హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇలా చెయ్యకండి..?

By Sindhu
Subscribe to Boldsky

కురులను సంరక్షించుకోవడంలో కొన్ని చేయాల్సిన మంచి పద్దతులున్నాయి. అలాగే కురులకు సంబంధించి కొన్ని చేయకూడనివి ఉన్నాయి. కురులు అందం వయస్సుతో సంబంధంలేదు. అన్ని వయస్సుల వారికి కురుల సంరక్షణ అవసరం. టీనేజ్ గర్ల్స్ దగ్గర నుండి గ్రాడ్ మదర్ వరకూ కేశసౌందర్య అవసరం.

హెయిర్ ఫాల్ అనేది మీ మొదటి రుతుచక్రం నుండి మీరు మోనోపాజ్ దశ చేరే వరకూ జుట్టు రాలడం పై పెద్ద ప్రభావం ఉండదు. అంతగా రాలుతున్నాయంటే అందుకు వాతావరణంలో మార్పులు, శరీరంలో మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, ఆహారం కారణమనే చెప్పాలి. మనం ఇప్పటి వరకూ కేశ సంరక్షించుకోవడానికి చాలా చిట్కాలను చదివాం. అయితే ఇప్పుడు కురులను ఏం చేయకూడదు అనేవాటి మీదు కొన్ని చిట్కాలు మీకోసం..

1. షాంపు ఎక్కువ వాడకండి:

1. షాంపు ఎక్కువ వాడకండి:

ప్రతి రోజూ తలస్నానానికి యాంటి డాండ్రఫ్ షాంపూను ఉపయోగించకూడదు. ముఖ్యంగా కెమికల్స్ తో తయారైనటువంటి షాంపూలను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంది.

2. హెయిర్ డైలు:

2. హెయిర్ డైలు:

సాధారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది హెయిర్ స్టైల్ కోసమనో, లేదా వైట్ హెయిర్ కప్పిపుచ్చడానికనో కృత్రిమ రంగుల(హెయిర్ డైలను)సంవత్సరాంతం ఉపయోగిస్తుంటారు. కాబట్టి వాటికి దూరంగా ఉండటమే మంచిది. ఇవి ప్రస్తుతానికి అందాన్ని చేకూర్చినా తర్వాత దాని దుష్ర్పభావం కేశాలపై ఎక్కువగా చూపిస్తుంది.

3. హెయిర్ కట్ అండ్ హెయిర్ స్టైల్ :

3. హెయిర్ కట్ అండ్ హెయిర్ స్టైల్ :

హెయిర్ స్టైల్ కోసం కలరింగ్, హెయిర్ కట్స్ ఎక్కువగా చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ కలరింగ్ మరియు స్ట్రెయిట్ హెయిర్ రెండూ ఒకేసారి, ఒకే సమయంలో చేయించకూడదు. ఈ రెండూ చేయించుకోనెందు రెండింటి మధ్య కురులకు కొంత విశ్రాంతి అవసరం.

 4. రఫ్ కూంబింగ్ :

4. రఫ్ కూంబింగ్ :

ముఖ్యంగా తలస్నానం చేసినప్పుడు దువ్వెనతో రఫ్(దురుసు) గా దువ్వకూడదు. తడిసిన జుట్టును మళ్ళీ మళ్ళీ దువ్వకూడదు. నేచురల్ గా జుట్టు తడి ఆరిన తర్వాతే దువ్వాలి.

 5. హెర్ ప్యాక్స్ తో జాగ్రత్త:

5. హెర్ ప్యాక్స్ తో జాగ్రత్త:

కొన్ని రకాలైనటువంటి హెయిర్ ప్యాక్ లను వెంట వెంటనే వేయడం కాని, లేదా రెండు రకాలైనటు వంటి హెయిర్ ప్యాక్ లను మిక్స్ చేసి వేసుకోవడం లాంటివి చేయకూడదు. దాంతో కురుల ఆరోగ్యంపై తీవ్రమైన మార్పులను కలిగిస్తుంది.

6. హెయిర్ జెల్స్:

6. హెయిర్ జెల్స్:

హెయిర్ స్టైల్ కోసం ఎక్కువగా హెయిర్ జెల్స్ ను ఉపయోగింస్తుంటారు. వీటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెయిర్ స్ట్రెయిటనింగ్ జెల్స్ కు దూరంగా ఉండటమే మంచిది.

 7. హెయిర్ కు సన్ స్క్రీన్ తగ్గించాలి:

7. హెయిర్ కు సన్ స్క్రీన్ తగ్గించాలి:

హెయిర్ సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించడం పూర్తిగా తగ్గించాలి. వాటి స్థానంలో హెయిర్ కండిషనర్స్ ను ఉపయోగించడం ఉత్తమమైన పద్దతి.

 8. రఫ్ గా ఉన్న దువ్వెనెలను వాడదు:

8. రఫ్ గా ఉన్న దువ్వెనెలను వాడదు:

జుట్టు రాలే సమస్య ఉన్నవారు రఫ్ గా ఉన్న దువ్వెనెలను వాడకుండా టూత్ బ్రెష్ లా సున్నితంగా ఉన్న దువ్వెనెలను ఉపయోగించాలి. కురుల పరిమాణంను బట్టి చిన్న పెద్ద బ్రష్ లను ఉపయోగించాలి. ఇతరుల తల కండిషన్ తెలియకుండా వారి దువ్వెనులను వాడకూడదు. మీరు మీ దువ్వెనలను షేర్ చేసుకోకూడదు.

9. చుండ్రున్నప్పుడు నూనె పెట్టకూడదు:

9. చుండ్రున్నప్పుడు నూనె పెట్టకూడదు:

ఒక వేళ సోరియాసిస్ లేదా చుండ్రు కలిగి ఉన్నట్లైతే తలకు నూనె పెట్టకూడదు. నూనె చుండ్రుకు సోరియాసిస్ కు కారణమైయ్యే మలాసెజియా ఈస్ట్ (ఇది ఒక రకమైనటువంటి జీవి అనే చెప్పచ్చు)ఆహారం వంటిది ఆయిల్. ఆయిల్ ను రాసుకోవడం వల్ల చుండ్రు అధికమౌతుంది. దాంతో దురద, పేను కొరుకుడు, హెయిర్ ఫాల్ పెరుగుతాయి.

10. కురులు పొడవుగా ఉన్నప్పుడు..

10. కురులు పొడవుగా ఉన్నప్పుడు..

ఎప్పుడూ కురులను టైట్ గా ముడిపెట్టడం కానీ, లేదా టైట్ గా హెయిర్ బ్యాండ్స్ తో కురులను బంధించడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల కురులకు తెగిపోవడం లేదా రాలిపోవడం వంటివి జరుగుతాయి.

11. ఒకే రకమైనటువంటి షాంపు వాడకూడదు:

11. ఒకే రకమైనటువంటి షాంపు వాడకూడదు:

ఒకే రకమైనటువంటి షాంపూను నెలల తరబడి ఉపయోగించకుండి కొన్ని నెలల తర్వాత షాంపూ బ్రాండ్ ను మార్చుతుండాలి.

12. డ్రై హెయిర్ తో జాగ్రత్తగా ఉండాలి :

12. డ్రై హెయిర్ తో జాగ్రత్తగా ఉండాలి :

పొడి జుట్టును లాగడం, ఎలా పడితే అలా రుద్దడం, విదిలించడం వంటివి చేయకూడదు. అలా చేయడం వల్ల వెంట్రుకలు మధ్యలో తెగిపోవడానికి అవకాశం ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    12 Things not to do to your Hair

    Dont's for your hair are as important as the do's. Whether you are a teenage girl or grandmother of three, there is no end to hair fall - right from the onset of your first menstrual cycle to the menopausal stage. Here's our list of 25 things you shouldn't be doing to your hair...
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more