For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారించుటకు నేచురల్ చికిత్సలు

By Super
|

నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికి చుండ్రు ఒక సమస్యగా ఉన్నది. జుట్టుకు రసాయనాలు మరియు షాంపూ లను ఉపయోగించుట వలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మీ తలపై ఉన్న దురద పొలుసులను ఎదుర్కోవటానికి కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి.

యాపిల్ సైడర్ వెనిగార్

యాపిల్ సైడర్ వెనిగార్ లో ఆమ్లత్వం కారణంగా మీ చర్మం pH మార్పులతో ఈస్ట్ పెరగటానికి కష్టతరంగా ఉంటుంది. ఇది చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.

 Cure that dandruff naturally

బేకింగ్ సోడా

మీ తడి తల మీద బేకింగ్ సోడా ను కొద్దిగా వేసి బాగా రబ్ చేయాలి. అప్పుడు షాంపూను ఉపయోగించకూడదు. బేకింగ్ సోడా చుండ్రుకు కారణమైన శిలీంధ్రంను తగ్గిస్తుంది.


కొబ్బరి నూనె

రెండు స్పూన్స్ కొబ్బరి నూనెను తీసుకోని తల మీద మసాజ్ చేసి రాత్రి పూట అలా వదిలివేయాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయాలి.


నిమ్మకాయ

రెండు స్పూన్స్ నిమ్మరసం తీసుకోని తలకు రాసి బాగా మసాజ్ చేసి తర్వాత నీటితో శుభ్రం చేయాలి. షాంపూ చేసుకున్నా తర్వాత ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తలకు రాసి నీటితో కడగాలి. నిమ్మకాయ నీరును ఉపయోగించుట వలన బాగా శుభ్రం చేస్తుంది. నిమ్మకాయలో అమ్లత్వం కారణంగా మీ చర్మం యొక్క pH సమతుల్యంనకు సహాయపడి చుండ్రు తగ్గటానికి సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి లో యాంటి ఫంగల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు కారక బ్యాక్టీరియాను తొలగించడం కోసం ఖచ్ఛితముగా పనిచేస్తుంది. షాంపూ చేయటానికి ముందు మెత్తగా చేసిన వెల్లుల్లి,తేనే కలిపిన మిశ్రమాన్ని రాయాలి.

English summary

Cure that dandruff naturally

Dandruff is an increasing problem today and I'm sure we all are tired of using chemicals and shampoos on our hair that say they will erase the dandruff only to give temporary relief.
Desktop Bottom Promotion