షాంపు, డైటై) అంధించడం ద్వారా జుట్టు వేగంగా పెరుగుతుందని మనందరికీ తెలుసు. అందుకు మనం చాలా స్టెప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీ బిజీ షెడ్యూల్లో, జుట్టు పెరుగుదలకు ఇవన్నీ చేయాల్సంటే కొద్దిగా అగ్ని పరీక్షవంటిదే. అయితే, పాత ఫ్యాషన్ కృషి లేకుండా నిజంగా ఏదీ జరగదు. ఏమైనా మీ జుట్టు వేడి మరియు కాలుష్యం యొక్క తీవ్రతను భరించలేకపోవడం కూడా జుట్టు పెరుగుదలకు కారణం అవుతుంది. మీరు నిజంగా మీ జుట్టును వేగంగా మరియు పొడవుగా, చిక్కటి కేశ సౌందర్యాన్ని పొందాంటే కేశాలకు కొన్ని రకాల జ్యూసులు బాగా పనిచేస్తాయి.

సాధారణంగా ఈ జ్యూసులతో పాటు ఎక్సాక్ట్ ను కూడా జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మరియు బలంగా పెరగడానికి సహాయపడుతాయి. అంతే కాదు కురులకు మంచి మెరుపు వస్తుంది. మందపాటి జుట్టు పొందాలంటే వివిధ రకాల పద్ధతులను పాటించాలి. వాటిలో కొన్ని హెయిర్ బ్రేకేజ్ మరియు పొడి జుట్టును తొలగిస్తాయి. మరికొన్ని తలలో రక్తప్రసరణకు బాగా సహాయపడుతాయి. వీటిలాగే జ్యూసులు కూడా తలలో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

కొన్ని రకాల పండ్లు, మరియు వెజిటేబుల్ యొక్క జ్యూసులను తాగినప్పుడు మన శరీరంలో అతి వేగంగా కొన్ని పోషకాంశాలు చేరుతాయి. ఈ పోషకాంశాలు శరీరంలోని అన్ని బాగాలకు చాలా త్వరగా చేరుతాయి. అయితే మీరు తీసుకొనే జ్యూసులు తాజా పండ్లు, కూరగాయలతో తయారు చేసినవై ఉండాలి. అయితే ఈ జ్యూసులకి వేరే ఇతర పదార్థాలు కానీ లేదా క్యాలరీలను కానీ చేర్చకుండా తీసుకోవడం వల్ల మందపాటి జుట్టు పొందడంలో మంచి ఫలితాలను మీరు చూడవచ్చు.

క్యారెట్ :

క్యారెట్ :

జుట్టు పెరుగుదలకు అవసరం అయ్యే విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఈ విటమిన్స్ , మినిరల్స్ జుట్టు పెరుగుదలకు మాత్రమే కాదు, జుట్టు మందగా పెరగడానికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మీకు అవసరం అయ్యే బీటాకెరోటిన్ అందుతుంది. ఇది జుట్టు సిబం ఉత్పత్తికి సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!. నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరకట్టానుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.

బంగాళదుంప జ్యూస్:

బంగాళదుంప జ్యూస్:

ఈ రెమడీ గురించి చాలా తక్కువ మందికి తెలిసిన పరిహారం. జుట్టు నష్టాన్ని అరికట్టడానికి మరియు మీ జుట్టు తంతువులు మందగా పెరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. మీ జుట్టు నేచురల్ గా పెంచుకోవాలనుకుంటే బంగాళదుంప రసాన్ని కేశాలకు పట్టించండి. ఎలా అప్లై చేయాలి: బంగాళదుంపలను మెత్తగా పేస్ట్ చేసి ఆ రసాన్ని లేదా గుజ్జును తలకు పెట్టించవచ్చు లేదా చక్రాల్ల కట్ చేసి తలకు బాగా మసాజ్ చేసి, 15నిముషాలు అలాగే వదిలేసి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. బంగాళదుంపలో విటమిన్ బి జుట్టు పొడవుగా మరియు బలంగా పెరిగేలా చేస్తుంది.

ఉసిరి: ఉసిరి(ఆమ్లా):

ఉసిరి: ఉసిరి(ఆమ్లా):

ఉసిరికాయలో విటమిన్ సి మరియు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలం. ఇది జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు రంగు మారిపోకుండా పోరాడుతుంది. జుట్టు మందంగా పెరగేలా చేయడంతో పాటు హెయిర్ పిగ్మెంటేషన్ మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ ఉసిరిని మీ డైట్లో చేర్చుకోవడంతో పాటు తలకు అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే: ఉసిరిపొడి మరియు నిమ్మరసంను సమానంగా తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మరియు ఆమ్లానూనెను రెగ్యులర్ గా పెట్టుకోవడం వల్ల జుట్టు నల్లగా మరియు ఒత్తుగా, బలంగా పెరగడానికి సహాయపడుతుంది.

మందారం:

మందారం:

మందారం ఆకులు రసాన్ని తలకు పట్టించడం వల్ల తల శుభ్రపడటంతో పాటు మంచి షైనింగ్ వస్తుంది. మందరారసాన్ని తలకు పట్టించడం ఒక పాత పద్దతి అయినా, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హైబిస్కస్ ఆయిల్ (మందార నూనె)ఇన్ప్లమేషన్ ను(చర్మానికి తగినంత తేమను అంధించి మంటను)తగ్గిస్తుంది. మరియు అద్భుతమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కేశాలకు తగినంత తేమను అంధించడానికి మరియు జుట్టుకు ఆరోగ్యకరమైన షైనింగ్ ఇవ్వడానికి ఈ ఆయిల్ ను వివిధ రకాల నూనెల్లో జోడిస్తారు. మందారను నూనెను కొబ్బరి నూనెతో జోడించి, వేడి చేసి చల్లారిన తర్వాత ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మందార నూనెతో అనేకమైన బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

నారింజలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు మందంగా పెరిగేలా చేస్తుంది. మందపాటి జుట్టు పొందడంలో ఈ జ్యూసులో టాప్ లిస్ట్ లో ఉండాల్సినది ఈ ఆరెంజ్ జ్యూస్ ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్ సి అవసరమవుతుంది. హెయిర్ ఫోలిసెల్స్ మీద ప్రభావం చూపే ఫ్రీరాడికల్స్ మీద పోరడే గుణం ఈ ఆరెంజ్ లోని యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉన్నాయి.

కివి:

కివి:

కివి పండ్లలో విటమిన్లు, పొటాషియం అధికం. ఈ పండు సిట్రస్ జాతికి చెందినది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్ గా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది కివి పండ్లలో విటమిన్ సి ని కూడా కనుగొనబడినది. మీ జుట్టు బలానికి కివి పండ్ల రసాన్ని ఇంటర్నల్ గా తీసుకోవచ్చు.

మామిడి రసం:

మామిడి రసం:

పండ్లలో రారాజు మామిడి. ఎందుకంటే ఏ పండ్లలో లేని విధంగా మామిడిలో విటమిన్స్ మరియు మినిరల్స్ అత్యధికంగా ఉన్నాయి. ఇందులో ఉండే హై విటమిన్ కంటెంట్ మందపాటి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయ. మ్యాంగో జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది జుట్టు పెరుగుదలకు శరీరంలో బాగా సహాయపడుతుంది.

ద్రాక్ష:

ద్రాక్ష:

ద్రాక్ష రసంలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తంలోనికి ఆక్సిజన్ తీసుకుపోయే హీమోగ్లోబిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. ఇది తలకు అవసరం అయ్యే రక్త ప్రవాహాన్నిమరియు ఆక్సిజన్ ప్రవాహాన్నిపెంచుతుంది . అలాగే గ్రేప్ సీడ్ ఆయిల్ కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ జుట్టు గ్రీవము ఉద్దీపన మరియు జుట్టు పునరుద్ధరణ సహాయపడుతుంది. ఇంకా ఈ నూనె కర్లింగ్ హెయిర్ ఉన్న వారికి అప్లై చేస్తే జుట్టు నిర్వాహణకు బాగా సహాయపడుతుంది. ఎలా అప్లై చేయాలి?: రాత్రి నిద్రించడానికి ముందుగా ఈ నూనెతో తలకు బాగా మసాజ్ చేయాలి. మంచిగా జుట్టుపెరుగుదలకు ఇది బాగా సహాయపడుతుంది. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసేసుకోవాలి.

English summary

9 Juices For Thick Hair

Thick, long and lustrous hair is the reflection of your overall health and beauty. It is well-known that juice is great for your overall health, energy and fitness. It is not different in the case of your hair growth.
Desktop Bottom Promotion