For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ధూమపానం వల్ల జుట్టుకి కలిగే హాని

By Super
|

చెడు అలవాట్లని నేర్చుకోవడం సులభమే కానీ వాటిని వదిలించుకోవడం అంత సులభం కాదు.ధూమపానం అలాంటి అలవాటే. టీనేజిలో స్టైలు కోసం అలావటైనది కాస్త రాను రాను వదులుకోలేని అలవాటయిపోతుంది.ధూమపానం అప్పటికప్పుడుఇచ్చే సంత్రుప్తి తప్పించి దానివల్ల చివరికి ఒరిగేమేలేమీ ఉండదు.కానీ ధూమపానం వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం మాత్రం అపారం.

READ MORE: సిగరెట్ మానేయాలనుకొనే వారికి అద్భుత చిట్కాలు

ధూమపానం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి జబ్బులొస్తాయని మీకు తెలుసుకదా.ఈ వ్యసనం మీ అందం మీద కూడ ప్రభావం చూపుతుందంటే నమ్ముతారా? ధూమపానం వల్ల మీ పెదాలు, వేళ్ళ మీద వచ్చే నల్లటి పిగ్మెంటేషన్ మచ్చలు అసహ్యం గా ఉంటాయి.

READ MORE:స్మోకింగ్ వల్ల ప్రాణాంతక చర్మ సమస్యలు?

ఇవే కాకుండా ఇంకా మీ ఆరోగ్యానికి పైకి కనిపించని హాని చాలా జరుగుతుంది. మీరు మీ జుట్టు రాలుతోందని బాధ పడూతున్నారా??ఈ సమస్య కి ధూమపానం కూడా ఒక కారణం కావొచ్చని తెలుసా మీకు?? అతిగా పొగ త్రాగటం వల్ల మీ జుట్టు నిర్జీవమయ్యి రాలిపోవడం మొదలవుతుంది. ఇంకా అనేక రకాలుగా మీ జుట్టు ధూమపానం వల్ల పాడవుతుంది.

ధూమపానం మీ జుట్టుకి ఎలా హాని చేస్తుందో చదవండి.

జుట్టు దుర్గంధభరితమవుతుంది:

జుట్టు దుర్గంధభరితమవుతుంది:

పొగ త్రాగటం వల్ల మీ జుట్టు కి పట్టిన పొగ వాసన షాంపూ, కండీషనర్లతో కూడా వదలదు. మరి ఇంకోసారి సిగరెట్టు వెలిగించేముందు ఇది గుర్తుంచుకోండి.

జుట్టు నిర్జీవమయ్యి సహజ రంగు కోల్పోతుంది:

జుట్టు నిర్జీవమయ్యి సహజ రంగు కోల్పోతుంది:

అతిగా పొగ తాగడం వల్ల మీ జుట్టు కుదుళ్ళకి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. అందువల్ల మీ మాడు, జుట్టు కుదుళ్లకి సరైన పోషణ అందక జుట్టు నిర్జీవమయిపోతుంది .

బట్టతల:

బట్టతల:

వయసు మీరకుండా వచ్చే బట్టతల, జుట్టు పలచిబడిపోవడానికి ప్రధాన కారణం అతిగా పొగతాగడం. పొగ తాగడం వల్ల జుట్టు కుదుళ్ళకి విటమిన్లు,మినరల్స్ సరఫరా నిలిచిపోయి జుట్టుకి సరైన పోషణ అందదు.దీని వల్ల జుట్టు పెరగడం కూడా నిలిచిపోతుంది.

అనేక రకాల జబ్బులకి మూలం:

అనేక రకాల జబ్బులకి మూలం:

పొగ త్రాగడం మీ ఆరోగ్యం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ అలవాటు మీ శరీరం లోని రోగనిరోధక శక్తి సన్నగిల్లచేయడం వల్ల అనేక రకాల వ్యాధులకి కారకమవుతుంది.ఈ వ్యాధులవల్ల జుట్టు ఊడటమేకాకుండా ఇంకా అనేక రకాల జుట్టుకి సంబంధించిన సమస్యలని ఎదుర్కోవలసిరావచ్చు.

(అకాలంగా) యవ్వనం లో జుట్టు నెరవడం

(అకాలంగా) యవ్వనం లో జుట్టు నెరవడం

సిగరెట్టు అంటేనే విషపూరిత పదార్ధాల సమ్మేళనం.ఈ విషపూరిత పదార్ధాలు హార్మోన్స్ ని ప్రభావితం చెయ్యడంవల్ల జుట్టు సహజం గా ఎదగడం ఆగిపోతుంది.సిగరెట్టు లో ఉండే నికోటిన్, తారు పదార్ధాల వల్ల జుట్టు అకాలం లో నెరుస్తుంది.నెరవడమే కాదు జుట్టు ఒకరకమైన పసుపు పచ్చ రంగులోకి మారిపోతుంది ఈ విష పదార్ధాల వల్ల.

(అకాలంగా) యవ్వనం లో జుట్టు నెరవడం

(అకాలంగా) యవ్వనం లో జుట్టు నెరవడం

ఇవండీ ధూమపానం జుట్టుకి కలుగచేసే హాని వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు.. ఈ అలవాటు ని అంటిపెట్టుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.అందువల్ల ఈ వ్యసనాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.ఇక్కడ ఉదహరించినవే కాకుండా ఇంకా అనేక రకాలుగా పొగ త్రాగడం వల్ల జుట్టు కి హాని కలుగుతుంది.మీ జుట్టు కొసలు చిట్లిపోవచ్చు లేదా రక్తం కలుషితమయి కాలేయం(లివర్) పాడవ్వచ్చు. లివర్ సమస్యలు జుట్టుని కూడా ప్రభావితం చేస్తాయని తెలుసు కదా?? మరెందుకాలశ్యం,ఇప్పుడే ధూమపానాన్ని వదిలెయ్యండి.

English summary

How Smoking Damages Hair: Beauty Tips in Telugu

It is always very easy to fall for a bad habit but it is difficult to avoid it once you have it. Smoking is one of such habit. From a style statement at teenage it becomes a regular habit in later ages.
Desktop Bottom Promotion