For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘‘హెయిర్ డై’’ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు రాలిపోతుందటే కంగారుపడిపోతారు. జుట్టు తెల్లగా మారుతుందంటే హైరానా పడిపోతారు. తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ డైలు, కలరింగ్ లు వేసుకుంటారు. కొంత మంది ఈ మోడ్రన్ యుగంలో స్టైల్ గా కనబడుట కోసం కూడా జుట్టుకు కలర్ వేసుకుంటారు . కలరింగ్ లో కూడా వివిధ రకాల బ్రాండ్స్ ఉన్నాయి. వీటిని ఇంట్లోనే ప్రయత్నించవచ్చు. లేదా బ్యూటీ పార్లలలో వేయించుకోవచ్చు. ఫ్యాన్సీ స్టోర్స్లో మనం కొని తెచ్చుకునే ప్రొడక్ట్స్ మీద హెయిర్ కలర్స్ వేసుకోవాడానికి కొన్ని డైరెక్షన్స్ మరియు ఇన్ స్ట్రక్షన్స్ సూచించి ఉంటారు. వీటితో పాటు జుటుకు మరికొన్ని జాగ్రత్తలను తీసుకోవడం కూడా చాలా అవసరం.

అచితే మీరు ఎంపిక చేసుకునే హెయిర్ కలర్ బ్రాండ్ మీదే ఉంది అసలు రంగు, జుట్టు ఆరోగ్యం. మీ జుట్టు తత్వాన్ని బట్టి కలర్ ఎంపిక చేసుకోవాలి. ఎంపిక చేసుకునే కలర్స్ లోని కెమికల్స్ కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ గా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో బలహీనంగా పనిచేస్తాయి. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే హెయిర్ కలర్స్ లో అమ్మోనియాను ఉపయోగిస్తుంటారు. ఇది హెయిర్ బ్లీచ్ కు ఉపయోగించే కెమిక్ ఏజెంట్ . అమ్మోనియా జుట్టును మరింత డ్రైగా మార్చతుంది. జుట్టు చిట్లడానికి కారణమవుతుంది. .

మీ జుట్టు అందంగా , గ్లాసీగా, షైనీగా కనబడుటకు జుట్టుకు కలరింగ్ వేసుకునే వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే జుట్టు రంగు వేసుకుకున్నాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, జుట్టు నిర్జీవంగా మరియు డ్రైగా మారుతుంది. దాంతో ఉన్న జుట్టు కాస్త నిర్జీవంగా కనబడుతుంది. జుట్టుకు రంగు వేసుకున్నా మీరు కోరుకున్న జుట్టును మాత్రం పొందలేరు.? కాబట్టి రంగు వేసుకున్నాక కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.

జుట్టుకు రంగు వేసుకున్నాకా ఖచ్చితంగా తీసుకోవల్సిన జాగ్రత్తలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని కనుక ఫాలో అయితే తప్పనిసరిగా మంచి ఫలితాలను పొందుతారు!

షాంపు :

షాంపు :

కలర్డ్ హెయిర్ కు ఉపయోగించడానికి ప్రత్యేకంగా తయారుచేసిన సల్ఫేట్ లేని షాంపును ఎంపిక చేసుకోవాలి. అలాగే షాంపును ఎక్కువ ఉపయోగించకూడదు. షాంపు ఎక్కువ వాడటం వల్ల కలర్ త్వరగా షేడ్ అయిపోతుంది. అలాగే నేచురల్ ఆయిల్స్ కోల్పోతాయి.

డ్రై షాంపు

డ్రై షాంపు

షాంపు లేనప్పుడు, డ్రై షాంపును ఉపయోగించాలి. వారంలో రెండు సార్లు షాంపు చేస్తే సరిపోతుంది. కలరింగ్ హెయిర్ కు ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. కలర్ త్వరగా షేడ్ అవ్వకుండా సహాయపడుతుంది.

కండీషనర్

కండీషనర్

కలర్డ్ హెయిర్ కు ప్రత్యేకంగా తయారుచేసిన కండీషనర్స్ నే ఉపయోగించాలి, ఇవి ఇతర కండీషనర్స్ కంటే ఎక్కువగా ఉపయోగడపుతాయి. కలరింగ్ హెయిర్ కోసం తీసుకునే జాగ్రత్తలో ఇది ఒక బెస్ట్ కండీషనర్ .

ఇంట్లో తయారుచేసుకునే కండీషనర్స్

ఇంట్లో తయారుచేసుకునే కండీషనర్స్

ఎఫెక్టివ్ గా నేచురల్ గా ఫలితాలనిచ్చే కండీషనర్స్...అదీ మనం ఇంట్లో స్వయంగా తయారుచేసుకొనే కండీషనర్ కలరింగ్ జుట్టుకు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అటువంటి కండీషనర్స్ లో మెయోనైజ్, పెరుగు, అలోవెర, మరికొన్ని కొబ్బరి నూనె మరియు ఆలివ్ ఆయిల్ వంటివి కూడా కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు .

ఆయిల్ ట్రీట్మెంట్ :

ఆయిల్ ట్రీట్మెంట్ :

జుట్టుకు డీప్ గా కండీషనర్ ను అప్లై చేయాలి. కనీసం వారంలో ఒక సారైనా కండీషనర్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇది హెల్తీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది .

షేడ్స్

షేడ్స్

జుట్టుకు కలరింగ్ తో పాటు షేడ్స్ ను ఎంపిక చేసుకునేటప్పుడు మన్నికైనవి ఎంపిక చేసుకోవాలి. లేదంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అటువంటి వాటిలో రెడ్ కలర్ ఒకటి. కాబట్టి, హెయిర్ షేడ్స్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.

వాటర్ టెంపరేచర్

వాటర్ టెంపరేచర్

అలాగే హెయిర్ డై వేసుకున్న తర్వాత వేడి నీళ్ళతో తలస్నానం చేసుకోకూడదు. వేడీనీల్ళు జుట్టుకు అంటిన హెయిర్ డై తెరచుకునేలా చేసి, డై తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి హెయిర్ కు డై వేసుకున్న తర్వాత చల్లటి నీళ్ళు లేదా గోరువెచ్చని నీళ్ల తో తలస్నానం చేసుకోవాలి.

English summary

7 Tips To Take Care Of Coloured Hair

Colouring hair is a really good option, be it for style or for covering up the greys. There are lots of different brands you could try from to colour your hair. You could do it at home or even get it done at a parlour. The store-bought hair colours come with directions and instructions. Also, there are certain tips to keep in mind when taking care of coloured hair.
Desktop Bottom Promotion