సహజ పద్దతుల్లో జుట్టు రాలడాన్ని తగ్గించడం ఎలా

By Lakshmi Perumalla
Subscribe to Boldsky

జుట్టు కోల్పోవడం అనేది ఒక భయంకరమైన విషయం అని చెప్పవచ్చు. కాలుష్యం,అనారోగ్యమైన జీవనం మరియు అనారోగ్య అలవాట్ల వలన హెయిర్ ఫాల్,జుట్టు కోల్పోవడం,కఠినమైన మరియు పొడి జుట్టు వంటి మొదలైన జుట్టు సమస్యలు వస్తాయి. మీరు వాటిని బలంగా మరియు మెరిసేలా చేయడానికి మీ జుట్టు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు కోల్పోవడం అనేది జుట్టు ప్రధాన సమస్యలలో ఒకటిగా ఉంది. జుట్టు కోల్పోవటానికి చుండ్రు,పొడి జుట్టు,జుట్టు వాష్ కోసం హార్డ్ నీటిని ఉపయోగించడం,జుట్టు చెడు నిర్వహణ మొదలైనవి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. జుట్టు నష్టం చికిత్స కోసం అనేక రసాయన షాంపూలు మరియు సీరంలు అందుబాటులో ఉన్నాయి. కానీ రసాయన చికిత్స చాలా ఇన్ స్టంట్ మరియు తక్కువ రోజులు ప్రబావం ఉంటుంది. రసాయనాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండి జుట్టుకు మరింత హానికరం కలిగిస్తాయి.

Ways To Prevent Hair Loss Naturally

మీరు సహజంగా జుట్టు నష్టాన్ని ఎలా నిరోధించాలో తెలుసుకోవాలి. జుట్టు నష్టాన్ని నిరోదించటానికి అనేక సహజమైన పరిష్కారాలు ఉన్నాయి. వాటిలో ఏ దుష్ప్రభావాలు ఉండవు. సహజ చికిత్సల ఫలితాలను మీకు చూపించడానికి చాలా కాలం పడుతుంది. కానీ ఫలితాలు దీర్ఘకాలిక మరియు శాశ్వతంగా ఉంటాయి. క్రింద సహజంగా జుట్టు నష్టాన్ని నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

1. వేడి నూనెతో మసాజ్

జుట్టు నష్టాన్ని నిరోధించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే క్రమం తప్పకుండా ఒక మంచి వేడి నూనెతో మసాజ్ చేయటం అని చెప్పవచ్చు. ఒక వేడి నూనెతో జుట్టు మసాజ్ చేయటం అనేది సహజంగా జుట్టు నష్టాన్ని నిరోధించడానికి ఒక మార్గం. ఇది దెబ్బతిన్న జుట్టును తొలగిస్తుంది. అంతేకాక జుట్టు కోసం మంచి పోషకాలను ఇస్తుంది. వేడి నూనె మర్దనా జుట్టును బలంగా ఉంచటానికి మరియు జుట్టు రాలకుండా నిరోధిస్తుంది. మీరు జుట్టుకు కనీసం వారానికి ఒకసారి వేడి నూనె మర్దనా చేయటం చాలా మంచిది.

2. కొబ్బరి పదార్దాలు

కొబ్బరి చాలా ఆరోగ్యకరమైన పండు. దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. పొడి జుట్టుకు పోషణను ఇస్తుంది. కొబ్బరి నూనె మరియు కొబ్బరి పాలు రెండు కొబ్బరి పదార్దాలు కూడా సహజంగా జుట్టు నష్టం సమస్యల చికిత్సలో చాలా ఉపయోగపడతాయి.ఇది జుట్టుకు పోషణ,మృదువుగా మరియు బలంగా ఉంచటానికి సహాయపడుతుంది.అందువలన కొబ్బరి సహజంగా జుట్టు నష్టాన్ని నిరోధించడానికి ఒక మంచి సమాధానం అని చెప్పవచ్చు.

3. ఆలోవెరా

ఆలోవెరా సహజంగా జుట్టు చికిత్స కోసం చాలా ఉపయోగకరమైన మొక్క అని చెప్పవచ్చు. ఈ మొక్క చాలా సులభంగా మీ తోటలో పెంచవచ్చు.ఆలోవెరా పేస్ట్ మరియు ఎండిన పొడి రూపంలో రెండు రకాలుగా ఉపయోగించవచ్చు. జుట్టు మీద పేస్ట్ రాసి 15-30 నిమిషాలు ఉంచాలి. కలబంద జుట్టు కణజాలంను బలోపేతం చేయుట మరియు వాటి పెరుగుదలకు సహాయపడుతుంది.కలబంద జుట్టుకు ఏ దుష్ప్రభావాలు లేకుండా వారానికి రెండు సార్లు ఉపయోగించవచ్చు.అందువలన ఆలోవెరా జుట్టు నష్టాన్ని నిరోధించడానికి ఒక సహజ మార్గం అని చెప్పవచ్చు.

4. . సహజ జుట్టు మాస్క్ లు

జుట్టు నష్టం నివారణకు మంచి ఫలితాల కొరకు హెయిర్ మాస్క్ లను ఉపయోగించవచ్చు. వారానికి ఒకసారి ఈ జుట్టు మాస్క్ లను వేస్తె మీరు గణనీయమైన తేడాను చూడవచ్చు. జుట్టు మాస్క్ లకు గోరింటాకు,కలబంద,పెరుగు,వేప ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాక ఇతర సహజ మూలికలతో అనేక కాంబినేషన్ లను ఉపయోగించి ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఈ జుట్టు మాస్క్ లు ఈ విధంగా జుట్టు నష్టం సమస్యల చికిత్సలో ఉపయోగకరంగా ఉంటాయని నిరూపించబడింది. జుట్టు చిట్లుటను నిరోధించడానికి మరియు మూలాలకు పోషణను అందిస్తుంది.

5. ఉసిరి

ఉసిరిలో జుట్టును బలోపేతం చేసే లక్షణాలు ఉన్నాయి. మీ జుట్టును సున్నితంగా చేయటానికి,రక్షించటానికి మంచి పోషకాలు ఉన్నాయి. ఉసిరి రసం మీ జుట్టుకు రాసి 15 నిమిషాలు తర్వాత జుట్టును చల్లటి నీటితో శుభ్రం చేయాలి. కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీరు మీ జుట్టు చివరలో ముఖ్యమైన తేడాను గమనించవచ్చు. ఉసిరిని నూనె,జుట్టు ప్యాక్లు మొదలైన వాటిలో కలబందతో కలిపి మిశ్రమ రూపాల్లో ఉపయోగించవచ్చు. నిజానికి ప్రతిరోజూ మీ ఆహారంలో ఒక భాగంగా ఉసిరిని తినడం ద్వారా కూడా మీ జుట్టు నాణ్యతను మెరుగుపరచవచ్చు.

మీ జుట్టును ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా చేయటానికి మరియు జుట్టు నష్టాన్ని నిరోధించటానికి ఈ సహజమైన చిట్కాలు ఉపయోగపడతాయి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Ways To Prevent Hair Loss Naturally

    Hair loss is a terrible thing that could happen to anybody. Pollution, unhygienic living and unhealthy habits have resulted in hair problems like hair fall, hair loss, rough and dry hair, etc. You must take care of your hair to make them strong and shiny.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more