For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తుగా, స్ట్రాంగ్ గా హెయిర్ పెరగడానికి మెంతులతో 8 రకాల హెయిర్ మాస్క్ లు..

జుట్టు రాలడం నివారించడంలో, చుండ్రును నివారించడంలో మెంతులు గొప్పవని బ్యూటి నిపుణులు కూడా సూచిస్తున్నారు. మెంతులు చాలా చౌకగా మనకు అందుబాటులో ఉండే ఒక పోపు దినుసు, అయితేవీటిని రెగ్యులర్ జుట్టుకు ఉపయోగిస్త

|

ఒత్తైన జుట్టు ఉంటే అది అందాన్ని తెలుపుతుంది. ప్రతి ఒక్కరూ ఒరోగ్యకరమైన , ఒత్తైన , స్ట్రాంగ్ గా ఉండే జుట్టును కోరుకుంటారు. జుట్టును అందంగా ...అట్రాక్టివ్ గా మార్చుకోవడానికి వివిధ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి.

అయితే హెల్తీ హెయిర్ పొందడానికి హోం రెమెడీస్ కంటే మరేది సాటి రావు. మార్కెట్లో ఉండే హెయిర్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి . ఇవి వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి.

వంటగదిలో ఉండే మెంతులు జుట్టుకు గొప్పగా సహాయపడుతాయి. .జుట్టుకు ఉపయోగించే నేచురల్ ప్రొడక్ట్స్ లో మెంతులు ఒకటి. ఇది లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఇది ఒక నేచురల్ స్పైసీస్, ఇందులో పొటాషియం, సోడియం, మరియు మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి.

8 Fenugreek Seed Hair Mask Recipes For Thicker & Stronger Hair

వీటన్నింటిలోకి, ప్రోటీన్స్, విటమిన్ సి, ఐరన్, నికోటిన్ యాసిడ్, మరియు లెసిథిన్ లు హెయిర్ ఫోలిస్ ను హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా మార్చుతాయి. జుట్టు పెరుగలను ప్రోత్సహించడంలో ఇది ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇది హెయిర్ ఫోలిసెల్స్ ను రీబిల్డ్ చేస్తుంది.

జుట్టు రాలడం నివారించడంలో, చుండ్రును నివారించడంలో మెంతులు గొప్పవని బ్యూటి నిపుణులు కూడా సూచిస్తున్నారు. మెంతులు చాలా చౌకగా మనకు అందుబాటులో ఉండే ఒక పోపు దినుసు, అయితేవీటిని రెగ్యులర్ జుట్టుకు ఉపయోగిస్తే

ప్రయోజనాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి .

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి మెంతులుతో 8 రకాల ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ లు ఈ క్రింది విధంగా...

చుండ్రునివారించే మెంతి మాస్క్:

చుండ్రునివారించే మెంతి మాస్క్:

మెంతి పేస్ట్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు పూర్తిగా అప్లై చేయాలి. దీన్ని తయారుచేయడానికి అరకప్పు మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి, బ్లెండ్ చేయాలి. తర్వాత దీన్ని తలకు అప్లై చేయాలి.

మెంతి , పెరుగు:

మెంతి , పెరుగు:

పెరుగు మరియు మెంతి కాంబినేషన్ హెయిర్ మాస్క్ తో ఖచ్చితంగా జుట్టు రాలడం కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని మెంతి ఆకులు తీసుకుని, బాయిల్ చేయాలి. తర్వాత జ్యూస్ తీసి, అందులో కొద్దిగా పెరుగు చేర్చి తర్వాత బాగా మిక్స్ చేసి తలకు, జుట్టుకు పూర్తిగా అప్లై చేయాలి.

మెంతి , ఆమ్లా:

మెంతి , ఆమ్లా:

తెల్ల జుట్టుకు బైబై చెప్పడానికి మెంతి, ఆమ్లా గ్రేట్ గా సహాయపడుతుంది. ఈరెండింటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి, డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మెంతులు, పాలు హెయిర్ కండీషనర్ గా:

మెంతులు, పాలు హెయిర్ కండీషనర్ గా:

మెంతులు నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. మెంతి పౌడర్ , పాలు రెండింటి కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది .ఇది నేచురల్ హెయిర్ కండీషనర్. పాలను మెంతిపొడిలో మిక్స్ చేసి పేస్ట్ ను తలకు మాస్క్ లా వేసుకోవచ్చు.

మెంతులు, గుడ్డు:

మెంతులు, గుడ్డు:

జుట్టు మరీ డ్రైగా ఉంటే? చింతించాల్సిన పనిలేదు, మెంతులను మెత్తగా పేస్ట్ చేసి,అందులో గుడ్డులోని తెల్లసొన వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఇది ఎఫెక్టివ్ రిజల్ట్ ను అందిస్తుంది.

మెంతులు, కొబ్బరి నూనె:

మెంతులు, కొబ్బరి నూనె:

మెంతులను నీటిలో వేసి బాగా ఉడికించాలి. బాగా ఉడికించి నీరు సగానికి వచ్చే వరకూ ఉడికించి క్రిందికి దింపుకోవాలి. తలకు నూనె రాసుకునేటప్పుడు కొబ్బరి నూలో బాయిల్ చేసిన మెంతి వాటర్ ను కొద్దిగా మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది బెటర్ రిజల్ట్ ను అందిస్తుంది.

మెంతులు, నీళ్ళు:

మెంతులు, నీళ్ళు:

ఆరోగ్యకరమైన జుట్టుకు ఇది మరో సులభమైన ఎఫెక్టివ్ మాస్క్. మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి 45నిముసాల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.

మెంతులు, ఆముదం నూనె:

మెంతులు, ఆముదం నూనె:

ఆముదం నూనెలో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం నూనెను మిక్స్ చేయాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇది జుట్టు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

English summary

8 Fenugreek Seed Hair Mask Recipes For Thicker & Stronger Hair

Use of fenugreek seeds in your hair care regimen can help provide you a healthy, lustrous mane! Read this article to know of 8 such ways to use fenugreek for hair.
Story first published: Monday, November 28, 2016, 19:04 [IST]
Desktop Bottom Promotion