For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు వేగంగా పెరగడానికి సులభ చిట్కాలు

By Super
|

అందంగా జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ నెలలో అర అంగుళం హెయిర్ గ్రోత్ ఉంటుంది. సాధారణ ఆరోగ్య, కేశ సంరక్షణకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరియు జెనిటిక్ ఫ్యాక్టర్స్ మీద హెయిర్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన లక్షణాలను కూడా గుర్తుంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

READ MORE: మన ఆరోగ్యానికి పీచు ఎంత అవసరం?

రెగ్యులర్ గా మంచి ఆహారం తీసుకుంటూ మరియు మంచి కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకుంటుంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. కొన్ని హెర్బ్స్ మీ జుట్టు చాలా వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. మరి మీ జుట్టు వేగంగా పెరగడానికి మీరు తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ క్రింది విధంగా...

వీటిని కనుక రెగ్యులర్ గా ఉపయోగించినట్లైతే మంచి ఫలితం ఉంటుంది.

మంచి పౌష్టిఖాహారం తీసుకోవాలి:

మంచి పౌష్టిఖాహారం తీసుకోవాలి:

మన రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో ప్రోటీనులు, విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నట్లైతే జుట్టు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఎ,బి, సి, డి మరియు ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా బిటిమన్ బి కాంప్లెక్స్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో వైరీటి ఫుడ్స్, పాలు, పెరుగు, చీజ్ , చికెన్, గుడ్లు, ఆకుకూరలు, చూపలు, బ్రొకోలీ, వెజిటేబుల్, క్యాబేజ్ , గ్రేఫ్ ఫ్రూట్, అవొకాడో, బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, మరియు మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, బీన్స్, వాల్ నట్స్, బాదం, గుడ్లు, చేపలతింటే మరింత వేగంగా హెయిర్ పెరుగుతుంది

ఆముదం:

ఆముదం:

ఆముదం నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు నేచురల్ గా మరియు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇవన్నీ ఆముదం నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ఆముదం నూనెను బాదం, ఆలివ్, కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ గా తలకు మసాజ్ చేస్తుంది. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి

మసాజ్ :

మసాజ్ :

తలకు వారానికొకసారైన మసాజ్ చేయించుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది, హెయిర్ ఫాలీ సెల్స్ పెరుగుతాయి . డీప్ కండీషన్ వల్ల జుట్టు వేంగంగా పెరుగుతుంది. వేడి నూనెతో మసాజ్ చేయాలి.

జుట్టును అప్సైడ్ అండ్ డౌన్ చేయాలి.

జుట్టును అప్సైడ్ అండ్ డౌన్ చేయాలి.

జుట్టు పెరుగుదలకు ఇది మరో పాపులర్ ట్రిక్. మీరు ముందుకు బెండ్ అయ్యా లూజ్ హెయిర్ తో క్రిందికి పూర్తిగా వంగి, పైకి లేయాలి. ఇలా రెండు మూడు నిముషాలు రోజు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు అవుతుంది.

ఒత్తిడి లేకుండ

ఒత్తిడి లేకుండ

జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి నార్మల్ హెయిర్ సైకిల్ ను అంతరాయం కలిగిస్తుంది. దాంతో హెయిర్ పెరగకుండా హెయిర్ ఫాల్ కు గురి చేస్తుంది. కాబట్టి, సాధ్యం అయినంత వరకూ ఒత్తిడి లేకుండా జీవించాలి. జుట్టు పెరుగుదలకు ఒత్తిడి గ్రేట్ గా సహాయపడుతుంది.

ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేసన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మరియు విశ్రాంతి పరమైన టెక్నిక్స్ ను ఫాలో అవ్వండి. ఎక్కువ విశ్రాంతి తీసువడం వల్ల విశ్రాంతి సమయంలో హార్మోనులు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.

ఎగ్ హెయిర్ మాస్క్

ఎగ్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు చాలా ఎఫెక్టిగ్ గా పనిచేస్తుంది ఎగ్ హెయిర్ మాస్క్. గుడ్డులో ుండే ఐరన్, సల్ఫర్, ఫాస్పరస్, జింక్, మరియు సెలీనియం అధికంగా ఉంటుంది. ఎగ్ హెయిర్ మాస్క్ ను నెలకోకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

హెర్బల్ మాస్క్

హెర్బల్ మాస్క్

జోర్ మెర్రీ, కాంటినిప్, నేటెల్, బర్డక్, హార్సటైల్ వంటివి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. రోజ్మెర్రీ ఆయిల్ జుట్టు పెరుగుదలకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది . వీటిలో ఉండే ఫాలీఫినాల్స్, మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇంకా హేర్బల్ లీవ్స్ ను వేడినీటిలో నానబెట్టి, తలకు షాంపు స్నానం చేసిన తర్వాత హేర్బల్ వాటర్ తలారా పోసుకోవాలి. అలాగే హేర్బల్ టీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

విటమిన్స్ మరియు హేర్బల్ సప్లిమెంట్స్

విటమిన్స్ మరియు హేర్బల్ సప్లిమెంట్స్

మంచి ఆహారం తీసుకోవడంతో పాటు . ముఖ్యంగా వాటిలో ఫోలిక్ యాసిడ్, బయోటిన్, కేల్ప్, ఫిష్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ వంటివిజుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . ఫోలిక్ యాసిడ్, మరియు బయోటిన్ బికాంప్లెక్స్ విటమిన్స్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతాయి.

అలోవెర

అలోవెర

కలబంద తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు నివారిస్తుంది. నేచురల్ హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. తాజా అలోవెరా జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకటి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అలోవెరా జ్యూస్ ను త్రాగవచ్చు.

మెడికల్ ప్రొబ్లమ్స్ గుర్తించాలి

మెడికల్ ప్రొబ్లమ్స్ గుర్తించాలి

ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా జుట్టు సరిగా పెరగకుండా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించి థైరాయిడ్, హార్మోనల్, క్రోనిక్ మరియు ఇతర ఇన్ఫెక్షన్స్ టెస్ట్ లను జరిపించుకొని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. బర్త్ కంట్రోల్ పిల్స్, బీటా బ్లాకర్స్, అనబాలిక్ స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెజెంట్స్, యాంటా కంన్వుల్స్ టెంట్, మరియు ఇతర లక్షణాలు కూడా ఈ జుట్టు ను పల్చబడేలా చేస్తాయి.


English summary

How to Make Your Hair Grow Faster: Beauty Tips in Telugu

There are no shortcuts to growing luscious, long locks. On average, hair grows about a half an inch per month. Your general health, well-being, and genetic factors affect your rate of hair growth.
Desktop Bottom Promotion