For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్ల బట్టతలపై ఉన్న అపోహలు, వాస్తవాలు..!

By Swathi
|

సాధారణంగా జుట్టు రాలడం, తెల్లజుట్టు సమస్య ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటుందని.. అది వాళ్లకు పెద్ద సమస్య అనుకుంటారు. కానీ.. అది పొరపాటు. చాలా మంది మగవాళ్లు జుట్టు రాలిపోతుండటం వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. యంగ్ ఏజ్ లోనే జుట్టు రాలిపోతుండటంతో.. వాళ్లలో ఎక్కడలేని ఆందోళన పెరుగుతోంది.

బట్టతల నివారించడానికి సింపుల్ సొల్యూషన్..! ఆముదం.. !! బట్టతల నివారించడానికి సింపుల్ సొల్యూషన్..! ఆముదం.. !!

మగవాళ్లలో బట్టతల గురించి అనేక వాస్తవాలు, ఫ్యాక్ట్స్ ఉన్నాయి. బ్యూటీ ఎక్స్పర్ట్స్ కొంతమంది.. మగవాళ్లలో బట్టతల గురించి ఉన్న దురభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు. అసలు బట్టతల గురించి ఫ్యాక్ట్స్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు బట్టతల ఎందుకు వస్తుంది ? ఎవరికి వస్తుంది ? అని రకరకాల వాస్తవాలు ఇప్పుడు చూద్దాం..

40 ఏళ్ల తర్వాతే మగవాళ్లలో హెయిర్ లాస్

40 ఏళ్ల తర్వాతే మగవాళ్లలో హెయిర్ లాస్

మగవాళ్లలో 40 ఏళ్ల తర్వాత జుట్టు రాలే సమస్య మొదలవుతుందనేది అపోహ. మగవాళ్లలో 17 ఏళ్లలోనే జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. కల్ ప్రిట్ హార్మోన్, డీహెచ్ టీ ఏర్పడటం మొదలవుతుంది. జుట్టు రాలడం మొదలైనప్పటి నుంచి జుట్టు పలచబడుతూ ఉంటుంది.

టెస్టోస్టెరోన్

టెస్టోస్టెరోన్

టెస్టోస్టెరోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగితే.. బట్టతలకు కారణమవుతుందని చాలామందిలో అపోహ ఉంది. కానీ.. టెస్టోస్టెరాన్ ఎక్కువైతే.. జుట్టు రాలే సమస్య పెరగదు. వాస్తవానికి డీహెచ్ టీ సెన్సిటివిటీ వల్ల జుట్టు రాలుతుంది. బట్టతల సమస్య, జుట్టు రాలే సమస్య ఉన్న మగవాళ్లలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ సాధారణ స్థాయిలో ఉంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ కి హెయిర్ ఫాల్ కి ఎలాంటి సంబంధం లేదని వివరిస్తున్నారు.

కుచ్చులుగా జుట్టు రాలడం

కుచ్చులుగా జుట్టు రాలడం

ఎక్కువ మొత్తంలో జుట్ట రాలిపోతే.. బట్టతలకు సంకేతమని చాలా మంది భావిస్తారు. కానీ.. ఇలా ఎక్కువ మొత్తంలో జుట్టు రాలడాన్ని సూక్ష్మీకరణం అంటారు. దీనివల్ల జుట్టు పలుచడుతుంది అంతే. ఇలా రాలిన జుట్టు ప్లేస్ లో థిన్ హెయిర్ పెరుగుతుంది. అలా పలుచగా జుట్టు మారి.. తర్వాత బట్టతలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది.

ఎక్కువగా షాంపూ

ఎక్కువగా షాంపూ

షాంపూ చేసుకునేటప్పుడు చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అప్పుడు షాంపూ వల్ల జుట్టు రాలుతోందని చెబుతూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు.

రక్త ప్రసరణ తగ్గడం

రక్త ప్రసరణ తగ్గడం

జుట్టు పెరిగేటప్పుడు స్కాల్ప్ కి బ్లడ్ ఫ్లో సరైన విధంగా జరగాలి. ఒకవేళ మీరు జుట్టు కోల్పోతున్నారంటే.. మీ స్కాల్ప్ కి బ్లడ్ ఎక్కువగా అవసరం ఉండదు. జుట్టు రాలడానికి రక్త ప్రసరణ సమస్య కాదు.

జన్యుపరంగా జుట్టు రాలే సమస్య

జన్యుపరంగా జుట్టు రాలే సమస్య

జన్యుపరమైన కారణాల వల్ల మగవాళ్లలో మాత్రమే జుట్టు రాలే సమస్య ఉందనుకోవడం పొరపాటు. 40 శాతం మహిళలు జెనెటిక్ హెయిర్ లాస్, జుట్టు పలచబడటం సమస్యను ఎదుర్కొంటారు.

వారసత్వంగా మగవాళ్లకు మాత్రమే

వారసత్వంగా మగవాళ్లకు మాత్రమే

ఫ్యామిలీ హిస్టరీ కారణంగా కేవలం మగవాళ్లలో మాత్రమే.. జుట్టు రాలే సమస్య ఉంటుందనేది అపోహ. 70 నుంచి 80 శాతం మంది మగవాళ్లు కుటుంబ సభ్యల కారణంగా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటున్నారు. 20 శాతం మందిలో వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికీ జుట్టు రాలే సమస్య కనిపించడం లేదు.

English summary

7 common misconceptions about male baldness: Facts about male baldness

7 common misconceptions about male baldness. Do you think only older men need to worry about hair fall? Here are a few misconceptions and facts about male baldness.
Story first published: Tuesday, April 26, 2016, 10:28 [IST]
Desktop Bottom Promotion