For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారించడానికి 7 ఉత్తమ హోం రెమెడీస్

By Super
|

సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి, వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. చుండ్రు మాత్రమే కాదు, తలలో దురద, తలలో మొటిమలు, చర్మం పొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, మరియు ఇతర జుట్టు సమస్యలు.

కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతో పాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకు పెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది. చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రును చాలా త్వరగా నివారించడానికి కొన్ని బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.READ MORE: చుండ్రును తక్షణం పోగొట్టే 20 సులభ చిట్కాలు...!

చుండ్రును నివారించే హోం రెమెడీస్ :

వేపాకు:

వేపాకు:

వేపాకు: వేపాకు ను ఉపయోగించి చుండ్రును నివారించుకోవచ్చు.

అందుకు కావల్సినవి:

¼ కప్పు వేపాకు రసం, కొబ్బరి పాలు మరియు బీట్ రూట్ జ్యూస్

1 tsp కొబ్బరి నూనె

స్టెప్:

ఈ పదార్థాలన్నింటి ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. 20 నిముషాల తర్వాత హేర్బల్ షాంపు మరియు కండీషనర్ తో తలస్నానం చేసుకోవాలి. వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

మెంతులు

మెంతులు

మెంతి ఆకు లేదా మెంతులు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతుల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల చుండ్రును పారద్రోలుతుంది.

కావల్సినవి:

2tbsp మెంతులు

1cup నీళ్ళు

1cup యాపిల్ సైడర్ వెనిగర్

స్టెప్స్ :

మెంతులను రాత్రంతా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు మరియు కేశాలకు పూర్తిగా పట్టించాలి. అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయడం వల్ల ఇది చుండ్రు మరియు తలలో దుర మరియు ఇతర లక్షణాలను నివారిస్తుంది.

ఆస్పిరిన్

ఆస్పిరిన్

ఇది నేచురల్ హోం రెమెడీ కాకపోయినా, ఇది చాలా ఎఫెక్టివ్ గా మరియు త్వరగా చుండ్రును నివారిస్తుంది. ఆస్పిరిన్ సాలిసిలేట్స్ కలిగి ఉంటుంది. చాలా వరకూ ఎక్కువ యాంటీ డాండ్రఫ్ షాంపులలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు .

కావాల్సినవి :

2 ఆస్పిరిన్ టాబ్లెట్స్

షాంపు

స్టెప్స్ :

టాబ్లెట్స్ ను పొడి చేసి, నార్మల్ షాంపులో జోడించాలి . జోడించిన తర్వాత 5నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత తలను నీటితో తడిపి ఈ షాంపును తలకు పట్టించి 5నిముషాల తర్వాత తల స్నానం చేయాలి. లేదా ఆస్పిరిన్ పౌడర్ ను తలకు పట్టించి షాంపుతో తలస్నానం చేయాలి

 బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

చుండ్రును నివారించడంలో బేకింగ్ సోడా కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఆల్కలైన్ ఉంటుంది మరియు ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. మరియు ఇది కొద్దిగా ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది .తలలో నూనె ఉత్పత్తులను కంట్రోల్ చేస్తుంది .

కావల్సినవి:

2tsp బేకింగ్ సోడా

నీళ్ళు : కొద్దిగా

స్టెప్స్ :

గోరు వెచ్చని నీటితో తలను తడిపి, తర్వాత కొన్ని నీళ్ళలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి పేస్ట్ లా తయారుచేసి, దీన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ మరియు షాంపుతో తలస్నానం చేయాలి.

రీటా మరియు సోప్ నట్స్

రీటా మరియు సోప్ నట్స్

పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యంలో ఉన్న హోం రెమెడీ. పొడవాటి మరియు స్ట్రాంగ్ హెయిర్ కోసం ట్రెడీషినల్ కాంబినేషన్ లో శీకాయ మరియు కుంకుడు కాయ రెండింటిని జోడించి తీసుకుంటారు . అంతే కాదు ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలు కలిగినది

కావల్సిన పదార్థాలు:

10-15 సోప్ నట్స్(కుంకుడుకాయ)

1 tbsp ఉసిరి పొడి లేదా ఉసిరికాయ జ్యూస్

2-3 నీళ్ళు

స్టెప్స్ :

శీకాకాయను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం నీటిలో నానబెట్టిన శీకాకయాను మెత్తగా పేస్ట్ లా చేసి అందులో ఉసిరి పొడి లేదా ఉసిరికాయ జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

నిమ్మరసం

నిమ్మరసం

ఈ సిట్రస్ ఫ్రూట్ లో విటమిన్ సి అధికంగా ఉన్నది . ఇది అసిడిక్ నేచర్ ను కలిగి ఉండటం వల్ల చుండ్రును దూరం చేస్తుది . మీరు జ్యూస్ ను విడిగా తీసి తలకు అప్లై చేయవచ్చు లేదా నిమ్మతొక్కతోనే తలకు మర్దన చేయవచ్చు

కావల్సినది

4 నిమ్మకాయల రసం లేదా నాలుగు నిమ్మతొక్కలు

స్టెప్స్ :

నిమ్మరసంను తలకు పట్టించి 10-15నిముషాల పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా ఒక వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 అలోవెరా జెల్

అలోవెరా జెల్

చుండ్రును నివారించడంలో అలోవెరా జెల్ గ్రేట్ గా పనిచేస్తుంది . ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది తలలో దురద నివారించి చల్లగా ఉంచుతుంది.

కావాల్సినవి:

5 tbsp కలబంద రసం

స్టెప్స్ :

అలోవెరా మొక్కనుండి జెల్ ను పిండుకోవడం లేదా మందుల షాపులో ఇన్ స్టాంట్ గా దొరికే అలోవెర జెల్ ను కొనుగోలు చేసి , దాన్ని సింపుల్ గా తలకు పట్టించి మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నా,నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల డ్రై మరియు చిక్కు బడిన జుట్టు నివారించబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చుండ్రును నివారించడంలో నేచురల్ రెమెడీస్ ...

English summary

7 quick-n-easy home remedies for dandruff that really work!

Though there are several people who suffer from it all around the year, during winters, there is higher probability of having dandruff as the scalp also gets dry and irritated.
Desktop Bottom Promotion