For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడానికి 5 అసాధారణ కారణాలు&నివారణ మార్గం

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెరటిన్‌ అనే పదార్థంతో చేయబడింది. చర్మా

|

జుట్టురాలడం అనేది సాధారణ సమస్య. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ రాలిపోతుందనే ఫిర్యాదును ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. జుట్టు కూడా చర్మం లాగానే కెరటిన్‌ అనే పదార్థంతో చేయబడింది. చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకుంటున్నామో, శిరోజాల పట్లా అలానే ఉండాలి. శరీరం మాదిరి వాటికీ పోషక విలువలు అవసరం. సహజంగా రోజుకు యాభై నుంచి వంద వెంట్రుకలు రాలుతాయి. అయితే అంత కంటే ఎక్కువ రాలినపుడే సమస్యగా భావించాలి.

జుట్టు రాలడానికి సహజ కారణాలు:
1. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు జుట్టు పొడిబారి తెగిపోయే అవకాశం ఉంది. తేమగా ఉన్నపుడు చిక్కుపడి రాలిపోతాయి.
2. సూర్య కిరణాలు, అతి నీలలోహిత కిరణాలు.
3. మానసిక ఒత్తిడి, వృత్తి, వ్యక్తిగత సమస్యలు, విద్యార్థులకైతే పరీక్షల భయం.
4. వేడి ఎక్కువగా ఉన్న నీళ్లతో తలస్నానం చేయడం, హెయిర్‌ డ్రయ్యర్ల వాడకం.
5. స్ట్రెయిటెనింగ్‌, రింగులు చేయించుకోవడం.

5 Unusual Causes Of Hair Loss & Natural Ways to Prevent

ఇతరకారణాలు
1. బట్టతల లేదా జట్టు రాలిపోవడం ప్రస్తుత ఆధునిక జన జీవన సమస్య. ఉరుకులు పరుగులతో కూడిన జీవనశైలిలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇలా ఎవరైనా సరే ఒత్తిడికి లోనుకాని వారుండరు. ఒకప్పుడు నడి వయసు వ్యక్తులకు బట్టతల వచ్చేది. అది వంశపారంపర్యంగా వచ్చేదని సరిపెట్టుకునేవారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. పాతికేళ్ల యువతీ యువకులు కూడా బట్టతల, జుట్టురాలిపోవడం లాంటి సమస్యలతో ఆందోళన చెందుతున్నారు.

2. కంప్యూటర్‌తో సహ జీవనం, ఆహారపు అలవాట్లలో మార్పులు, ఫాస్ట్‌ఫుడ్‌ నూడుల్స్‌, పిజ్జా, బర్గర్‌... ఇలా నూనెలో వేయించిన పదార్థాలు ఎక్కువగా తినడం, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, ఖర్జూరం తదితర పౌష్టికాహారం తగ్గించుకోవడంతో శరీరానికి తగినంత పోషక ఆహారం లభించడం లేదు. ఈ పోషకాహారలోపానికి మరోవైపు మానసిక ఒత్తిడి తోడవడంతో ఆరోగ్యం దెబ్బతిని జుట్టురాలిపోవడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

3. ఆధునిక యువతలో కంప్యూటర్ల ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ ఉన్నారు. రేడియేషన్‌ ప్రభావంతో జుట్టురాలిపోయే అవకాశం ఉందని కొందరంటున్నారు. చిన్న వయసులోనే యువతీ, యువకులలో విపరీతమైన ఆందోళన చోటు చేసుకుంటోంది.మరి రాలిపోయిన జుట్టును తిరిగి తలపైకి తెచ్చుకోగలగడం సాధ్యమా? అవును.

4. హార్మోన్‌ లోపం.. హైపోథైరాయిడిజం, రక్తాల్పత.. ఇనుము, విటమిన్‌ బి12 లోపం, ఇన్‌ఫెక్షన్‌, డైటింగ్‌ , ఒత్తిడి , హార్మోన్ల అసమతుల్యం వల్ల , పోశాకాహారలోపము వల్ల ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటంది .

జాగ్రత్తలు
1. ముందుగా జుట్టు తత్వాన్నిబట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి రెండు సార్లు షాంపూ చేయాలి. నూనెతత్వం ఉన్న శిరోజాలైతే రెండు రోజులకోసారి తప్పనిసరి.
2. కండిషనర్‌ తప్పనిసరి. పొడి తత్వం ఉన్నవారు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవాలి.
3. సమతులాహారంతో జుట్టుకు తగిన పోషణ అందుతుంది. అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమినులు, మినరల్స్‌ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, తాజాపండ్లు, గుడ్లు, పప్పులు, డైరీ ఉత్పత్తుల్లో అవి సమృద్ధిగా దొరుకుతాయి.
4. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్య బాధిస్తుంటే వైద్యులను సంప్రదించి ఫ్లూయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. వారి సలహా మేరకు మందులు వాడాల్సి ఉంటుంది.

English summary

5 Unusual Causes Of Hair Loss & Natural Ways to Prevent

There are more than a hundred causes of hairfall. It can be a wide range of things like pollution, stress etc. If you want to stop your hair from thinning, then you have to know the cause of hairfall first. Some of the reasons for hair loss are very obvious and yet we miss them completely. These are some peculiar habits we have that are not hair healthy.
Desktop Bottom Promotion