Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
అబ్బాయిల్లో జుట్టు రాలడాన్ని తగ్గించి, బట్టతల నివారించే హోం రెమిడీస్..!!
అమ్మాయిలు అంటే.. అందం, జుట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటారు. అలాగే.. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు రెడీ అవడానికి గంటలు గంటలు కావాలి అని పదేపదే అంటుండటం వినే ఉంటారు. అయితే.. అమ్మాయిలు చర్మం, జుట్టు విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అదే మగవాళ్లకు ఉంటే టెన్షన్ ఒక్కటే.. బట్టతల.
అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!
జుట్టు రాలిపోతోంది అంటే చాలు.. మగవాళ్లు బట్టతల వచ్చేస్తుందన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వయసు, ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అనేక కారణాల్లో హెరిడిటీ, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ముఖ్యంగా అబ్బాయిలు హెయిర్ ఫాల్ సమస్య ఫేస్ చేస్తున్నారు.
కారణం ఏంటనేది అనవసరం. జుట్టు కోల్పోవడం మాత్రం మంచి సంకేతం కాదు. దీనివల్ల బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలుతున్న సంకేతాలు గుర్తించిన వెంటనే.. ఈ ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ని ఒక్కసారి ఫాలో అవడం వల్ల.. చిన్న వయసులోనే హెయిర్ సమస్యను నివారించవచ్చు.

వారానికి రెండుసార్లు ఆయిల్
అత్యంత ముఖ్యమైన టిప్.. వారానికి రెండుసార్లు జుట్టుకి ఆయిల్ పెట్టడం. దీనివల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. అంతేకాదు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల.. జుట్టుని రక్షణ కల్పించడంతో పాటు, పోషణ అందిస్తుంది.

ఆలివ్ ఆయిల్ ప్యాక్
రెండు టీస్పూన్ల తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాలు ఆరిన తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి వేస్తే అబ్బాయిల్లో జుట్టు రాలడం నివారించవచ్చు.

జీలకర్ర, ఆలివ్ ఆయిల్
ఒక టీస్పూన్ జీలకర్ర, అరకప్పు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. రెండింటినీ మిక్స్ చేసి.. తలకు పట్టించాలి. జుట్టుకి బాగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత రూమ్ టెంపరేచర్ నీటితో శుభ్రం చేసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది.

అలోవెరా జెల్
అలోవెరా జెల్ చర్మానికే కాదు.. జుట్టుకి చాలా మంది. అలోవెరా మాస్క్ ని జుట్టుకి పట్టిస్తే.. హెయిర్ కి కావాల్సిన విటమిన్ ఈ అంది.. స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. అలాగే హెయిర్ కి అవసరమైన మాయిశ్చరైజర్ ని ఇస్తుంది.

ఉల్లిపాయ పేస్ట్
స్కాల్ప్ కి క్లెన్సింగ్ లా పనిచేసి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది ఉల్లిపాయ పేస్ట్. ఆనియన్స్ ని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. కాటన్ బాల్ ని ముంచుతూ.. స్కాల్ప్ కి పట్టించాలి. 20 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ ఉపయోగించకూడదు. ఒకవేళ స్మెల్ బాగోదు అనుకుంటే మైల్డ్ షాంపూ వాడవచ్చు.

ఆవనూనె, హెన్నా పౌడర్
250 గ్రాముల ఆవనూనెలో గోరింట ఆకులు కలిపి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆయిల్ వడకట్టి.. జుట్టుకి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

జామ ఆకులు
హాట్ వాటర్ లో జామ ఆకులు వేసి.. కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు నల్లగా మారేవరకు మరిగించాలి. కాటన్ ఉపయోగించి.. దాన్ని స్కాల్ఫ్ కి పట్టించాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

ఉసిరి రసం
జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉసిరికాయ వండర్స్ చేస్తుంది. బట్టతల నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసంను, ఉసిరి జ్యూస్ లో కలిపి.. స్కాల్ప్ కి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

తేనె, పచ్చసొన
అబ్బాయిల్లో జుట్టు రాలడం తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీ.. తేనె, పచ్చసొన. రెండింటినీ.. సమానంగా తీసుకుని కలిపి.. స్కాల్ప్ కి 30 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. పచ్చసొన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications