For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు నివారణకు 12 ఆయుర్వేదిక్ హోం రెమెడీస్ ..!

చుండ్రు నివారణకు వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉన్నా అవన్నీ సరిగా పనిచేయకపోవచ్చు. కాబట్టి, ఆయుర్వేదం ఎంపిక చేసుకోవడం మంచిది. ఆయుర్వేదం చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ..

|

జుట్టుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల్లో చుండ్రు ఒకటి. తలలో డెడ్ స్కిన్ సెల్స్ వల్ల వైట్ ఫ్లేక్స్ (చర్మం మీద పొట్టు ఏర్పడుతుంది) అది తలకు మాత్రమే పరిమితం కాకుండా భుజాల మీద రాలుతుంది.తలలో దురద, ఇతర సమస్యలు, ఇతరుల ముందు చాలా ఇబ్బంది కలిగిస్తుంది . డెడ్ స్కిన్ సెల్స్ వల్ల చర్మ రంద్రాలు క్లోజ్ అవ్వడం వల్ల జుట్టు వీక్ గా మారుతుంది. దాంతో జుట్టు రాలడం అధికమవుతుంది. తలదువ్వినప్పుడు చుండ్రు భుజాల మీద, ఐబ్రోస్ మీద, దుస్తుల మీద పడుతుంది.

వాతావరణంలో మార్పులు, వేడి, చల్లని వాతావరణం వల్ల , హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల, ఎక్కువ రోజుల నుండి మలబద్దక సమస్య , ఒత్తిడి, అలసట, పొల్యుషన్ మరియు మరిన్ని ఇతర సమస్యల వల్ల తలలో చుండ్రు ఏర్పడుతుంది. చుండ్రు నివారణకు వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉన్నా అవన్నీ సరిగా పనిచేయకపోవచ్చు. కాబట్టి, ఆయుర్వేదం ఎంపిక చేసుకోవడం మంచిది. ఆయుర్వేదం చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా చుండ్రు నివారించే రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

 కర్పూరం, కొబ్బరి నూనె:

కర్పూరం, కొబ్బరి నూనె:

చుండ్రును నివారణకు అమ్మమ్మల కాలం నాటి చిట్కా కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా షేక్ చేసి స్టోర్ చేసుకోవాలి. కర్పూరం తలకు చల్లదనం అందిస్తుంది. చుండ్రును నివారిస్తుంది.

కొబ్బరి నూనె, నిమ్మరసం:

కొబ్బరి నూనె, నిమ్మరసం:

అన్ని రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో నిమ్మరసం తప్పనిసరి. గోరువెచ్చగా ఉండే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు పూర్తిగా అప్లై చేయాలి. తలస్నానం చేయడానికి అరగంట ముందు తలకు అప్లై చేసి తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నుండి విముక్తి కలుగుతుంది.

శెనగపిండి, పెరుగు:

శెనగపిండి, పెరుగు:

రెండు స్పూన్ల శెనగిపండిని, పెరుగులో మిక్స్ చేసి, అరస్పూన్ నిమ్మరసం కలిగి మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. శెనగపిండి, పెరుగు బెస్ట్ హెయిర్ క్లెన్సర్ . ఇది జుట్టును త్వరగా క్లీన్ చేస్తుంది. చుండ్రును నివారిస్తుంది.

పెరుగు, నిమ్మరసం

పెరుగు, నిమ్మరసం

పెరుగులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, రెండూ బాగా కలగలిసే వరకూ శుభ్రం చేయాలి. తర్వాత తలకు పూర్తిగా అప్లై చేయాలి.. ఈ చిట్కా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. పెరుగు మాశ్చరైజర్ లా పనిచేస్తుంది. తలను కూల్ గా ఉంచుతుంది.

వేప, నిమ్మరసం :

వేప, నిమ్మరసం :

వేప ఆకును మెత్తగా పేస్ట్ చేసి అందులో నిమ్మరసం మిక్స్ చేసి, రెండూ కలగలిసేలా చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

హాట్ ఆయిల్ మసాజ్ :

హాట్ ఆయిల్ మసాజ్ :

ఆయిల్ ను మీ జుట్టుకు అప్లై చేయడానికి ముందు , జస్ట్ గోరువెచ్చగా మార్చాలి. తర్వాత ఈ నూనెను ముని వేళ్ళతో జుట్టుకు, తలకు పట్టించాలి. రాత్రి నిద్రించడానికి ముందు అప్లై చేసి, ఉదయం తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

బాదం ఆయిల్ , ఆలివ్ ఆయిల్ :

బాదం ఆయిల్ , ఆలివ్ ఆయిల్ :

బాదం ఆయిల్ , ఆలివ్ ఆయిల్ ఈ రెండింటి కాంబినేషన్ లో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఈ కాంబినేషన్ నూనె చుండ్రును నివారించడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ నూనెను తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

 వెనిగర్ :

వెనిగర్ :

ఒక కప్పు హాట్ వాటర్ లో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ మిక్స్ చేసి, అందులో కాటన్ డిప్ చేసి తలకు బాగా అప్లై చేయాలి. వెనిగర్ జుట్టుకు కండీషనర్ మాత్రమే కాదు, ఇది చుండ్రును నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

పుదీనా, ఆపిల్ సైడర్ వెనిగర్ :

పుదీనా, ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఒక కప్పు నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి వేడి చేయాలి. అందులో కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసి ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని మరో సారి వేడి చేసి, వడగట్టి, చల్లారనివ్వాలి. గోరువెచ్చగా మారిన తర్వాత చేతి వేళ్ళతో తలకు అప్లై చేసి సున్నితమైన మసాజ్ ఇవ్వాలి. తర్వాత తలస్నానం చేయాలి.

 ఆమ్లా పేస్ట్ :

ఆమ్లా పేస్ట్ :

ఆమ్లా పేస్ట్ లో యాంటీ డాండ్రఫ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఉసిరికాయను మెత్తగా పేస్ట్ చేసి, తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

 అలోవెర:

అలోవెర:

అలోవెర (కలబంద) ఆకుల నుండి తీసిన జెల్ ను నేరుగా తలకు అప్లై చేసిన ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు నుండి ఉపశమనం పొందుతారు.

గుడ్డు :

గుడ్డు :

గుడ్డులో హెయిర్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. ఇందులో న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇది జుట్టుకు చాలా ఉపయోగకరమైనది. ఇది చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గుడ్డులోని మిశ్రమాన్ని పూర్తిగా గిలకొట్టి తర్వాత తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

English summary

12 Ayurvedic Cures For Dandruff

12 Ayurvedic Cures For Dandruff,Dandruff might be the result of a number of factors such as frequent heat or cold exposure, excessive exposure to hair styling products, chronic constipation, stress, fatigue, pollution and much more. There are lots of shampoos that boast of clearing white flakes, but most real
Story first published: Thursday, November 24, 2016, 12:15 [IST]
Desktop Bottom Promotion