For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం నివారించే 5 ఆమ్లా ట్రిక్ అండ్ టిప్స్

|

ప్రస్తుత రోజుల్లో జుట్టు రాలడం అనేది సహజ సమస్యగా ఉన్నది. జుట్టు రాలే సమస్యకు ముఖ్య కారణం జెనెటిక్, సరైన ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాల వ్యాధి మరియు ఒత్తిడి కలిగి ఉన్నాయి. ముఖ్యంగి ఒత్తిడితో కూడిన పొల్యూషన్, షాంపులు మరియు హెయిర్ ట్రీట్మెంట్ వంటివి కూడా జుట్టు రాలడానికి కారణం అవుతున్నాయి. అయితే రాలిపోయిన జుట్టును తిరిగి పొందడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. హెయిర్ ట్రీట్మెంట్లు, హెయిర్ ప్యాక్ లు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మరెన్ని పద్దతులను ఉపయోగించినా తగిన ఫలితం మాత్రం ఉండదు.

అందువల్ల మనకు సహజ సిద్దంగా లభించే ఆమ్లాను హెయిర్ లాస్ కు గ్రేట్ గా ఉపయోగించవచ్చు. ఆమ్లా మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలతో పాటు, జుట్టు రాలడంను కంట్రోల్ చేస్తుంది. ఆమ్లాను నేరుగా తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం, లేదా తలకు పట్టించడం, నూనె రూపంలో రాసుకోవడం, లేదా వంటల్లో ఉపయోగించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. దీని వల్ల తలలో అవాంఛిత ఫ్లాక్స్ ను నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు రాలడనానికి మరో కారణం విటమిన్ సి లోపం. ఆమ్లా(ఉసిరి)కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు చాలా గొప్పగా సహాయపడుతుంది. ఆమ్లాలో విటమిన్ సితో పాటు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి చిన్న వయస్సులో జుట్టు నెరవడాన్ని నివారిస్తుంది. ఇంకా జుట్టు చివర్లు చిట్లకుండా నివారిస్తుంది . అందుకు సహాయపడే కొన్ని హెయిర్ లాస్ రెమెడీస్ కొన్నిఅందుబాటులో ఉన్నాయి. వీటిని మీ డైలీ హెయిర్ కేర్ రొటీన్ లో చేర్చుకోవచ్చు. ఆమ్లాను మీ డైలీ రొటీన్ హెయిర్ కేర్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. డ్యామేజ్ అయిన హెయిర్ కు కొత్త లైఫ్ ను అందిస్తుంది. అలాగే జుట్టు రాలడం అరికడుతుంది. మరి అదెలాగో చూద్దాం...

ఆమ్లా ఆయిల్

ఆమ్లా ఆయిల్

జుట్టు రాలే సమస్యను నివారించడానికి ఆమ్లా ఆయిల్ రెగ్యులర్ బేస్ లో ఉపయోగించుకోవచ్చు . మార్కెట్లో వివిధ రకాలుగా ఆమ్లా ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి . అంతే కాదు, ఆమ్లా పౌడర్, మెంతి పౌడర్, మరియు కొబ్బరి నూనె ఉపయోగించి ఇంట్లోనే ఆమ్లా ఆయిల్ ను తయారుచేసుకోవచ్చు . ఈ నూనెను తలకు పట్టించి అరగంట పాటు ఉంచుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనెను అప్లై చేసిన అరగంట తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకుంటే మార్పు మీకు తెలుస్తుంది.

ఆమ్లా హెయిర్ ప్యాక్

ఆమ్లా హెయిర్ ప్యాక్

హెయిర్ లాస్ నివారించే రెమెడీస్ లో ఇది ఒక ఉత్తమ రెమెడీ . దీంతో హెయిర్ ప్యాక్ ను కంటిన్యుగా వేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాక్ కు గుడ్డు మరియు ఆమ్లా పౌడర్, శీకాకాయ పౌడర్ మరియు రీటా పౌడర్ జోడించడం వల్ల చిక్కట పేస్ట్ లా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవచ్చు. కేవలం గుడ్డు మరియు ఆమ్లా కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు ఒక మంచి కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టును స్ట్రాంగ్ గా మరియు సాఫ్ట్ గా మార్చుతుంది.

ఆమ్లా జ్యూస్

ఆమ్లా జ్యూస్

జుట్టు రాలడం నివారించడం కోసం, ఆమ్లా జ్యూస్ ను ఎప్పుడూ తలకు పట్టించాల్సిన అవసరం లేదు. ఆమ్లా రసాన్ని నేరుగా త్రాగవచ్చు. ఇలా చేయడం ద్వారా కూడా జుట్టు రాలడం అరికట్టవచ్చు. ఆమ్లా జ్యూస్ త్రాగడానికి కొద్దిగా పుల్లగా ఉంటుంది, కానీ ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. మీ దంతాలు మరియు చిగుళ్ళును బలోపేతం చేస్తుంది. అంతే కాదు శరీరంలో రక్తంను శుద్ది చేస్తుంది. రక్తకణాలను చురుకుగా పనిచేసేలా చేస్తుంది. ఆమ్లా జ్యూస్ తో పాటు తేనె మిక్స్ చేసి నేరుగా తీసుకోవచ్చు.

మసాజ్

మసాజ్

జుట్టు రాలే సమస్యలను నివారించడంలో ఉపయోగించి రెమెడీస్ లో హెయిర్ ఆయిల్ మసాజ్ కూడా ఒకటి. ఆమ్లా ఆయిల్ ను మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల ఇది కూడా జుట్టు రాలడాన్నినివారిస్తుంది. ఇది మీ శరీరాన్నిరిలాక్స్ చేస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతుంది. ఎండిన ఆమ్లా ముక్కలను ఆమ్లా ఆయిల్లో వేసి వేడి చేసి తలకు మసాజ్ చేయాలి.

డైట్ లో ఆమ్లా

డైట్ లో ఆమ్లా

ఉసిరికాయను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది మరింత ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఆమ్లాను జ్యూస్ రూపంలోనూ, ఊరగాయ రూపంలోనూ, ఉడికించిన ఆమ్లా రూపంలో మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

English summary

Top 5 Amla Tricks For Hair Loss

Losing hair is a natural phenomenon. The reasons for hair loss can be genetic, improper diet, prolonged disease and stress. Hair goes through a lot of stress due to pollution, shampooing and hair treatments. These factors can cause hair loss. Amla for hair loss is the proven solution to rejuvenate your hair and get its lustrous shine back.
Story first published: Tuesday, August 26, 2014, 14:57 [IST]
Desktop Bottom Promotion