For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!

|

కేశాలను సంరక్షించుకోవడం కోసం చాలా మంది కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. ఉల్లిపాయ ఇంట్లో లభించే బెస్ట్ హెయి ప్రొడక్ట్. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!.

నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దాంతో పాటు కేశాలు చిట్లడానికి అడ్డుకుంటుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరికట్టాలనుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ రసాన్ని జుట్టు పట్టించాలి.

ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తర్వాత జుట్టు పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రహించవచ్చు. ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలతో పాటు, జుట్టు పోషణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ హోం రెమడీ వల్ల కేశాలు షైనింగ్ మెరుస్తుండటమే కాదు, కేశాలను బలంగా కూడా ఉంచుతుంది. జుట్టు రాలడంతో పోరడా, జుట్టు పెరగాలంటే ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ప్టించాల్సిందే.

ఉల్లిపాయ రసాన్ని జుట్టు సంరక్షణలో ఉపయోగించడానికి చాలా మార్గాలున్నాయి. ఉదా: ఉల్లిపాయ రసాన్ని తేనెతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని నేచురల్ గా తగ్గిస్తుంది. అదే విధంగా, సింపుల్ గా ఉల్లిపాయ ముక్కలను రుబ్బి ఆ రసాన్ని తలకు పట్టించడం ద్వారా జుట్టును పెంచుకోవచ్చు. కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో ఉల్లిపాయ జ్యూస్ ను మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల చిక్కుముడులను మరియు పొడి జుట్టును నివారిస్తుంది. దాంతో పాటు మీ కేశాలు మంచి మెరుపుతో పాటు, నిర్వాహణ కూడా సులభం అవుతుంది. కాబట్టి ఈ క్రింద ఇచ్చిన ఆనియన్ హెయిర్ చిట్కాల ట్రై చేసి, రిజల్ట్ చూడండి. స్పాలకు, బ్యూటీపార్లకు డబ్బు ఖర్చు చేయడం మానుకొని ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ తో వ్యత్యాసాన్ని గమనించండి . ఒక సూచన ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ ను మినిమం ఒక నెల పాటించాల్సి ఉంటుంది. మరి ఆనియన్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దామా...

ఉల్లిపాయ జ్యూస్:

ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల మాసిన వాసన శుభ్రంగా తొలగిపోతుంది.

ఉల్లిపాయ రసం -కొబ్బరినూనె:

ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. హెయిర్ ఆయిల్స్ కు మీరు ఎసెన్సియల్ ఆయిల్స్(రోజ్ మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ మరియు సీడర్ వుడ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.

ఉల్లిపాయ రసం -బీర్:

ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి. ఇలా వారంలో రెండు సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

ఉల్లిపాయ రసం-తేనె:

ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా జెల్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించిన రెండు గంటల తర్వాత లెమన్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ జెల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఈ హెయిర్ జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ రసం-రమ్:

ఒక కప్పు బీర్ లో ఉల్లిపాయను రాత్రంతా నానబెట్టాలి. ఈ బీర్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం-నిమ్మరసం:

ఉల్లిపాయ రసానికి నిమ్మరసం కలిని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది మరియు చుండ్రును వదలగొడుతుంది. నిమ్మరసం తలను శుభ్రపరుస్తుంది మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

ఉల్లిపాయ రసం-పెరుగు:

ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసి అందులో ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, బాగా గిలకొట్టి తలకు మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి షాంపూతో తలస్నానం చేయాలి.

ఉల్లిపాయ రసం-ఎగ్ వైట్:

గుడ్డు జుట్టు సంరక్షణకు చాలా మంచిది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. కాబట్టి గుడ్డులో ఉల్లిపాయ రసాన్ని కలిపి, బాగా గిలకొట్టి, తడి జుట్టు మీద అప్లై చేయాలి 25-30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

English summary

Onion Juice For Hair Growth | జుట్టు పెరుగుదలకు అద్భుత ఔషదం ఉల్లిపాయ రసం!

Onion is one of the best hair product available at home. You might hate the pungent odour and the tearful eyes that are linked with onion. However, onion is very good for the hair as it fights various hair problems like hair loss and split ends.
Story first published: Thursday, July 18, 2013, 17:41 [IST]
Desktop Bottom Promotion