For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్(బట్టతల)కారణాలు-నివారణ

|

బట్టతలతో ఇబ్బంది పడే వారు చాలా మందే ఉన్నారు. అధిక శాతం యువత వెంట్రుకలు రాలడం మొదలైతే చాలు.. బట్టతల వస్తుందేమోనని బెంబేలెత్తిపోతుంటారు. చుండ్రు, హార్మోన్లు, వంశ పారంపర్యతలాంటి రకరకాల కారణాలను ఊహించుకుని ఆందోళనచెందుతుంటారు. అయితే తలపై చర్మంలో ఉండే మూలకణాలు క్షీణించడం వల్లే పురుషులకు బట్టతల వస్తోంది. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. ఇందుకు విరుగు అప్పుడే ఆరంభించాలి. పూర్తిగా బోడి అయిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి.

జుట్టురాలిపోవడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణ సమస్యగా మారింది. అయితే ఏ కారణంతో జుట్టు రాలుతుందో, తలలో ఏ భాగంలో ఎక్కువగా ఊడుతుందో చెప్పడం కష్టం. తలలో ఉండే జుట్టులో నాలుగోవంతు ఊడితే తప్ప జుట్టు పలుచబడిందని చెప్పలేం. ఇది చాలా రకాలుగా ఉంటుంది. ప్రతిరోజు వందకు పైగా కేశాలు రాలిపోతుంటే దానిని హెయిర్‌ లాస్‌ గా పరిగణిస్తాం. ఒత్తిడికి ఎక్కువగా గురైనప్పుడు మూడునాలుగు నెలల తరువాత ఎక్కువగా హెయిర్ లాస్‌ ఉంటుంది. దీనికోసం కొన్ని చికిత్సా పద్ధతులు పాటిస్తే జుట్టు రాలడం నివారించవచ్చు. షాంపూ లను, హెయిర్‌ ఆయిల్స్‌ను మార్చుతూ, ప్రయోగాలు చేయడం సరికాదు.

Male pattern hair loss of baldness

దీనివల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఎక్కువగా హెయిర్‌ ఫాల్‌ ఉంటే వెంటనే డాక్టర్స్‌ ను సంప్రదించడం ద్వారా సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. డాక్టర్‌ సలహా మేరకు రక్తపరీక్షలు చేయించుకుని విటమిన్స్‌, ఐరన్‌ టాబ్లెట్స్‌ వాడాలి. ధైరాయిడ్‌ వంటి వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారిలో హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉన్నప్పుడు హెయిర్‌ ని గట్టిగా చేసే షాంపూలు వాడుతూ అవసరం మేరకు కండీషనర్స్‌ కూడా వాడాలి.

జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలడానికి ప్రధానంగా శరీర తత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది. ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్నే 'మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్' అంటారు.

పురుషుల్లో 'ఆండ్రోజన్' హార్మోన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం తరచుగా చుండ్రు, ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది..

పరిష్కారం: ఈ రోజుల్లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. కొన్ని జాగ్రత్తలతో దీన్నుంచి బయటపడవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా అవసరం. ఆహారంలో ప్రోటీన్లు తక్కువైతే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. జుట్టుకు ఫర్మింగ్, కలరింగ్ స్టయిలింగ్ తగ్గించాలి. మాటమాటికీ షాంపూలను మార్చకూడదు. తరచుగా మాయిశ్చరైజర్ జుట్టుకు వాడాలి. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయాలి. తలస్నానం తర్వాత జుట్టుకు సీరం, కండీషనర్ తప్పక వాడిలి. నూనెతో మసాజ్ చేస్తే శిరోజాలకు నిగారింపు వస్తుంది. ఆహారంలో పాలు, పండ్లు, పచ్చికూరగాయలు, చేపలు తీసుకోవాలి. నీళ్ళను ఎక్కువగా తాగాలి.

English summary

Male pattern hair loss of baldness

Baldness in men is quite common and it can be caused due to a number of reasons. This condition is quite different in men and women. Men tend to experience pattern baldness more than women, on an average. The symptoms of male pattern baldness include hair loss on the top and front of the head, receding hairline, thinning of hair, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more