For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టును నివారించే ఈ ఆహారాలను రెగ్యులర్ గా తినండి...

|

జుట్టు తెల్లబడటానికి అనేక కారణాలున్నాయి. కారణాలేవైనా...జుట్టు తెల్లబడకుండా మన జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం. మరి జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకున్నారా?

అవును జీవన శైలిలో మార్పుల వల్ల ఆరోగ్యంలో మార్పులు మాత్రమే కాదు, చర్మ మరియు జుట్టు సంరక్షణలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు ముఖ్య పాత్రపోషిస్తాయి. జుట్టు రాలుతున్నదనో లేదా జుట్టు తెల్లబడుతున్నదనో బాధపడక మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించాలి . ఎక్కువగా బాధపడటం మరియు ఒత్తిడి వల్ల జుట్టు వేగంగా తెల్లబడుతుంది.

READ MORE: మష్రుమ్ (పుట్టగొడుగుల)ను రెగ్యులర్ గా తింటున్నారా...?

తెల్ల బడిన జుట్టుకు కలర్ వేసుకొని కవర్ చేసుకోవడం కంటే, జుట్టు తెల్లగా మారకుండా నివారించే ఆరోగ్యకరమైన ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. మరి వీటి వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోతే అప్పుడు హెయిర్ కలర్స్ మీద ఆధారపడవచ్చు.

అయితే రసాయనిక హెయిర్ కలర్స్ ను ఎంపిక చేసుకొనే ముందు నేచురల్ హెయిర్ కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి. మరి తెల్ల జుట్టును నివారించే కొన్ని ఆహారాలు ఈ క్రింది స్లైడ్ ద్వారా...

బీన్స్:

బీన్స్:

లెగ్యుమ్ జాతికి చెందిని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యను కొంత వరకూ నివారించుకోవచ్చు.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఐరన్, క్యాల్షియం, ఇతర విటమిన్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల వీటిని రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, ఆకుకూరలు జుట్టు యొక్క నేచురల్ కలర్ తగ్గిపోకుండా కాపాడుతుంది.

కరివేపాకు :

కరివేపాకు :

మీ రెగ్యులర్ వంటకాల్లో ఎక్కువగా కరివేపాకు ఉపయోగించడం వల్ల కూడా జుట్ట తెల్లబడకుండా ఉంటుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లు శరీరానికి అవసరం అయ్యే కొన్ని రకాల న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. మరియు, వీటిని రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి, జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది.

బెర్రీస్:

బెర్రీస్:

విటమిన్ సి పుష్కలంగా ఉండే సిట్రస్ పండ్లతో పాటు, బెర్రీస్ వంటి పండ్లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మరియు తలకు మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెరుగుతుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

క్యారెట్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు తెల్ల బడకుండా ముఖ్య పాత్రపోషిస్తుంది. కాబట్టి క్యారెట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి.

మీట్ లివర్

మీట్ లివర్

మీరు తీసుకొనే ఆహారంలో ఐరన్ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి, మాంసాహారానికి సంబంధించి లివర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యేంత ఐరన్ ను అందచేస్తుంది.

English summary

Eat These Foods To Prevent Grey Hair

Well, there are some foods that help prevent grey hair. Instead of worrying more, start consuming such healthy foods. Worry and stress can speed up the greying process more.
Story first published: Thursday, September 10, 2015, 16:22 [IST]
Desktop Bottom Promotion