For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు హెల్తీ గా ఉండటానికి రెగ్యులర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

జుట్టు హెల్తీగా, వేగంగా పెరగాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే.. కొన్ని ముఖ్యమైన విషయాలను మైండ్ లో పెట్టుకోవాలి.

By Swathi
|

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. కేవలం ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించడం, అప్పుడప్పుడు బ్యూటి పార్లర్లకు వెళ్లడం కాదు. జుట్టు హెల్తీగా ఉండాలంటే.. ఇంట్లోనే కొన్ని న్యాచురల్ ట్రీట్మెంట్స్ అందివ్వాలి. దాంతో పాటు.. జుట్టుని స్టైల్ మార్చుకునే ప్రయత్నంలో హానికర అలవాట్లకు దూరంగా ఉండాలి.

hair care tips

జుట్టు హెల్తీగా, వేగంగా పెరగాలంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. అలాగే.. కొన్ని ముఖ్యమైన విషయాలను మైండ్ లో పెట్టుకోవాలి. ఏ చిన్న పొరపాటు చేసినా.. మీ అందమైన జుట్టు కాస్త.. నిర్జీవంగా, పలుచగా మారిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి రెగ్యులర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

తలస్నానం

తలస్నానం

తలస్నానం కోసం గోరువెచ్చని లేదా చల్లటి నీటిని మాత్రమే ఉపయోగించాలి. అప్పుడప్పుడు ఆముదాన్ని వేడిచేసి, తలకు రాసుకుని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

హెయిర్ స్టైలింగ్

హెయిర్ స్టైలింగ్

సాధ్యమైనంతవరకు హెయిర్‌స్టైలింగ్‌ చికిత్సలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిలో గాడత ఎక్కువగా ఉండే రసాయనాలు తాత్కాలికంగా మెరుపునిచ్చినా తర్వాత జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి.

కలబంద

కలబంద

జుట్టు మరీ పొడిగా కనిపిస్తుంటే కలబంద గుజ్జు లేదా పెరుగు తలకు పట్టించి కాసేపయ్యాక కడిగేయాలి. ఇది జుట్టుకు కండీషనర్ లా పనిచేస్తుంది. కాబట్టి కండినషర్ కి బదులుగా అప్పుడప్పుడు దీన్ని వాడవచ్చు.

వారానికి రెండుసార్లు

వారానికి రెండుసార్లు

తలను సాధ్యమైనంత పరిశుభ్రంగా నూనె లేకుండా ఉంచుకోవాలి. కాబట్టి వారానికి రెండు మూడుసార్లు తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు హెల్తీగా ఉంటుంది. అలాగని రోజు తలస్నానం చేస్తే తలలోని సహజ నూనెలు పోయి... జుట్టు నిర్జీవంగా మారుతుంది.

పెరుగు

పెరుగు

రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగులో టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిసి తలకు పట్టించి... అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తుంటే జుట్టు సాఫ్ట్ గా, హెల్తీగా ఉంటుంది.

షాంపూ, కండిషనర్

షాంపూ, కండిషనర్

మీ జుట్టు తత్వానికి సరిపోయే కండీషనర్‌, షాంపులను మాత్రమే ఎంచుకోవాలి. తడి జుట్టును ఎట్టి పరిస్థితిలో దువ్వకూడదు. దీనివల్ల సున్నితంగా ఉన్న జుట్టు కుచ్చులుకుచ్చులుగా ఊడిపోతుంది.

English summary

7 Quick Tips and Shortcuts for Healthy Hair

7 Quick Tips and Shortcuts for Healthy Hair. Does your hair take more time than it should? If you’re reading this, the answer is probably yes.
Story first published: Saturday, October 15, 2016, 15:48 [IST]
Desktop Bottom Promotion