For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాప్ట్ అండ్ షైనీ హెయిర్ కోసం హోం మేడ్ హెయిర్ కండీషనర్

|

ప్రతి మహిళకు ఆరోగ్యకరమైన నిగనిగలాడే జుట్టు ఉండాలనుకుంటారు. అది వారి డ్రీమ్ కూడా..సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. తలస్నానం చేసి, మంచి హెయిర్ కండిషనర్ ను ఉపయోగించి నాకూడా ఫలితం ఉండదు. రెండు రోజులకే జుట్టు పొడిబారిపోతుంటుంది. కాస్త తడిగా ఉన్నప్పుడే జుట్టుకు కండీషనర్ రాసుకోవడం మంచిది. మీ జుట్టుకు ఈ కండీషనర్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే వాటి ఎంపికలో మార్కెట్లో తీసుకొనే హెయిర్ కండిషనర్స్ కాకుండా ఇంటి దగ్గరే సాధార పద్దతుల్లో తయారు చేసుకొని మీ జుట్టు మృదువుగా, మెరవాలంటే కొన్ని చిట్కాలు మీకోసం...

మనం తీసుకునే ఆహారం ముందుగా జుట్టుమీదే ప్రభావం చూపిస్తుంది. ఏదో సందర్భంగా దిగులుగా వుంటే జుట్టు తొందరగా రాలిపోతుంది. పౌష్టికాహారంతో పాటు, తగినంత నీరు కూడా ముఖ్యం. జుట్టుకు ఉపయోగించే కండీషనర్ లేక షాంపూల వాడకంలో జాగ్రత్త అవసరం. అంటే ఎప్పుడూ ఒకే రకమైనవి కాకుండా, మాయిశ్చరైజర్ కలిగిన షాంపూలు వాడాలి. లేకపోతే జుట్టు పొడిబారుతుంది. వారానికి ఒకసారైనా తలకు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె మసాజ్ చేసుకున్న తర్వాత, తలస్నానం చేయాలి. జుట్టు గరుకుగా వుంటే కండీషనర్ ఎక్కువగా వున్న షాంపూలనూ, మామూలుగా వుంటే తక్కువగా కండిషనర్ వున్నవీ వాడవచ్చు. శీకాయ, కుంకుడు కాయలు తలకు ఉత్తమం. చుండ్రు పోవటానికి, తల స్నానం చేసేముందు పెరుగు, నిమ్మకాయను పట్టించాలి. తల స్నానం తరువాత కొంచెం వెనిగర్ రాసుకుని తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెత్తగా వుంటుంది.

పెరుగు:

పెరుగు:

ఇది ఒక సహజమైనటువంటి పదార్థం. సాధారణంగా ఇంట్లో దొరికే ఈ పెరుగును అప్పడప్పుడు తలకు పట్టించినట్లైతే జుట్టు మెరుస్తూ, సున్నితంగా ఉంటుంది. బాగా పులిసిన పెరుగును తలకు పట్టించి అరగంట సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఒక వేళ తలలో చుండ్రు ఉన్నట్లైతే అరకప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తలంతటికి పట్టించి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. నిమ్మరసం చుండ్రును వదలగొడుతుంది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో అమ్లాలు..కెరటిన్ ని అందించి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది. అంతే కాదు గుడ్డు లోని తెల్ల సొన జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది. కండీషనర్ గానే కదా జుట్టుకు మంచి మెరుపును మాత్రమే కాదు వెంట్రుకలు చాలా మృదువుగా చేస్తుంది. జుట్టు, ఒత్తుగా, పొడవుగా పెరిగేందుకు మనం వాడే షాంపూలో ఒక గుడ్డును కలిపి, షాంపూతో జుట్టును రుద్ది కడుక్కోవాలి. ఇలా చేస్తే అందంతోపాటు, ఆకర్షణీ యంగా కనిపిస్తుంది.

వెనిగర్ :

వెనిగర్ :

వెనిగర్‌ కూడా జుట్టుకు కొత్త మెరుపు నిస్తుంది. అందుకే షాంపూతో స్నానం చేసిన తర్వాత జుట్టుకు వెనిగర్‌ రాసుకోవాలి. తర్వాత తిరిగి మంచినీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే జుట్టు సిల్కీగా వుండి చక్కని మెరుపును సంతరించుకుంటుంది.

బీర్:

బీర్:

ఇది కూడా ఒక రకంగా సహజమైనటువంటి హెయిర్ కండీషనరే..దీన్ని ఉపయోగించడం వల్ల కూడా జుట్టు మెరుస్తూ, కొంత కాంతిని నింపుకొన్న సున్నితమైన జుట్టు మీ సొంతమౌతుంది. తలస్నానం చేసిన తర్వాత రెండు మగ్గుల నీటిలో కొన్ని చుక్కల బీర్ వేసి తలమీద పోసుకోవాలి. లా చేస్తే జుట్టు సిల్కీగా వుండి చక్కని మెరుపును సంతరించుకుంటుంది.

తేనె-అరటిపండు:

తేనె-అరటిపండు:

ఇంట్లో తయారు చేసుకొనే హెయిర్ కండీషనర్స్ లో ఇది చాలా సులభమైనది. ఒక కప్పులో అరటిపండు గుజ్జు మరియు తేనె తీసుకొని, తలకు బాగా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత చల్లనీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంటుంది. నల్లగా నిగనిగలాడేందుకు వీలైనంత వరకు చల్లని నీటితో తలస్నానం చేయాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

ఈ కండీషనర్ జుట్టును పటిష్టం చేస్తుంది; బలాన్ని చేకూరుస్తుంది. కొబ్బరినూనె మన జుట్టుకు మంచి కండిషనర్ అని పురాతనకాలం నుండి చెప్పుకుంటున్నాము. ఈ నూనె జుట్టుకు చక్కగా పట్టి ఉంటుంది మరియు కెరటిన్ నష్టాన్ని నిరోధిస్తుంది. జుట్టును ఆర్ద్రతగా ఉంచుకోవడం కోసం కొబ్బరినూనెకు తేనెను కలపండి. కొబ్బరినూనె మరియు తేనె ఒక కప్పులో తీసుకొని వేడి నూరు ఉన్న గిన్నెలో ఉంచండి. కొన్ని నిముషాల వరకు, కప్పులో మిశ్రమం నులివెచ్చగా అయ్యేంత వరకు ఉంచండి. ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన వెంటనే, తలకు టవల్ ఉన్నప్పుడే తలమీద పోయండి. ఇలా 20 నిముషాల వరకు ఉంచి తరువాత కడగండి.

అరటిపండు:

అరటిపండు:

అరటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి మాత్రమే కాదు, కురులకు కూడా చాలా ప్రయోజనకారి. ఈ హోం రెమెడీ చిక్కుబడిని, పొడిబారిన,నిర్జీవమైన కురుకు బాగా పనిచేస్తుంది. అందుకు అరటి పండును మెత్తగా చేసి అందులో పెరుగు, నిమ్మరసం, పాలు వేసి బాగా మిక్స్ చేసి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మెత్తటి, నునుపైన కురులు మీ సొంత అవుతాయి.

బొప్పాయి:

బొప్పాయి:

బొప్పాయిని బాగా గుజ్జులా చేసి అందులో పెరుగు, రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి బాగా మిక్స్ చేసి తలమాడు నుండి కేశాలకు పూర్తిగా పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే, ఒత్తైన సున్నితమైన, షైనీ హెయిర్ మీసొంతం అవ్వడమే కాకుండా జుట్టు చిట్లడానికి ఆపు చేస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

నాలుగు చెంచాల ఆలివ్ నూనెకు గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలకొట్టి మాడుకు మర్దన చేసి అలానే తకు ఒక వస్త్రాన్ని చుట్టుకుని పదినిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు పట్టుకుచ్చులా జాలువారిపోతాయి.

షీ బటర్:

షీ బటర్:

చాలా సాఫ్ట్ గా ఉండే ఈ సీ బటర్ మీ కేశాలను చాలా స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. ఈ నేచురల్ హెయిర్ కండీషనర్ పురుషులకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని నెలకొకసారి తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home made Hair Conditioner for Soft and Shine Hair

It is often advised to apply a hair conditioner after shampooing. There are many benefits of hair conditioning. A hair conditioner keeps the hair manageable, smooth, silky and soft. A majority of people buy conditioner of the same shampoo brand.
Story first published: Friday, May 30, 2014, 17:29 [IST]
Desktop Bottom Promotion