For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్ని రకాల జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

|

అలోవెర(కలబంద)ఆరోగ్యానికి, చర్మసంరక్షణకు ఎంత మేలు చేస్తుందో మనందరికి తెలుసు. అలోవెరా గుజ్జును శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు ఇటు చర్మానికి మరియు కేశాలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలకు వాడే వివిధ రకాల ఔషధాలలో అలోవెరాను ఉపయోగించారు. ఇంకా మొటిమల నివారణకు కూడా ఉపయోగించారు. చర్మ సమస్యల్లో మొటిమలు పెద్ద సమస్య. ముఖారవిందాన్ని పోగొడుతుంది. అందుకు ఈ గ్రీన్ కలర్ అలోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాదు చాలా రకాల హేర్బల్ ఫేస్ ప్యాక్ కుడా అలోవెర జెల్ ను ఉపయోగించి చర్మంలో అద్భుతమైన మార్పుును ఇస్తుంది.

చర్మ సమస్యలను నివారించడం మరియు చర్మానికి మాయిశ్చరైజింగ్ చేయడం అలావుంచితే, అలోవెరా జెల్ ను కేశ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. అలోవెరాలో హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇది హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. కురులు పెరిగేలా చేస్తుంది. ఇంకా కురులు సాఫ్ట్ గా తయారవుతాయి. కాబట్టి మీరు మీ ఇంట్లో అలొవెరా చెట్టు పెంచుకోవడం వల్ల ఇటు స్కిన్, హెయిర్ బెనిఫిట్స్ ను మెండుగా పొందవచ్చు. లేదా అలొవేరా గుజ్జు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నది. అది తెచ్చి ఉపయోగించుకోవచ్చు. అలొవెరా జెల్ కేశాలను ఎలా ఉపయోగపడుతుందో ఒక సారి చూద్దాం...

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

హెయిర్ ఫాల్ ను అరికడుతుంది: అలోవెరాలో వివిధ రకాల మినిరల్స్, విటమిన్స్ కనగొనబడినది. ఇది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. మీరు ఉపయోగించే షాంపుకు రెండింతలు అలోవెర జెల్ ను కలిపి తలకు పట్టించి శుభ్రం చేసుకొంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

నేచురల్ కండీషనర్: అలోవెరా నేచురల్ హెయిర్ కండీషనర్. ఇది హనికలిగించే రసాయనిక హెయిర్ కండీషనర్స్ కంటే చాలా మంచిది. కాబట్టి అలొవెరా జెల్ ను మీ కేశాలకు, తల మాడుకు బాగా పట్టించి, మర్దన చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

బట్టతల: బట్టతల ఏర్పడుతోందా? జుట్టు రాలడాన్ని అరికట్టి, హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. తల మాడుకు అలోవెర జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

నేచురల్ మాయిశ్చరైజర్: కురుకలు మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. కురులు రాలడం అరికట్టి ఎప్పుడూ ఒకేలా ఉండేలా చేస్తుంది.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

చుండ్రు: మీరు కనుక చుండ్రు సమస్యతో బాధపడుతున్నా లేదా తల మాడు దురదగా ఉన్నా, పొడి బారి ఉన్నా అలోవెరా జెల్ ను అప్లై చేయడం వల్ల సమస్య తగ్గుతుంది. అలోవెరా జెల్ ను మర్దన చేసిన తర్వాత అరగంట పాటు అలాగే ఉంచాలి. తర్వాత తలస్నానం చేయాలి. దాంతో చుండ్రు సమస్య పూర్తిగా నివారించబడుతుంది.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

తలలోని చిన్న చిన్నమొటిమలు: తలలో వచ్చే చిన్న చిన్న మొటిమలు చాలా బాధాకరమైనవి, ఇబ్బంది పెడుతుంటాయి. దీన్ని నుండి ఉపశమనం పొందాలంటే అలొవెరా జెల్ ను అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

నుదురు బాగం: చాలా మంది నుదురు బాగంలో హెయిర్ ఫాల్ సమస్యలను ఎదుర్కొంటున్నామని కంప్లైయింట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫోర్ హెడ్ లో వచ్చే మొటిమలు నివారించడంతో పాటు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

English summary

Use Of Aloe Vera For Hair Care | జుట్టు సమస్యలకు అద్భుత ఔషధం అలోవెరా

We all know the skin benefits of aloe vera. The wonder plant and its extract have many health and beauty benefits. Aloe vera juice is not only good for the body but also for the skin and hair.
Story first published: Saturday, February 23, 2013, 15:49 [IST]
Desktop Bottom Promotion