For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు అందానికి..ఆరోగ్యానికి ఆహారాలు

|

అందంగా..ఒత్తుగా, నల్లగా నిగనిగలాడే జుట్టును ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహరం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకుంటుంటారు. అందంగా కనిపించాలనే చాలా మంది తాపత్రయ పడుతుంటారు. కానీ ముఖంపై వచ్చే మొటిమలు, హెయిర్ ఫాల్ వారిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే చర్మం నిగారింపు సంతరించుకోవాలన్నా, శిరోజాలకు షైనింగ్ రావాలన్నా చక్కటి ఆహారం తీసుకోవడం ఒక్కటే మార్గము. ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహరం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా మెరుస్తుంటాయి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పు ధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి. .

డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ నివారణకు ఇంటి చిట్కాలు

శిరోజాలు రాలడంతో పాటు తల పొడిబారటం వంటి లక్షణాలున్నట్లయితే బయోటిన్, జింక్, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ లోపం ఉన్నట్లుగా భావించాలి. ఈ ఒత్తిడి, ప్రెగ్నెసీ, చర్మవ్యాధులు, మందులు, జన్యుపరమైన కారణాలతోపాటు వయస్సు కూడా కారణం కావచ్చు. శిరోజాలకు వాడే రంగులు కూడా హెయిర్ ఫాల్‌ కు కారణం కావచ్చు. ఈ హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉందంటే తీసుకునే ఆహారంలో ప్రొటీన్, ఫ్యాట్ శాతంపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం...

అవొకాడో:

అవొకాడో:

జుట్టు పెరుగుదలకు సహాయపడే పండ్లలో అవొకాడో ఒక ఉత్తమ ఆహారపదార్థం . ఒప అవొకాడోను పేస్ట్ లా చేసి అందులో ఒక చెంచా పాలు మిక్స్ చేసి తలకు పట్టించాలి. పదిహేను నిముషాల తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయాలి.

 లెమన్ అండ్ మిల్క్:

లెమన్ అండ్ మిల్క్:

రెండు కప్పుల పాలలో నిమ్మరసం మిక్స్ చేసి జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమం యొక్క మాస్క్ ను తలకు అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి . స్మెల్లీ హెయిర్ కు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.

తేనె మరియు ఆలివ్ ఆయిల్:

తేనె మరియు ఆలివ్ ఆయిల్:

మీ జుట్టు చూడటానికి డ్రైగా మరియు చిందరవందరగా కనబడుతున్నదా? అవును, మీరు మీ జుట్టుకు హోం రెమెడీస్ ఉపయోగిస్తున్నట్లైతే ఆలివ్ ఆయిల్ మరియు తేనెతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం మంచిది. ఈ చిట్కా వల్ల చిట్లిన జుట్టు నివారించబడుతుంది మరియు జుట్టు స్మూత్ గా మరియు సిల్కీగా మారుతుంది.

గుడ్డు మరియు టీ:

గుడ్డు మరియు టీ:

ఎగ్ వైట్ లో బ్లాక్ టీ మిక్స్ చేసి జుట్టుకు ప్యాక్ లా వేసుకోవడం వల్ల డ్రై అండ్ రఫ్ హెయిర్ ను నివారిస్తుంది . గుడ్డులో ఉండే పోషకాలు జుట్టుకు అవసరం అయ్యే పోషకాలను అందిస్తుంది. అదే విధంగా బ్లాక్ టీ మీ జుట్టుకు నేచురల్ కలర్ ను తీసుకొస్తుంది.

క్యారెట్:

క్యారెట్:

జుట్టుకు రెండవ ఉత్తమ వెజిటేబుల్ క్యారెట్స్ . క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఒక హెల్తీ టానిక్ గా పనిచేస్తుంది. బయోటిని జుట్టు తిరిగి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

జుట్టు పెరుగుదలకు సహాయపడే న్యూట్రీషియన్ ఫుడ్ ఇది.ఇందులో జింక్, ఐరన్, మరియు బయోటిన్ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు అవసరమయ్యేవే. ఇవన్నీ ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. జుట్టు పెరుగుదలతో పాటు, తెల్ల జుట్టు నివారిస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరం బీటాకెరోటిన్ గ్రహించి అది విటమిన్ ఎ గామార్పు చెందుతుంది. శరీరంలో కణాల మరమ్మత్తుకు బీటా కెరోటిన్ బాగా సహాయపడుతుంది. కాబట్టి, విటమిన్ ఎ కు మూలం అయిన స్వీట్ పొటాటోను తినడం.

టమోటోలు:

టమోటోలు:

టమోటోలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు టమోటో ఒక ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్. ఇవి తలలో మలినాలను మరియు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి, టమోటోలను నేరుగా తీసుకోవడం లేదా టమోటో రసాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లి, హెయిర్ గ్రోత్ కు ఒక టానిక్ వంటింది. కాబట్టి, దీన్ని మీ రెగ్యులర్ డైట్ చార్ట్ లో చేర్చుకోవాలి. మరియు ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. మరియు గార్లిక్ లో ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అందుకే దీన్ని హెయిర్ రీ గ్రోత్ కు చాలా మంచిదని నిర్ధారించారు.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకులో అద్భుతమైన యాంటీడోట్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో కెరోటిన్, జుట్టు పెరుగుదలకు ఒక టానిక్ లా ఉపయోగపడుతుంది

పచ్చిమిర్చి:

పచ్చిమిర్చి:

కెరోటిన్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండే మరో గ్రీన్ వెజిటేబుల్ పచ్చిమిర్చి. హెయిర్ గ్రోత్ లో ఎక్స్ లెంట్ గా ఉపయోగపడుతుంది . తలలో డ్యామేజ్ సెల్స్ ను రిపేర్ చేసి, కొత్త హెయిర్ ఫోలిసెల్స్ ను పెంచుతుంది.

English summary

Eleven Foods To Feed Your Hair: Beauty Tips in Telugu

It is time ladies to feed your hungry tresses with some of the best foods on the list. Did you know, pampering your hair with these foods as masks can help deal with hair loss and dandruff issues.
Desktop Bottom Promotion