For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు హాని కలిగించే ఆశ్చర్యకరమైన అలవాట్లు

|

సహజంగా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో మీర ఎక్కువగా జుట్టును కోల్పోతున్నారు. అందుకు ప్రధాణ కారణం, సరైన జుట్టు సంరక్షణ తీసుకోకపోవడం, పౌష్టికాహారలోపం, మన జీవన శైలియే ప్రధాణ కారణంగా ఉన్నాయి.

READ MORE: జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు

జుట్టు రాలకుండా ఉండాంటే ముందుగా జుట్టు రాలడానికి గల కారణాలు తెలుసుకొన్నట్లైతే ముందుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతలో కొంత జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు రాలడం అరికట్టడానికి తీసుకొనే జాగ్రత్తలు ముందు జుట్టు రాలడానికి కొన్ని ఆశ్చర్యం కలిగించే కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

. చైల్డ్ బర్త్:

. చైల్డ్ బర్త్:

గర్భధారణ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజన్ లెవల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో జుట్టు చూడటానికి చాలా అందంగా ఒత్తుగా, సాఫ్ట్ గా, మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. అయితే బిడ్డను ప్రసవించిన తర్వాత ఈస్ట్రోజెన్ లెవల్స్ అకస్మాత్తుగా తగ్గడం వల్ల జుట్టు చాలా వరెస్ట్ గా రాలడం మొదలవుతుంది. కాబట్టి, ఈ విషయాన్ని ముందే గ్రహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం అరికట్టవచ్చు.

జీవనశైలి:

జీవనశైలి:

మన జీవన శైలిలో మార్పులు మన శరీరం ఆరోగ్యం మీద మాత్రమే కాదు, బాహ్య సౌందర్యం మీద మరియు ముఖ్యంగా జుట్టు మీద ఎఖ్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి, మంచి ఒత్తైన, షైనింగ్, హెల్తీ హెయిర్ పొందడానికి రెగ్యులర్ డైట్ లో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, విటమిన్ ఇ మరియు విటమిన్ డి ఆహారాలు ఎక్కువగా చేర్చుకోవాలి. ముఖ్యంగా జీవనశైలిలో క్రోనిక్ స్ట్రెస్, నిద్రలేమి వంటి ఎక్కువ జుట్టు రాలడానికి కారణం అవుతాయి.

 చాలా వేడి వాతావరణం వేడి నీళ్ళు:

చాలా వేడి వాతావరణం వేడి నీళ్ళు:

ఎక్కువగా వేడి వాతావరణంలో తిరగడం లేదా చాలా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం మరియు శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ గురి కావడం వల్ల జుట్టు డ్యామేజ్, బ్రేకేజ్ అవ్వడంతో పాటు, జుట్టు రాలడానికి ప్రధాణ కారణం అవుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ హాట్ షవర్ కు హాట్ వెదరకు దూరంగా ఉండాలి.

హాట్స్ ధరించడం:

హాట్స్ ధరించడం:

చలికాలంలో వెచ్చగా ఉంటే బాగుంటుంది. కానీ అన్ని సమయాలు తలకు హాట్స్, క్యాప్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్ త్వరగా డ్యామేజ్ అవుతుంది. తలకు మరీ ఎక్కవు వేడి వల్ల చెమట పట్టి, జిడ్డుగా మారుతుంది. దాంతో జుట్టు చిక్కుబడుట మరియు బ్రేకేజ్ అవ్వడం జరగుతుంది. కాబట్టి హాట్స్ వాడకంను పరిమితం చేయాలి.

డర్టీ బ్రెష్:

డర్టీ బ్రెష్:

తలకు ఉపయోగించే బ్రెష్ లను కనీసం వారానికొకసారి శుభ్రం చేస్తుండాలి . తలలో ఉండే నేచురల్ ఆయిల్స్ మరియు అన్ నేచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అవన్నీ బ్రెష్ లో నిల్వఉండటం వల్ల వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అవి తిరిగి తలలో చేరి హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఫాల్ కు కారణం అవుతుంది.

ఎక్కువగా బ్రష్ చేయడం:

ఎక్కువగా బ్రష్ చేయడం:

హెయిర్ బ్రెష్ ను ఎక్కువగా చేయడం ఒక్క రోజులో ఎక్కువ సార్లు హెయిర్ బ్రష్ చేయడం వల్ల క్యూటికల్స్ స్ట్రిప్ అవుతాయి. దాంతో జుట్టు డల్ గా కనబడుట మాత్రమే కాదు మరింత బ్రేకేజ్ కు దారితీస్తుంది.

రబ్బర్ బ్యాండ్స్:

రబ్బర్ బ్యాండ్స్:

రబ్బర్ బ్యాండ్స్ ను జుట్టుకు కావల్సిన రీతిలో ఉపయోగిస్తుంటారు. అయితే నిరంతరం రబ్బర్ బ్యాండ్స్ ను జుట్టుకు టైట్ గా వేసుకోవడం వల్ల జుట్టు బ్రేకేజ్ అవుతుంది.

ఎక్కువగా ఎండలో తిరగడం:

ఎక్కువగా ఎండలో తిరగడం:

చర్మానికి సూర్య రశ్మి ఎలా హాని కలిగిస్తుందో అదే విధంగా హెయిర్ కూడా చాలా హాని కలిగిస్తుంది. సూర్య రశ్మిలోని పవర్ ఫుల్ రేస్, నేరుగా జుట్టు మీద పడటం వల్ల జుట్టును మరింత డ్రైగా, చిక్కుగా మరియు హార్డ్ గా మరియు డ్యామేజ్ చేస్తుంది. అంతే కాదు ఎక్కువగా కండీషనర్స్ ను హెయిర్ మాస్క్ ను వేసుకోవడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు.

English summary

8 Surprising Habits That Hurt Your Hair

Perfect hair isn’t found at the bottom of a bottle of hair gel—it’s found in the ways we live our lives, and the very basic ways we take care of and style our hair. Read on for some of the most surprising habits that impact your hair.
Story first published: Wednesday, June 3, 2015, 17:43 [IST]
Desktop Bottom Promotion