For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టు శాశ్వత పరిష్కారానికి బెస్ట్ నేచురల్ టిప్స్..!

|

ముఫ్పై అయిదేళ్ల తర్వాత జుట్టు తెల్లబడటం సర్వసాధారణం. అంతకు ముందే జుట్టు తెల్లబడుతూ ఉంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, వేపుళ్లు, మసాలాలు తినడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడు తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం మొదలు పెడితే నేటి యువత మానసికంగా కృంగిపోతున్నారు. మీ వెంట్రుకలు తరచూ తెల్లబడుతుంటే చాలామంది ఆలోచనలో మునిగిపోతుంటారు. అలాగే ఆ తెలుపును కప్పి పుచ్చుకునేందుకు రకరకాల రంగులు పూస్తుంటారు. మానసిక, శారీరక ఒత్తిడి కారణంగానే వెంట్రుకలు తెల్లబడతాయని చాలామంది అపోహ పడుతుంటారు.

మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి. వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. తెల్ల జుట్టును తిరిగి నల్లగా మార్చలేము. కానీ, యుక్త వయసులో జుట్టు తెల్లబడితే అంటే బాల నెరుపు వస్తే దాన్ని నివారించవచ్చు అంటున్నారు సౌందర్య నిపుణులు.

నిగనిగలాడే వెంట్రుకల కోసం... గుడ్డు లేదా పెరుగును వేప ఆకుల పే‌స్ట్‌లో కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ కేశాలకు కండిషనర్‌లా పనిచేస్తుంది.

హెన్నా తెల్లవెంట్రుకలను బ్రౌన్‌ గా మారుస్తుంది. అయితే హెన్నాను ఎక్కువ రోజులు వాడకూడదు. దీనిలో ఉండే రసాయనాలు జుట్టులో ఉండే నూనెను తొలగిస్తాయి. దాంతో జుట్టు మృదుత్వం కోల్పోతుంది. నాణ్యమైన కలర్‌ని నిపుణుల సలహామేరకు వాడటం మంచిది.

కప్పు ముల్తానామిట్టి, ఐదు టేబుల్ సూన్ల కొబ్బరినూనె, గుడ్డు బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత కండిషనర్‌షాంపూతో తలస్నానం చేయాలి. నిస్తేజంగా మారిన జుట్టు మృదువుగా మారుతుంది.

అరకప్పు ఉసిరిపొడి, 2 టేబుల్‌స్పూన్ల ఆముదం, గుడ్డు కలిపి జుట్టుప్యాక్‌లా వేయాలి. మాడుకు కూడా రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వెంట్రుకలు చిట్లకుండా, మృదువుగా అవుతాయి.

ఒక స్పూన్‌ కర్పూరం పొడిని కొబ్బరినూనెలో కలుపుకొని ప్రతిరోజు తలకి మసాజ్‌ చేసుకోవాలి.

మల్లెతీగ వేర్లని, నిమ్మరసంతో కలిపి గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

తలస్నానానికి వీలైనంత వరకు కుంకుడు, శీకాయ, హెర్బల్‌ షాంపూలనే వాడాలి.

జుట్టుకు తరచూ నూనెతో మసాజ్‌ చేయడం చాలా అవసరం. వారానికి రెండు-మూడు సార్లు మస్టర్డ్‌ ఆయిల్‌ కానీ, కొబ్బరినూనె కానీ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి.

కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది.

తాజా కొత్తిమీర ఆకుల రసం రాయడం వల్ల జుట్టుకి నిగారింపు వస్తుంది.

ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

కరివేపాకును రోజూ ఆహారంలో అంటే, పప్పుచారులోనూ, తాలింపులోనూ, పచ్చడిగానూ, కారప్పొడిగానూ చేసుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకుని పచ్చిగానే రుబ్బి తీసుకుంటే ( తింటే ) పూర్తి ఫలితం ఉంటుంది. కరివేపాకును ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి.

తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలంతా మసాజ్‌ చేస్తే బ్లడ్‌ సర్క్యులేషన్‌ పెరిగి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.

English summary

How to Get Rid of White Hair Naturally?

So you have grey hair and you want to figure out how to treat it. Many people are trying to figure out how to prevent grey hair.A lack of certain vitamins and minerals result in this disorder in young age.Diet is of utmost importance in the prevention and treatment of graying. Have a diet rich in vitamin B. incorporate lots of wheat, oats, green leafy vegetables, nuts and fruits