For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నల్లటి కురులు సొంతం చేసుకోవాలంటే...8 నేచురల్ టిప్స్

  By Sindhu
  |

  నల్లని ఒత్తైన జుట్టు ఆడవారికి మరింతగా అందాన్ని చేకూరుస్తాయి. అందుకే తమ అందానికి ప్రతిరూపమైన నల్లని నిగనిగలాడే జుట్టుకోసం ఆశపడని స్త్రీలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని కొందరికి వెంట్రుకలు రాగి రంగులో నిర్జీవంగా ఉంటాయి. అలాంటి వారు నల్లని జుట్టు పొందడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. అందమైన, నల్లని కురుల సంపద కోసం ఆడవారి తాపత్రయం చాలా ఉంటుంది. ఎవరికైనా ఒతైన జుట్టు కావాలని కోరుకుంటారు. అయితే జుట్టు పట్ల సరైన జాగ్రత్తలు, సంరక్షణ కలిగి వుంటే కురులను కాపాడుకోవచ్చు. అందుకే మీరూ నల్లని కురులను సొంతం చేసుకోవాలనుకుంటే ఈ సలహాలు పాటించి చూడండి. నల్లగా నిగనిగలాడే అందమైన కురులు మీ సొంతమౌతాయి.

  కొంతమందికి జుట్టు చాలా త్వరగా నెరుస్తుంటుంది. అలాగే మరికొంతమంది జుట్టు గోధుమరంగులోకి మారుతుంటుంది. జుట్టుకు సరైన పోషణ అందకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే జుట్టు దెబ్బతినకుండా చూసుకోవచ్చు .

  మొలకెత్తిన గింజలు

  మొలకెత్తిన గింజలు

  మొలకెత్తిన గింజల్లో పోషకాలు అధికంగా లభిస్తాయి. ముఖ్యంగా పెసర మొలకలు జుట్టు ఆరోగ్యానికి బాగా పనికొస్తాయి. అందుకే ప్రతిరోజూ పెసర మొలకలు తినడం వల్ల జుట్టు త్వరగా నెరవకుండా చూసుకోవచ్చు.

  మెంతులు

  మెంతులు

  రాత్రిపూట కొన్ని మెంతుల్ని నానబెట్టి పొద్దున్నే పేస్టు చేసి జుట్టు కుదుళ్లకు, చివరలకు పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మృదువుగా కూడా అవుతుంది.

   నెయ్యి

  నెయ్యి

  జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు నెయ్యి రాసి కొద్దిసేపు మర్దనా చేయాలి. ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఈ విధంగా నెలకు రెండు సార్లు చేయడం వల్ల జుట్టు నెరవడం ఆగిపోతుంది. కుదుళ్లు బలంగా తయారై ఊడిపోకుండా ఉంటుంది.

  ఉల్లిరసం

  ఉల్లిరసం

  ఈ సమస్యకు ఉల్లిరసం మంచి పరిష్కారం. ఉల్లిరసాన్ని మాడుకి బాగా పట్టించాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగి, ఆ తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడంవల్ల నెరిసిన జుట్టు నెమ్మది నెమ్మదిగా నల్లబడుతుంది.

   ఆముదం:

  ఆముదం:

  ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ ను నివారిస్తాయి మరియు బట్టతల రాకుండా సహాయపడుతుంది . ఆముదం నూనెను తలకు పట్టించి మసాజ్ చేయాలి. దీన్ని వారింలో కనీసం రెండు సార్లు చేస్తే మంచిది

   మందార ఆకు

  మందార ఆకు

  మందార ఆకు మందార ఆకుల చిట్కా అందరికీ తెలసిందే. మందార ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకి పట్టించి, ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార ఆకులు వేడిని తగ్గించడంతో పాటు జుట్టు రంగును కాపాడుతాయి. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.

  ఉసిరికాయ

  ఉసిరికాయ

  మన జుట్టుకి ఉసిరికాయ ప్రభావం ఎంతో మంచిది అని, ఎన్నో తరాలనుంచి అందరికి తెలిసిన విషయమే.అయితే ఎండబెట్టిన ఉసిరి ముక్కలని నీటిలో నానబెట్టి, మరుసటి రోజు మీ జుట్టుకి రాసుకుని తలస్నానం చేస్తే,ఎంతో మంచిది. మీ జుట్టు నున్నగా, లేదా మృదువుగా అవ్వాలంటే, ఉసిరి పేస్ట్ ని కాని, లేదా ఉసిరి ఆయిల్ ని కాని తలకు రాసుకుని తలస్నానం చేస్తే ఎంతో మంచిది..ఉసిరికాయను ముక్కలుగా చేసి కొబ్బరి నూనెలో వేసి బాగా మరగనిచ్చి అనంతరం ఆ నూనెను వడకట్టి చల్లార్చి తలకి రాసుకోవాలి. ఉసిరిలోని గుణాలు జుట్టును నల్లబరచడంతో పాటు తెల్లబడకుండా నిరోధిస్తుంది.

  శికాయ్ మరియు ఆమ్లా:

  శికాయ్ మరియు ఆమ్లా:

  శికాకాయ్ మరియు ఆమ్లా రెండింటి కాంబినేషన్ ట్రెడిషినల్ హోం రెమెడీ. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ రెండింటి కాంబినేషన్ ఆయుర్వేద చిట్కాలను జుట్టుకు ఉపయోగిస్తున్నారు . ఇది ఒక బెస్ట్ హేర్బల్ ప్రొడకట్స్ మరియు మరియు నేచురల్ షాంపు . గ్రేహెయిర్ నివారించడానికి ఇది ఒక ఫర్ఫెక్ట్ కాంబినేషన్.

   కొబ్బరి నూనె

  కొబ్బరి నూనె

  కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకులు వేసి అవి నల్లగా అయ్యేవరకు మరిగించాలి. నూనె చల్లారాక తలకు రాసుకోవాలి. దీనివల్ల కూడా జుట్టుకు నలుపు రంగుకి వస్తుంది.

  English summary

  9 Natural tips for thick black hair care

  Natural hair care tips and secrets for Black hair . Everybody wants to get good and healthy hair. More and more people are resorting to remedies for all such problems. In Ayurveda, you have a number of simple steps to make your hair beautiful, healthy and strong.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more