For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు చివర్లు చిట్లకుండా ఉండటానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

|

జుట్టు సమస్యల్లో స్ప్లిట్స్ ఒకటి. జుట్టు చిట్లడం వల్ల జుట్టుకున్న అందం తగ్గిపోతుంది. అంతే కాదు, ఇది అనారోగ్యకరమైన జుట్టుకు సంకేతంగా సూచిస్తుంది. హెయిర్ స్ప్లిట్స్ కు వివిధ రకాల కారణాలుంటాయి. ఇవి స్వయంగా ఏర్పడినవి, కాబట్టి, సింపుల్ గా వీటిని తొలగించుకోవడమే ఉత్తమ మార్గం. చిట్లిన జుట్టును నివారించుకోవడానికి కిచెన్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

హెయిర్ స్ప్లిట్స్ కు కారణం హెయిర్ స్టైలింగ్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, కండీషనర్స్ ఉపయోగించకపోవడం, స్మోకింగ్, మరియు సరిగా నీళ్ళు తాగకపోవడం ఇవన్నీ జుట్టు చిట్లడానికి ప్రధాణ కారణాలు. ఈ అలవాట్లన్నీ కూడా జుట్టు అందాన్ని పాడు చేస్తాయి. ఈ అలవాట్లను కూడా సులభంగా మానుకోవచ్చు.

చిట్లిన జుట్టును నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాము. ఈ పదార్థాలను ఉపయోగించడం వల్ల జుట్టు చిట్లడం తగ్గించడంతో పాటు, ఇక ముందు జుట్టుకు డ్యామేజ్ కలగకుండా నివారిస్తుంది. ఇప్పటికే చిట్లిన జుట్టుకు నివారణ మార్గాలేవు , కానీ చిట్లిన జుట్టును ట్రిమ్ చేయడమే ఉత్తమ మార్గం. అయితే, ట్రిమ్ చేసిన తర్వాత ఈ పదార్థాలను ఉపయోగించడం వల్ల ఇక ముందు జుట్టు చిట్లకుండా నివారిస్తుంది. చిట్లిన జుట్టును నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్

గుడ్డు: గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. జుట్టుకు గుడ్డును హెయిర్ మాస్క్ లా అప్లై చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే జుట్టు పైన నుండి క్రింది వరకూ హెల్తీగా మరియు సిల్కీగా కనబడుతుంది.

అలోవెర

అలోవెర

కలబంద రసం జుట్టుకు నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది. ముఖ్యంగా బ్యూటీ స్టోర్స్ లో ఉండే వాటికంటే , నేచురల్ గా ఫ్రెష్ అలోవెర జెల్ ను జుట్టుకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబంద రసం జుట్టుకు నేచురల్ గా మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇది జుట్టు చివర్లను మాయిశ్చరైజర్ గా మార్చుతుంది. ముఖ్యంగా కర్లీ హెయిర్ కు కలబంద గ్రేట్ రెమెడీ.

పెరుగు:

పెరుగు:

పెరుగులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి , తలకు, జుట్టు చివర్లకు హెయిర్ మాస్క్ వేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మారుతుంది. జుట్టు చివర్లు చిట్లడాన్ని నివారించడంలో ఇది ఒక సులభ మార్గం. . ఈ హెయిర్ మాస్క్ కు ఉపయోగించే రెండు పదార్థాలు మన వంటగదిలో చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి.

మయోనైజ్:

మయోనైజ్:

మయోనైజ్ అంటే బేసికల్ గా కొన్ని రకాల నూనెలు మరియు గుడ్డు మిశ్రమం., ఇది డ్యామేజ్ అయిన జుట్టుకు ప్రీ షవర్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఇది కొద్దిగా వాసన వస్తుంది,కాబట్టి, వాసన పడని వారు మయోనైజ్ కు మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవచ్చు.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

జుట్టు సంరక్షణలో భాగంగా కొబ్బరి నూనెను కొన్ని వేల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది, స్ట్రాంగ్ గా మార్చుతుంది. కొబ్బరి నూనె ఒక ఎఫెక్టివ్ మాయిశ్చరైజింగ్ హెయిర్ ఆయిల్ . ఇది జుట్టును ఏ మాత్రం డ్యామేజ్ కానివ్వదు. జుట్టు చిట్లకుండా చేయడంలో నేచురల్ హోం రెమెడీ.

కోకబట్టర్

కోకబట్టర్

కోక బీన్స్ నుండి తయారుచేసేదే కోకబట్టర్, ఇది నేచురల్ ఫ్యాట్ కంటెంట్. తలస్నానం చేసిన తర్వాత ఇది గ్రేట్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది . ఇది రూమ్ టెంపరేచర్ లో కరిగిపోతుంది. జుట్టుకు అప్లై చేయడం వల్ల హెయిర్ స్ట్రక్చర్ మారుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టుకు మరియు తలకు తగినంత మాయిశ్చరైజర్ అందిస్తుంది. చిట్లిన జుట్టును నివారించడంలో ఇది బెస్ట్ ఆయిల్

విటమిన్ ఇ

విటమిన్ ఇ

జుట్టుకు విటమిన్ ఇ స్ట్రాంగ్ డోస్ పొందాలనుకుంటే, విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ ను తీసుకుని, బ్రేక్ చేసి అందులోని ఆయిల్ ను తీసి, చిట్లిన జుట్టుకు అప్లై చేయడం వల్ల స్ల్పిట్స్ తొలగిపోతాయి. తలస్నానానికి ముందు దీన్ని జుట్టు అప్లై చేయడం మంచిది.

ఆముదం:

ఆముదం:

నూనెలన్నింటిలోకి, ఒక గ్రేట్ ఆయిల్ ఆముదం, ఇందులో ఓమేగా బి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది జుట్టుకు చాలా మేలు చేస్తుంది, జుట్టు చిట్లకుండా చేయడంలో ఇది బెస్ట్.

తేనె:

తేనె:

తేనె జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. తలస్నానం చేయడానికి ముందు జుట్టు చివర్లకు కొద్దిగా తేనె అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా, స్మూత్ గా, షైనీగా మార్చుతుంది.

English summary

10 Best Kitchen Ingredients To Get Rid Of Split Ends

Split ends are the most common signs of unhealthy hair. There can be various reasons for split ends. They are mostly self inflicted. There are simple things you could do to get rid of them. There are also many kitchen ingredients to get rid of split ends.
Desktop Bottom Promotion