For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రును నివారించే 11 నేచురల్ హోం రెమెడీస్ ....

|

జుట్టు చూడటానికి ఎంత పొడవుగా, ఒత్తుగా ఉన్నా, శుభ్రంగా లేకపోతే జుట్టు అందంగా కనబడుదు. ఉదాహరణకు పొడవైన, ఒత్తైన జుట్టు ఉన్నా, తలలో తెల్లగా పొట్టుపొట్టుగా కనబడితే చూడటానికి అసహ్యంగా కనబడుతుంది. అంతే కాదు, నలుగురిలో దురదపెడితే మరింత ఇబ్బంది కరంగా మెయింటైన్ చేయడం కష్టంగా మారుతుంది. జుట్టు సమస్యల్లో చుండ్రును దాచడానికి కూడా కుదరదు.

మరి ఇలాంటి సమస్య నుండి బయటపడటం ఎలా? జుట్టు సమస్యల్లో చుండ్రు ఒక సాధారణ సమస్య. తలలో చుండ్రు ఏర్పడుటకు శుభ్రతపాటించకపోవడం, ఈస్ట్ అలర్జీ, డ్రై స్కిన్, వ్యాధినిరోధకత లోపించడంలో, హార్ట్ డిసీజ్, స్ట్రోక్, వంటి జబ్బుల వల్ల, ఎక్కువ షాంపు వాడటం వల్ల తలలో డ్రైనెస్ పెరిగి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది .

READ MORE: అనేక జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం మన ఇంటి చిట్కాలు

ఎక్సెస్ ఆయిల్ తలలో ఎక్కువగా చేరి చుండ్రుకు దారితీస్తుంది. పౌష్టికాహార లోపం మరియు ఒత్తిడి వల్ల కూడా చుండ్రు ఏర్పడటానికి కారణం అవుతుంది. మరి ఈ సమస్య నుండి బయటపడాలంటే నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. మరి ఈ నేచురల్ రెమెడీస్ ఏంటో ఒక సారి తెలుసుకుందాం...

పెప్పర్ మరియు పెరుగు:

పెప్పర్ మరియు పెరుగు:

మిరియాలు యాంటీఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చుండ్రుకు కారణం అయ్యే మైక్రోబ్స్ ను నివారిస్తుంది. మిరియాలపొడిని ఒక కప్పు పెరుగులో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. డ్రై అయిన తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ ఒక ఎక్సలెంట్ హోం రెమెడీ. ఇది చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ గ్రేట్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది . ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు అప్లై చేయడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్ ను అప్లై చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసుకోవాలి.

ఆయిల్ అండ్ నిమ్మరసం:

ఆయిల్ అండ్ నిమ్మరసం:

చుండ్రును నివారించడంలో ఆయిల్ మరియు నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతాయి. నిమ్మరసంలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు కలర్ ను నేచురల్ గా ఉంచుతుంది. నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి.

వెనిగర్:

వెనిగర్:

చుండ్రు నివారించడంలో వెనిగర్ ఒక పాపులర్ హోం రెమెడీ . మీరు కెమికల్ బేస్డ్ వెనిగర్ ను ఉపయోగించకోపోవడం మంచిది. నేచురల్ వెనిగర్ బాల్సమిక్ వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ ను అప్లై చేయాలి. వెనిగర్ లో పొటాషియం ఎంజైమ్స్ ఉండటం వల్ల ఇది తలలో దురదను నివారిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తలలో మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. దాంతో డెడ్ స్కిన్ సెల్స్ తొలగి చుండ్రు ఏర్పడకుండా చేస్తుంది

 బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడాలో క్లీనింగ్ లక్షనాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక చెంచా బేకింగ్ సోడాను షాంపుతో మిక్స్ చేసి తలకు పట్టించి 5నిముషాల తర్వాత తలస్నానం చేయాలి . ఇలా చేస్తే చుండ్రు నివారించబడుతుంది.

కలబంద:

కలబంద:

కలబంద చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . మరియు చర్మంలో తేమను ఉంచతుంది. తలలో స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తుంది . చర్మంను హెల్తీగా ఉంచుతుంది. చుండ్రు ఏర్పడకుండా నివారిస్తుంది . అలోవెర యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది . దాంతో చుండ్రు నివారించడబడుతుంది.

వేప:

వేప:

వేప అద్భుతమైనటువంటి నేచురల్ హోం రెమెడీ. ఇది చుండ్రును నివారించడంతో పాటు, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది . వేప యాంటీబయోటిక్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. రెగ్యురల్ గా ఉపయోగిస్తుంటే చుండ్రు సమస్యతో పాటు హెయిర్ ఫాల్, ఇచ్చింగ్, పేను సమస్యలుండవు.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ఇవి చుండ్రుకు కూడా ఒక గ్రేట్ హోం రెమెడీ. ఆపిల్ లో ఫినోలేస్ ఎంజైమ్ ఉంటుంది . ఇది తలలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది . చుండ్రు మరియు హెయిర్ ఫాల్ ను అరికడుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

చుండ్రునివారించడంలో మరో అమేజింగ్ హోం రెమెడీస్ వెల్లుల్లి. వెల్లుల్లి యాంటీబయోటిక్స్ అధికంగా ఉంటాయి . చుండ్రుకు కారణం అయ్యే బ్యాక్టీరియను తొలగిస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

రీత:

రీత:

కుంకుడు కాయ పౌడర్ లో నీరు మిక్స్ చేసి పేస్ట్ ను తలకు పట్టించి 2గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నివారించబడుతుంది.

 మెంతులు:

మెంతులు:

చుండ్రు నివారించడంలో ఎక్సలెంట్ హోం రెమెడీ మెంతులు . మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం వాటిని పేస్ట్ లా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, చుండ్రు నివారించడంతో పాటు, జుట్టు మొదళ్లు స్ట్రాంగ్ గా మారుతాయి.

English summary

How to get rid of Dandruff: 11 Natural Treatments for Dandruff

How to get rid of Dandruff: 11 Natural Treatments for Dandruff, You might have great hair and great looks, but you wouldn’t stand a chance with your close friends if you carry dandruff on your hair. It is hard to hide the fact that you have dandruff and it can be quite embarrassing. Sometimes you wouldn’t eve
Story first published: Friday, November 13, 2015, 12:10 [IST]
Desktop Bottom Promotion