For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనెతో జుట్టుకు కలిగే 10 ప్రయోజనాలు

|

సాధారణంగా నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వాటి వాడకం ఎక్కువ. ఇవి తెల్లనువ్వులు, నల్లని నువ్వులు రెండు రకాలుగా బాగా వాడుకలోనున్నవి. నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసిన నువ్వుల నూనె ఇటు వంటకాలలోను, అటు ఆయుర్వేద పరంగాను ప్రపంచ వ్యాప్తంగా విరివిగా వినియోగించబడుతోంది. అన్నినూనెల్లోకి నువ్వుల నూనె శ్రేష్టమైనదని ఆయుర్వేదం చెబుతుంది. నువ్వు గింజల్లో నూనె పదార్థంతోపాటు ప్రొటీన్ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అదే నువ్వుల ప్రత్యేకత.

ముఖ్యంగా నువ్వుల నూనె వల్ల చర్మం, మరియు జుట్టు ఇంకా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఈ నూనెను వంటలకు మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. వివిధ రకాల కాస్మొటిక్స్ మరియు బాడీలోషన్లను నువ్వుల నూనెతో తయారుచేస్తున్నారు. నువ్వుల నూనె ఆరోగ్యం గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈరోజు నువ్వుల నూనెతో పొందే బ్యూటిబెనిఫిట్స్ గురించి ముఖ్యంగా హెయిర్ బ్యూటీబెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. జుట్టుకు నువ్వుల నూనె అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా స్ట్రాంగ్ గా పెరుగుతుంది. అంతేకాదు, జుట్టుకు మరిన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా పొందవచ్చు.

జుట్టును అందంగా మార్చుతుంది:

జుట్టును అందంగా మార్చుతుంది:

తలకు నూనె పట్టించడం వల్ల జుట్టు మిళమిళలాడుతుంటుంది . ఈ నూనె మరీ అతుక్కోకుండా డ్రైగా మరియు డల్ గా ఉన్న హెయిర్ కు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. మరియు జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి నువ్వులు నూనె ఉపయోగపడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది :

నువ్వుల నూనెతో కేశాలకు మరియు తలకు బాగా పట్టిస్తే , హెయిర్ సెల్స్ యాక్టివ్ గా ఉండే హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

అద్భుతంగా పనిచేస్తుంది:

అద్భుతంగా పనిచేస్తుంది:

జుట్టు రాలడం, చాలా తక్కువ హెయిర్ గ్రోత్ ఉండటం మరియు ఒత్తిడి మరియు టెన్షన్ వల్ల జుట్టు పెరుగుదలలో సమస్యలు. ఈ సమస్యలు నివారించడానికి నువ్వుల నూనె వేడి చేసి తలకు మసాజ్ చేయ డం వల్ల ఇందులో ఉండే కూలింగ్ సామర్థ్యం స్ట్రెస్ మరియు టెన్షన్ తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టును కాంతివంతంగా మార్చుతుంది:

జుట్టును కాంతివంతంగా మార్చుతుంది:

నువ్వుల నూనెలోని ప్రయోజనాల వల్ల తలను కాంతివంతంగా మార్చుతుంది. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో హెయిర్ ఫోలీ సెల్స్ పెంచుతుంది మరియు చిట్లిన జుట్టును నివారిస్తుంది.

హెయిర్ డ్యామేజ్:

హెయిర్ డ్యామేజ్:

నువ్వుల నూనె డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది . ఈ నూనె డ్రై, రఫ్ గా మరియు చిక్కుబడిని జుట్టును నివారిస్తుంది. మరియు జుట్టు యొక్క నాణ్యతను పెంచుతుంది.

కాలుష్యం నుండి రక్షణకల్పిస్తుంది:

కాలుష్యం నుండి రక్షణకల్పిస్తుంది:

నువ్వుల నూనె కాలుష్యం మరియు ఎండ నుండి జుట్టుకు రక్షణ కల్పిస్తుంది . కాలుష్యం, మరియు యూవీ కిరణాల ప్రభావం జుట్టు మీద పడకుండా రక్షణ కల్పిస్తుంది.

చుండ్రును నివారిస్తుంది:

చుండ్రును నివారిస్తుంది:

నువ్వుల నూనెతో జుట్టు పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. చాలా వరకూ జుట్టు సమస్యలు చుండ్రువల్లనే ఎదురవుతాయి . చుండ్రు సంబంధిత సమస్యలను నివారించడానికి ఒక అద్భుతమైన మార్గం నువ్వుల నూనె.

నేచురల్ మాయిశ్చరైజర్:

నేచురల్ మాయిశ్చరైజర్:

నువ్వుల నూనెలో పోషకాంశాలు అధికంగా ఉన్నాయి. అందుకే నువ్వుల నూనెను తలకు పట్టిస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది నువ్వుల నూనెతో హెయిర్ ప్యాక్ మరియు మాయిశ్చరైజర్ వల్ల తాత్కాలికంగా జుట్టు సాఫ్ట్ గా మారుతుంది.

జుట్టు తెల్లబడటం నివారిస్తుంది:

జుట్టు తెల్లబడటం నివారిస్తుంది:

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. నువ్వుల నూనె తలకు పట్టించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

వెల తక్కువ:

వెల తక్కువ:

నువ్వుల నూనె మార్కెట్లో మనకు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

English summary

10 Sesame Oil Benefits For Hair

Sesame oil is nothing less than a magical potion which works great with making our body look better. Be it the skin or hair, sesame oil has numerous advantages for all. Sesame oil is extracted from dried sesame seeds, generally of black sesame seeds.
Desktop Bottom Promotion