For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్లజుట్టు కనబడకుండా చేయడానికి 5అద్భుత ఉపాయాలు

|

సాధారణంగా ఒత్తైన నల్లజుట్టు, మద్యలో ఏదైనా ఒక తెల్ల వెంట్రుక కనబడిందంటే చాలు చాలా మంది హైరానాపడిపోతుంటారు. వయస్పైనవారిగా కనబడుతామేమో అని బెంగపెట్టుకొనే వారు ఉన్నారు. వయస్సైనవారికి గ్రేహెయిర్ ఒక సంకేతంగా భావిస్తారు. మరియు సహజంగా వయస్సైన వారిలోనే తెల్లజుట్టు అధికంగా కనిపిస్తుంటుంది. కానీ, అసమతుల్య ఆహారం, బ్యాడ్ లైఫ్ స్టైల్ మరియు అధిక ఒత్తిడి వల్ల చిన్నవయస్సులోనే తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటారు . చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడం వల్ల యవ్వనంలో ఉన్నవారు నలుగురిలోకి వెళ్ళాలంటే సిగ్గుపడుతారు మరియు ఇబ్బందికరంగా భావిస్తారు.

అయితే, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తెల్లవెంట్రుకలతో ఇబ్బంది పడే వారికోసం కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. ఈ ట్రిక్స్ ద్వారా తెల్లవెంట్రుకలను దాచేయవచ్చు. కానీ, తెల్ల జుట్టు గల కారణాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే, సమస్యను చాలా త్వరగా తగ్గించుకోగలుగుతారు. తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ను ఈ క్రింది విధంగా ఇవ్వబడింది.తెల్లజుట్టు కనబడకుండా చేయడానికి 5అద్భుత ఉపాయాలు

చిన్నవయస్సులోనే జుట్టు నెరవడానికి కారణమేమి?:క్లిక్ చేయండి

5 Amazing Tricks To Hide Grey Hair

1. జుట్టను సరిగా దువ్వుకోవాలి: ఒక గొప్ప ఉపాయం ఏంటంటే, తెల్ల జుట్టును హైడ్ చేయడానికి, తెల్లజుట్టు కనబడకుండా సరిగా దువ్వుకోవాలి. మీరు దువ్వుకొనే హెయిర్ స్టైలే మీ తెల్లజుట్టును కనబడనియకుండా చేస్తుంది. తెల్ల జుట్టున్న ప్రాంతంలో బ్లాక్ హెయిర్ తో కవర్ చేస్తే హెయిర్ స్టైల్ మార్చుకోవాలి.

2. కలరింగ్: తెల్లజుట్టును కనబడనియకుండా చేయడానికి మరో ఉపాయం కలరింగ్ వేసుకొని, హైడ్ చేయవచ్చు. అది కూడా మీనేచురల్ హెయిర్ కలర్ లా కనిపించే నేచురల్ కలర్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. తెల్ల జుట్టును దాచేయడానికి హెయిర్ కలర్ ఒక మంచి ట్రిక్. మార్కెట్లో వివిధ రకాల నేచురల్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు ఖచ్చితంగా ట్రై చేయవచ్చు.

3.హెన్నా పేస్ట్ థెరఫీ : హెన్నాలో కూడా కలరింగ్ లక్షణాలున్నాయి. ఇది ఎటువంటి గ్రేహెయిర్ అయినా సరే కవర్ చేసేస్తాయి. తెల్లగా ఉన్న జుట్టును హెన్నా కలర్ వల్ల తెల్ల జుట్టు రెడ్, బ్రౌన్ లేదా మెరూన్ కలర్ లోకి మార్చేస్తుంది. మరియు హెన్నా జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది మరియు అంతే కాదు, జుట్టును సాఫ్ట్ గా మరియు స్మూత్ గా మార్చేస్తుంది. అయితే, హెన్నాతో ఒక సమస్యఏంటంటే, హెన్నా కలర్ చాలా త్వరగా తొలగిపోతుంది. కాబట్టి, వెంటవెంటనే కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా హెన్నాను ఉపయోగిస్తుండాలి.

తెల్ల జుట్టు నివారించే హెల్తీ ఫుడ్: హోం రెమడీస్:క్లిక్ చేయండి

4. ఆయిలింగ్: హెయిర్ ఆయిల్ మసాజ్ తప్పకుండా తెల్లజుట్టును పోగొడుతుంది. అయితే ఆయిల్ మసాజ్ రెగ్యులర్ గా చేస్తుంటే, గ్రేహెయిర్ తగ్గుముఖం పడుతుంది. ఆయిల్ మసాజ్ వల్ల జుట్టుకు తగినంత పోషణను అందిస్తుంది. అందువల్ల, వారానికి రెండు సార్లు జుట్టుకు ఆయిల్ మసాజ్ తప్పకుండా చేయాలి . నేచురల్ హెర్బ్స్ తో తయారుచేసినటువంటి వివిధ రకాల నూనెలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

5. హెయిర్ మాస్క్: కొన్ని ప్రత్యేకమైన హెయిర్ మాస్క్ లు హెన్నా, గుడ్డు, పెరుగు గ్రేహెయిర్ ను బ్లాక్ గా మరియు షైనింగ్ గా మార్చడానికి అద్భుతంగా సహాపడుతాయి . ఈ నేచురల్ హెయిర్ ఆయిల్స్ జుట్టుకు తగినంత పోషణను అంధించి తిరిగి నేచురల్ కలర్ ను అంధిస్తుంది . ఇది కూడా ఒక మంచి ట్రిక్ .

English summary

5 Amazing Tricks To Hide Grey Hair

Grey hair is a sign of ageing and generally happens to old people. But unbalanced diet, bad lifestyle choices and too much of stress make even youngsters face grey hair problem. Grey hair makes a lot of youngsters feel shy and awkward.
Desktop Bottom Promotion