For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టీ ట్రీ ఆయిల్ తో చుండ్రుని తొలగించుకునే సింపుల్ రెమిడీస్..!

By Swathi
|

కాలుష్యం, ఒత్తిడి, దూర ప్రయాణాల కారణంగా ప్రతి ఒక్కరిని చుండ్రు సమస్య వేధిస్తుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో చుండ్రుతో బాధపడే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్ని ప్యాక్ లు వేసుకున్నా, ఎన్ని షాంపూలు వాడినా.. చుండ్రు సమస్య నుంచి మాత్రం బయటపడలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

చుండ్రు వల్ల కేవలం ఇది జుట్టుకి మాత్రమే కాదు.. చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు, యాక్నెకి కారణమవుతుంది. డ్రైస్కాల్ప్ కండిషన్, సరైన శ్రద్ధ తీసుకోకపోవడం, పోషకాహార లోపం వంటివన్నీ.. డాండ్రఫ్ కి కారణమవుతాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూలు.. మంచి కంటే.. ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి.

5 DIY Tea Tree Oil Remedies For 99% Dandruff Clearance!

కాబట్టి చుండ్రుని శాశ్వతంగా, ఎఫెక్టివ్ తొలగించుకోవాలని మీరు భావిస్తే.. ఒక అద్భుతమైన హోం రెమెడీ ఉంది. టీట్రీ ఆయిల్ ఉపయోగించి.. రకరకాల పదార్థాలతో కలిపి వాడితే.. ఒక్కసారికే ఫలితాలను చూడవచ్చు. టీ ట్రీ ఆయిల్ లో టెర్పీనెన్ 4 ఓల్ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది జుట్టులోని దుమ్ము, సెబమ్ ని తొలగించి.. చుండ్రుని అరికడుతుంది. మరి టీట్రీ ఆయిల్ తో చుండ్రుని ఎలా నివారించుకోవచ్చో చూద్దాం..

టీట్రీ ఆయిల్ స్ప్రే

టీట్రీ ఆయిల్ స్ప్రే

ఒక స్ప్రే బాటిల్ తీసుకుని, 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 5 చుక్కల టీట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ అయ్యేలా షేక్ చేయాలి. దీన్ని స్కాల్ప మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చుండ్రు తొలగిపోతుంది.

టీట్రీ ఆయిల్, కొబ్బరినూనె

టీట్రీ ఆయిల్, కొబ్బరినూనె

ఒక పాన్ తీసుకుని కాస్త వేడిచేసిన తర్వాత అరకప్పు కొబ్బరినూనె, 1టేబుల్ స్పూన్ టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. సన్నని మంటపై ఒక నిమిషం వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ ఆయిల్ తో స్కాల్ప్ ని మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సైడర్ వెనిగర్, టీట్రీ ఆయిల్

యాపిల్ సైడర్ వెనిగర్, టీట్రీ ఆయిల్

ఒక కప్పు తీసుకుని పావు కప్పు వెనిగర్, 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని షాంపూ, కండిషనర్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు శుభ్రం చేసుకుంటే చుండ్రు నివారించుకోవచ్చు.

జోజోబా ఆయిల్, టీట్రీ ఆయిల్

జోజోబా ఆయిల్, టీట్రీ ఆయిల్

2టేబుల్ స్పూన్ల జోజోబా ఆయిల్ తీసుకుని అందులో 5 చుక్కల టీట్రీ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. కాసేపు స్కాల్ప్ ని బాగా మసాజ్ చేయాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా జెల్, టీట్రీ ఆయిల్

అలోవెరా జెల్, టీట్రీ ఆయిల్

3టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ని గిన్నెలో తీసుకోవాలి. అందులో 20 చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. రెండింటినీ ఫోర్క్ తో బాగా మిక్స్ చేసి.. స్కాల్ప్ కి పట్టించాలి. 30 నిమిషాలు తర్వాత షాంపూ, కండిషర్ తో శుభ్రం చేసుకోవాలి. చూశారుగా ఈ చిన్న సింపుల్ రెమిడీస్ ఫాలో అయితే.. చుండ్రుని చాలా న్యాచురల్ గా నివారించుకోవచ్చు.

English summary

5 DIY Tea Tree Oil Remedies For 99% Dandruff Clearance!

5 DIY Tea Tree Oil Remedies For 99% Dandruff Clearance! Bid adieu to dandruff, once and for all, with these easy DIY hair masks using tea tree oil.
Story first published: Monday, November 28, 2016, 11:21 [IST]
Desktop Bottom Promotion