For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో హెయిర్ ఫాల్ తగ్గించే ఇంటి చిట్కాలు...

|

వర్షాకాలంలో జుట్టు రాలే సమస్యను ఎదుర్కొనే వారి సంఖ్య చాలానే అని చెప్పవచ్చు. వర్షకాలంలో జుట్టు రాలడానికి ముఖ్య కారణం పౌష్టికాహార లోపం, హానికరమైన మరియు టాక్సిక్ షాంపులు, హార్డ్ వాటర్, జుట్టుకు తగని హెయిర్ ఆయిల్ వాడకం మరియు వాటర్ కండీషన్ వంటి వన్నీ కూడా హెయిర్ ఫాల్ కు ముఖ్య కారణాలు. .

వర్షాకాలంలో ఎదుర్కొనే హెయిర్ ఫాల్ సమస్యను నివారించుకోవడానికి సులభమైన ఇంటి చిట్కాలు బోలెడు ఉన్నాయి. మన వంటగదిలో ఉండే బాదం ఆయిల్, కోకనట్ ఆయిల్, హెన్నా, వేప పేస్ట్ వంటివి జుట్టుకు పట్టించి హెయిర్ ఫాల్ ను నివారించుకోవచ్చు. ఈ నేచురల్ పదార్థాలు చౌకైనవి. కాబట్టి వీటిని ఉపయోగించకోవడం మంచిది . నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వారం రోజులు కంటిన్యుగా నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ 60శాతం వరకూ తగ్గుతుందని వెల్లడిస్తున్నారు.

READ MORE: వర్షాకాలంలో పాటించాల్సిన టాప్ 10 చర్మసంరక్షణ చిట్కాలు

ఆయిలీ స్లాప్(జిడ్డు జుట్టు ఉన్నవారు), వర్షాకాలంలో మరింత ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. అందుకు ముఖ్య కారణం వాతావరణంలో ఉండే హైడెన్సిటి మాయిశ్చరైజర్ వల్ల సూర్య రశ్మి నుండి వెలువడే వేడిని గ్రహించలేవు. దాంతో తలలో జిడ్డు మరింత పెరుగుతుంది. దాంతో ఫాలిసెల్స్ బలహీనపడటంతో జుట్టు రాలడం అధికమౌతుంది. అదేవిధంగా, వేసవిసీజన్ లో కూడా సూర్య కిరణాలు నేరుగా తల మీద పడటం వల్ల జుట్టు డ్రైగా మరియు వీక్ గా మారడం జరుగుతుంది. ఫలితంగా హెయిర్ ఫాల్ అధికంగా ఉంటుంది.

కాబట్టి, ఈ మాన్ సూన్ సీజన్ లో జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలను ఈ క్రింది విధంగా....

జిడ్డుగా లేని నూనెలను ఎంపిక చేసుకోవాలి:

జిడ్డుగా లేని నూనెలను ఎంపిక చేసుకోవాలి:

అందంగా కనబడాలంటే ముఖం కానీ, జుట్టుకానీ, జిడ్డులేకుండా చూసుకోవడం చాలా అవసరం. అందుకు స్వచ్చమైన ఆలివ్ ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ మరియు నేచురల్ కోకనట్ ఆయిల్ వంటి నాన్ గ్రీజీ ఆయిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ మూడు నూనెలు జుట్టు డ్యామేజ్ కాకుండా చేస్తాయి. మరియు ఒక్క వారంలో జుట్టు రాలడం తగ్గిస్తాయి.

తలస్నానం:

తలస్నానం:

వర్షంలో తడిచిన వెంటనే తలస్నానం చేయడం చాలా అవసరం. వర్షంలో తడిచిన తర్వాత తలస్నానం చేయకపోవడం వల్ల తలలో ఇన్ఫెక్షన్ కు ఆహ్వానం పలికినట్లే . దాంతో ఆటోమాటిక్ గా హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. హెయిర్ ఫాల్ తో పాటు, తలలో పేలు మరియు చుండ్రు కూడా ఏర్పడుతుంది.

తడి జుట్టును ఎప్పుడూ ముడి వేయకూడదు:

తడి జుట్టును ఎప్పుడూ ముడి వేయకూడదు:

చాలా మంది మహిళలు చేసే పొరపాటు ఇది. తలస్నానం చేసిన తర్వాత లేదా వర్షంలో తడిసిన తర్వాత జుట్టును ముడివేస్తుంటారు . ఇలా చేయడం జుట్టురాలడానికి అనారోగ్యకరం మరియు చెడు అలవాటు. మరియు ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది మరియు తలదురద పెడుతుంది.

తడి జుట్టును దువ్వకూడదు:

తడి జుట్టును దువ్వకూడదు:

జుట్టు తడిగా ఉన్నప్పడు దువ్వెనెతో జుట్టును దువ్వకూడదు. జుట్టును నేచురల్ గా తడి ఆర్పులకోవాలి . పూర్తిగా తల ఆరిన తర్వాత వెడల్పు పళ్ళున్న దువ్వెనతో దువ్వుతూ జుట్టులో ముడులను విడిపించుకోవాలి. తడి జుట్టును దువ్వుకోవడం వల్ల హెయిర్ రూట్స్ ను బలహీనపరుస్తుంది, దాంతో హెయిర్ ఫాల్ కు కారణం అవుతుంది.

హెయిర్ ప్రొడక్ట్స్ కు నో చెప్పండి:

హెయిర్ ప్రొడక్ట్స్ కు నో చెప్పండి:

వర్షాకాలంలో హెయిర్ ఫాల్ తో పోరాడాలంటే కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ కు నో చెప్పండి. జెల్, హెయిర్ క్రీమ్, మరియు స్ప్రేస్ వంటి వాటికి దూరంగా ఉండాలి . ఇలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ హెయిర్ రూట్స్ ను బలహీనం చేస్తుంది మరియు జుట్టును డ్యామేజ్ చేస్తుంది.

ఎప్పుడూ తలను శుభ్రంగా ఉంచుకోవాలి:

ఎప్పుడూ తలను శుభ్రంగా ఉంచుకోవాలి:

ఆయిల్ జుట్టు ఎక్కువ మురికిని ఆకర్షిస్తుంది. త్వరగా మురికిపడుతుంటుంది . ముఖ్యంగా వర్షాకాలంలో తలలో త్వరగా మురికి చేరుతుంటుంది . అందువల్ల హెయిర్ ఫాల్ ను నివారించడానికి మరియు ఇతర జుట్టు సమస్యలను కంట్రోల్ చేయడానికి వారంలో రెండు సార్లు జుట్టును వాష్ చేయడం మంచిది. వాతావరణం మోడంగా ఉన్నా సరే రెగ్యులర్ తలస్నానం కంపల్సరీ.

హోం మేడ్ షాంపులు:

హోం మేడ్ షాంపులు:

అన్ని రకాల సమస్యల నుండి జుట్టును కాపాడుకోవడం కోసం హోం మేడ్ షాంపులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది . హోం మేడ్ షాంపులంటే శీకాయ, కుంకుడు కాయలు, మరియు వేపపేస్ట్ వంటి ఉత్తమమైనవాటిని ఎంపిక చేసుకోవాలి. ఇవి హెయిర్ ఫాల్ తగ్గించడంలో బెస్ట్.

 జుట్టు చిక్కుబడకుండా:

జుట్టు చిక్కుబడకుండా:

వెల్లుల్లి, ఉల్లిపాయ, మరియు అల్లం వంటి వాటిలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే లక్షణాలు మెండుగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి . అంతే కాదు, వర్షాకాలంలో వీటి వల్ల జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

English summary

Killer Ways To Fight Hair Fall In Monsoon:Beauty Tips in Telugu

Hair fall is a common problem which is faced by a lot of people during the monsoon season. The main causes of hair fall are poor diet, harmful and toxic shampoos, hard water, the wrong hair oil and weather conditions, especially in the summer and monsoon seasons.
Desktop Bottom Promotion