For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో చుండ్రు: నిమ్మతో నివారణా చిట్కాలు

By Lakshmi Perumalla
|

చుండ్రు అనేది స్త్రీ లలో కన్నా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. మీ భుజం మీద పొట్టు వలె రాలి చాలా ఇబ్బందికరముగా ఉంటుంది. పురుషుల్లో చుండ్రు పొడి ఫలితంగా ఉండవచ్చు. చాలా సందర్భాలలో నెత్తిమీద చర్మం, బాక్టీరియా లేదా శిలీంధ్ర వ్యాధుల వలన వస్తుంది. పురుషుల్లో చికిత్స లేదా సరైన జుట్టు సంరక్షణ లేకపోవుట వలన నిరంతరం చుండ్రు సమస్య ఉంటుంది. కొన్నిసార్లు పురుషులలో చుండ్రు సమస్య షాంపూ మార్పు కారణంగా,నీటిలోని అంటువ్యాధులు,భాగస్వామి దిండు ద్వారా సంక్రమణ మొదలైన కారణాల వలన ప్రారంభం కావచ్చు.

చుండ్రు సమస్యను తగ్గించడం లేదా నివారించటానికి ఇంటిలో చేసుకొనే అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఈ పరిష్కారాలలో నిమ్మరసంలో ఉన్న తేలికపాటి సిట్రస్ యాసిడ్ ఒక అద్భుతమైన రోగనివారణ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇతర సహజ పదార్థాలతో పాటు నిమ్మరసంను చేర్చి వివిధ పద్ధతులు మరియు పదార్థాల ఆధారంగా షవర్ ముందు లేదా తర్వాత అన్వయించవచ్చు.

నిమ్మతో పాటు ఇంటి పరిష్కారాలలో కొబ్బరి నూనె,ఆలివ్ నూనె,హాజెల్ ఆయిల్,పిప్పరమెంటు నూనె, వెనిగర్,పుల్లటి పెరుగు,టీ మొదలైన పదార్దాలు ఉన్నాయి. ఈ పదార్థాలు పురుషుల్లో చుండ్రు నియంత్రించడంలో సహాయం చేస్తాయి. అవి క్లీన్సెర్ లేదా ఒక మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా పనిచేసి మీ జుట్టుకు కండిషనింగ్ ఇస్తాయి. అలాగే మీ జుట్టును ఆరోగ్యకరముగా మరియు శుభ్రంగా ఉంచుతుంది. అంతేకాక చుండ్రు నియంత్రించడంలో భారీస్థాయిలో సహాయపడుతుంది. నిమ్మలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మొండి పట్టుదలగల చుండ్రును వదిలించటంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

చుండ్రును తగ్గించటానికి నిమ్మతో కలిపి అనేక ఇంటి పరిష్కారాలు ఉన్నాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

గోరువెచ్చని కొబ్బరి నూనెలో 2 స్పూన్స్ తాజా నిమ్మరసం కలిపి తల చర్మంపై మసాజ్ చేయాలి. మసాజ్ అయిన తర్వాత మీ జుట్టును 15 నిముషాలు అలా వదిలేసి తర్వాత శుభ్రం చేయాలి. చుండ్రు తొలగించడానికి దీన్ని వారంలో కనీసం 2-4 సార్లు క్రమం తప్పకుండా చేస్తే మెల్లగా సమర్థవంతంగా పనిచేస్తుంది.

హాజెల్ ఆయిల్

హాజెల్ ఆయిల్

ఒక స్పూన్ గోరువెచ్చని హాజెల్ ఆయిల్ మరియు ఒక స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకు వృత్తాకార మసాజ్ ఉపయోగించి చేయాలి. తర్వాత 20 నిముషాలు అలా వదిలేసి తర్వాత శుభ్రం చేయాలి. నిమ్మకాయ ముక్కలను నేరుగా చుండ్రు తొలగించడానికి జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

హాజెల్ ఆయిల్

హాజెల్ ఆయిల్

ఒక స్పూన్ గోరువెచ్చని హాజెల్ ఆయిల్ మరియు ఒక స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకు వృత్తాకార మసాజ్ ఉపయోగించి చేయాలి. తర్వాత 20 నిముషాలు అలా వదిలేసి తర్వాత శుభ్రం చేయాలి. నిమ్మకాయ ముక్కలను నేరుగా చుండ్రు తొలగించడానికి జుట్టుకు మసాజ్ చేయవచ్చు.

వెనిగర్

వెనిగర్

చుండ్రు కొరకు 4 టేబుల్ స్పూన్ల సైడర్ వినెగార్ మరియు 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపిన మిశ్రమం ఒక గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. దీనిని వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. రెగ్యులర్ మరియు నిరంతర వినియోగంతో చుండ్రు తొలగించడానికి సహాయం చేస్తుంది.

పుల్లటి పెరుగు మరియు తేనె

పుల్లటి పెరుగు మరియు తేనె

చుండ్రు వదిలించుకోవటం కొరకు నీటి పుల్లని పెరుగు,నిమ్మరసం మరియు తేనె మిశ్రమం ఒక గొప్ప మార్గం. కనీసం 20 నిమిషాలు అలా ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధానాన్ని ఒక వారంలో 2-3 సార్లు అనుసరించండి.

టీ

టీ

టీ అనేది చుండ్రు వదిలించుకోవటం కొరకు ఒక గొప్ప మార్గం. అర కప్పు నీటిలో 2 స్పూన్స్ టీ పొడి వేసి మరిగించి వడగట్టాలి. దీనిలో 1 టీస్పూన్ నిమ్మరసం కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. 15 నిముషాలు అలా వదిలిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

హాట్ ఆయిల్ చికిత్స

హాట్ ఆయిల్ చికిత్స

దీనికి 1 స్పూన్ ఆముదము,2 స్పూన్స్ కొబ్బరి నూనె మరియు 1 స్పూన్ నిమ్మరసం కలిపి హాట్ ఆయిల్ చికిత్స చేయవచ్చు. నెత్తిమీద చర్మంపై వృత్తాకార మర్దనా కదలికలు చేయాలి. గొప్ప ఫలితాల కోసం కనీసం 20 నిమిషాలు పాటు వెచ్చని తేమ టవల్ ను తలకు చుట్టాలి.

హెన్నా చికిత్స

హెన్నా చికిత్స

గోరింటాకు పొడిలో 4 స్పూన్స్ నిమ్మరసం,4 స్పూన్స్ కాఫీ,2 పచ్చి గుడ్లు,1 స్పూన్ మెంతి సీడ్ పౌడర్, తగినంత టీ సారం వేసి చిక్కటి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత కడగాలి.

English summary

Dandruff In Men: Cure With Lemon

Dandruff in men is a huge turn off to any woman. It results in quite an embarrassing moment to have flakes on your shoulder while you are on a date. Dandruff in men can be a result of dryness in scalp or in many cases bacterial or fungal infection.
Desktop Bottom Promotion