For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీనేజ్ లోనే వేధించే తెల్ల జుట్టుకు హోం రెమిడీస్

By Nutheti
|

యుక్తవయసులోనే.. తెల్లజుట్టు సమస్యతో యంగ్ స్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పాతికేళ్లు కూడా రాకుండానే.. జుట్టు నెరిసిపోతుండటంతో.. చాలా అప్ సెట్ అవుతున్నారు. ఒత్తిడి, పొల్యూషన్, తీసుకునే ఆహారం చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు.

తెల్లజుట్టు కనిపించగానే మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్, షాంపూలు వాడేస్తుంటారు. కానీ.. రెండ్రోజులకే మళ్లీ మాములే. డై వేసుకున్నా ఫలితం ఉండదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. తెల్ల జుట్టు మాత్రం కవర్ కాదు. అందుకే తాత్కాలికంగా కాకుండా.. శాశ్వతంగా మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి చక్కటి పరిష్కారాలున్నాయి. దానికోసం ఏ ట్రీట్ మెంట్ అవసరం లేదు.. నింపాదిగా ఇంట్లోనే కూర్చుని.. ఇంట్లో వాడుకునే వస్తువులతోనే నిగనిగలాడే నల్లజుట్టు సొంతం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ హోం రెమిడీస్ చూసేసి ట్రై చేయండి.

మెంతులు

మెంతులు

మెంతులు జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది. ఇలా తరచూ చేస్తూ ఉండాలి. లేదా నానబెట్టిన మెంతులకు పెరుగు కలిపి జుట్టుకి పట్టించుకుంటే.. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది.

కొబ్బరినూనె

కొబ్బరినూనె

కొబ్బరి నూనెలో కొ్దిగా నిమ్మరం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగానూ.. తెల్లజుట్టు నల్లగానూ మారుతుంది.

గోరింటాకు

గోరింటాకు

గోరింటాకు జుట్టుకు సహజ సౌందర్యాన్నిస్తుంది. గోరింటాకును మెత్తగా పేస్ట్ చేసి.. తలకు పట్టించాలి. దీనివల్ల తెల్లజుట్టు నల్లగా మారడమే కాదు.. డ్యామేజ్ అయిన జుట్టు కూడా మెరుస్తుంది.

ఉసిరికాయ

ఉసిరికాయ

ఉసిరికాయ మీ జుట్టుకు నాచురల్ కలర్ ని ఇస్తుంది. ఉసిరికాయను ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టాలి. ఎండిన తర్వాత మెత్తగా రుబ్బి కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి తలకు పట్టిస్తూ ఉండాలి. కొన్ని రోజుల్లోనే నల్లని కురులు మీ సొంతమవుతాయి.

కరివేపాకు

కరివేపాకు

వంటల్లో రుచికే కాదు.. సౌందర్యానికి ఉపయోగపడుతుంది కరివేపాకు. కరివేపాకులో కొద్దిగా మజ్జిగ కలపి పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ ని స్నానం చేసే నీటిలో మిక్స్ చేసుకోవాలి. వాటితో స్నానం చేస్తే.. సరిపోతుంది. వారానికి రెండు మూడు సార్లు ఈ నీటితో తలస్నానం చేస్తే.. జుట్టు నల్లగా మారుతుంది.

నువ్వుల నూనె

నువ్వుల నూనె

క్యారెట్ ను పేస్ట్ చేసి వడకట్టిన ఆయిల్ ని నువ్వుల నూనెలో మిక్స్ చేయాలి. ఆ కాంబినేషన్ నూనెను తలకు పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

గోధుమ పిండి

గోధుమ పిండి

గోధుమ పిండి జుట్టును నల్లగా చేయడానికి సహాయపడుతుంది. గోధుమపిండిలో కాస్త అల్లం, ఒక స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఇలా చేస్తే మీకే

తేడా తెలుస్తుంది.

ఈ నాచురల్ పద్ధతులను రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి. అయితే క్రమం తప్పకుండా వాడితే ఫలితం పొందుతారు.

English summary

Home Remedies For Grey Hair In Teenage: beauty tips in telugu

Long, black and shiny hair is desired by all. But a single silver hair is enough to scare you. As you grow older, the greying of hair is quiet natural. But is it possible to have white hair in teenage? Yes, this is one of those hair problems that teen boys and girls often face. Before knowing the remedies for white hair in teenage, you need to know what causes the hair to turn grey.
Story first published: Saturday, October 10, 2015, 9:59 [IST]
Desktop Bottom Promotion