For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలలో చుండ్రు ఉందని తెలిపే 5 లక్షణాలు: నివారణ

By Super
|

జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సమస్య. ఈ చుండ్రు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదంటారు మెడికల్ ఎక్స్ పర్ట్స్. సహజంగా జిడ్డుగా ఉండే తల వల్లే చుండ్రుకు దారితీస్తుందని చెబుతుంటారు. అయితే మరికొన్ని పరిశోధనల వల్ల వివిధ రకాలుగా చుండ్రు సమస్య వస్తుంది. ఒక్కో రకమైన చుండ్రు సమస్యకు ఒక్కో విధమైన కారం ఉంటుందని చెబుతుంటారు.

కొంతమంది చుండ్రు సమస్యతో అధికంగా బాధపడుతుంటారు. దుస్తులపై తెల్లటి పొట్టు రాలడం, ఎంత తలస్నానం చేసినా...దురదగా ఉండడం...తలమీద చిన్ని కురుపులు కూడా వచ్చి, ముఖం జిడ్డుగా మారి, మొటిమలతో బాధిస్తుంటుంది

జుట్టు సంరక్షణలో జుట్టు రాలడం, తెల్ల జుట్టు, జుట్టు పొడిబారటం, కేశాలు చిట్లిపోవడం ఇటువంటివి ఒక సమస్య అయితే, మరో అతి పెద్ద సమస్య చుండ్రు. చుండ్రు సమస్యకు పలురకాల కారణాలున్నాయి. ఫంగల్ ఇన్ ఫెక్షన్, తల్లోని నూనె గ్రంథులు స్రవించడం తగ్గిపోవడం, వాతావరణంలో మార్పులు, నురగ ఎక్కువగా వచ్చే షాంపూలు తరచూ వాడటం, కాలుష్యం..వంటివన్నీ ఈ సమస్యకు కారణాలు.

Top 5 Symptoms Of Dandruff

చుండ్రుకు సమస్యను గుర్తించడానికి కొన్ని లక్షణాలు:
1. తల దురదగా ఉండటం: తల దురద పెట్టడం చుండ్రు సమస్యకు ఒక సాధారణ లక్షణం. మీ తలలో చుండ్రు ఉన్నట్లైతే, దురద ఒక సహజ లక్షణంగా మీరు ఎదుర్కోవల్సి వస్తుంది. జుట్టును వదులుగా వదిలివేయడం వల్ల తలలో దురద మొదలవుతుంది. సాధరణ చుండ్రును వాటర్ వల్ల కనుగొవవచ్చు . వింటర్ లో వచ్చే చుండ్రు సమస్యకు పొడి బారిన తల ముఖ్య కారణం. అయితే ఈ సమస్యకు భయపడాల్సిన పనిలేదు ఇది సీజన్ మారగానే అదంట అదే వదిలిపోతుంది.

2. హెయిర్ ఫాల్: చుండ్రును తెలిపే మరో ప్రధాన లక్షణం హెయిర్ ఫాల్ . తలలో చుండ్రు ఉన్నప్పుడు సహజంగానే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతి రోజూ మనం 20-25 వెంట్రుకలను కోల్పోవల్సి వస్తుంది. అయితే ఇది నార్మల్ రేంజ్ హెయిర్ ఫాల్ గా చెబుతుంటారు . కానీ ఇంత కంటే ఎక్కువగా రాలడం ప్రారంభం అవుతే అంది చుండ్రుకు ప్రాధాన లక్షణంగా గుర్తించాలి.

3. డ్రై మరియు డల్ హెయిర్: మీ జుట్టు డ్రైగా మరియు డల్ గా ఉన్నట్లైతే మీకు చుండ్రు ఉన్నట్లు గుర్తించాలి. చుండ్రు తలలోని అదనపు నూనెను గ్రహించి తలను పొడిబారేట్లు చేస్తుంది. దాంతో మీ జుట్టు చూడటానికి డల్ గా మరియు బ్రష్ చేసినా సరిగా నిర్వహించనట్లుగానే జుట్టు చిందరవందరగా కనబడుతుంది.

4. మొటిమలు మరియు మచ్చలు: ఇది నేరుగా తలకు లేదా జట్టుకు మాత్రమే సంబంధించినది కాదు, అకస్మాత్తుగా మొటిమలు మరియు మచ్చలుకు దారితీస్తుంది . చుండ్రు కారణంగానే మొటిమలు మరియు మచ్చలు ఏర్పడుతాయి. మరియు ఇవి చాలా బాధను కూడా కలిగిస్తాయి. చాలా మందిలో చుండ్రును నివారించడం వల్ల మొటిమలు వాటంతట అవే తొలగిపోతాయి.

5. మలబద్దకం మరియు అపక్రమ బౌల్ సిండ్రోమ్: కొన్ని స్టడీస్ ప్రకారం, చుండ్రు క్రోనిక్ కాస్స్టిపేషన్ లేదా అపక్రమ బౌల్ సిండ్రోమ్ వల్ల కారణం కావచ్చు. అయినా కూడా కొన్ని కారణాలు తెలియకుండా ఉంటాయి . చుండ్రు ఉన్న వారు చాలా సాధారణంగా ఎదుర్కొనే ఒక సమస్య ఇది.

చుండ్రు నివారణ

చుండ్రు లక్షణాలు, మరియు ట్రీట్మెంట్ అనేది జుట్టు రకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకు మీరు ఎక్సపర్ట్ డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాల్సి ఉంటుంది . అలాగే కొన్ని హోం మేడ్ ట్రీట్మెంట్ కూడా బాగా పనిచేస్తాయి. కామన్ టైప్ డ్యాండ్రఫ్ ను ఇంటి చిట్కాలతోనే నివారించుకోవచ్చు.

1. యాంటీ డాండ్రఫ్ షాంపు: యాంటీ డాండ్రఫ్ షాంపులు అనేక విధాలుగా ఉన్నాయి. అయితే తెలివిగా మంచి మన్నికైన షాంపును ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది . మంచి నాణ్యమైన షాంపును ఎంపిక చేసుకుంటే ఇది తలలో తెల్లగా ఏర్పడే పొట్టును నివారిస్తుంది మరియు తలను శుభ్రంగా ఉంచుతుంది. ఇది జుట్టుకు రీస్టోర్ చేస్తుంది.

2. పెరుగుమరియు నిమ్మరసం: పెరుగు మరియు నిమ్మరసం ఉత్తమ హోం రెమెడీ. పెరుగులో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత నీటితో తలస్నాం చేయాలి. ఇలా వారానికి 3సార్లు చేస్తేం మంచి ఫలితం ఉంటుంది.

English summary

Top 5 Symptoms Of Dandruff


 Dandruff is a common scalp disorder. Exact causes of dandruff are still unknown to the medical experts. While oily scalp is a common factor leading to dandruff, people with dry skin experience the same scalp problem at times.
Desktop Bottom Promotion