For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు రెండింతలు పొడవుగా, స్టాంగ్ గా పెరగడానికి ఆయుర్వేదిక్ హెర్బ్స్ ..!

|

ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే కొన్ని ఆయుర్వేదిక్ హెర్బ్స్ జుట్టును రెండింతలు పొడవుగా...స్ట్రాంగ్ గా పెరిగేందుకు సహాయపడుతాయన్న విషయం మీకు తెలుసా? అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ జుట్టును ఆరోగ్యాంగా పొడవు పెరిగేలా హెర్బ్స్ ఉపయోగపడుతాయంటే ఆశ్చర్యం కలగాల్సిందే !

తలలో దాదాపు 3,000,000 వెంట్రుకలుంటాయి, వీటిలో ప్రతి ఒక్క వెంట్రుక పెరగడానికి కృషి చేస్తుంది. వెంట్రుకలు ఎప్పుడైతే విశ్రాంతి స్థితిలో ఉంటాయో, అప్పుడు జుట్టు వదులవ్వడం, అలాగే జుట్టు రాలడం జరుగుతుంది.

జుట్టు రెస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాదాపు 40 to 80 వెంట్రుకలను కోల్పోతాము. ఇలా కోల్పోవడం నార్మల్ స్టేజ్ అని చెప్పవచ్చు, అయితే ఈ నెంబర్ దాటితే అది సీరియస్ గా పరిగణించాలి.

ఇటువంటి హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి ఆయుర్వేదిక్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి జుట్టు పెరిగే క్రమాన్ని క్రమబద్దీకరించలేవు కానీ, హెయిర్ ఫాలిసెల్స్ కు కావల్సినంత బలాన్ని చేకూర్చి, హెయిర్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా సహాయపడుతాయి .

అయితే, జుట్టు రాలడానికి కారణాలేంటి? జెనటిక్స్, కాలుష్యం, హార్మోనులు అసమ తుల్యత, స్ట్రెస్ ఇవన్నీ కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. అయితే, ఇవన్నీఒక్కొక్కటే ..పూర్తిగా జుట్టు రాలడానికి కారణం కావు. కొన్ని సందర్బాల్లో రెండు మూడు కారణాల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలడానికి కారణమవుతాయి .

జుట్టు రాలడం ప్రారంభమైన వెంటనే క్రాష్ డైట్ ను నివారించండి. రెగ్యురల్ డైట్ లో విటమిన్స్ మరియు ఫైబర్, మినిరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎండలో తిరగడం తగ్గించాలి. బయట వెళ్లేటప్పుడు తలకు స్కార్ఫ్ కట్టుకోవాలి. ఎక్కువగా నీళ్ళు తాగాలి. జీవనశైలిని సింపుల్ గా మార్చుకోవాలి. జుట్టు పొడవుగా స్ట్రాంగ్ గా పెరగడానికి కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ...

బ్రింగ రాజ్

బ్రింగ రాజ్

బ్రింగ రాజ్ ను ఓరల్ గా తీసుకోవచ్చు లేదా తలకు అప్లై చేయవచ్చు. ఈ హెర్బ్ లో యాంటీఆక్సిడెంట్స్, మినిరల్స్, మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి బట్టతలను నివారిస్తాయి. తెల్ల జుట్టును నివారిస్తాయి.

ఎలా పనిచేస్తుంది :

ఒక టేబుల్ స్పూన్ బ్రింగ్ రాజ్ ఆయిల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేసి, రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం షాంపుతో తలస్నానం చేయాలి.

ఆమ్లా:

ఆమ్లా:

ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఆమ్లా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది, దాంతో జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.

ఎలా పనిచేస్తుంది:

రెండు టేబుల్ స్పూన్ల ఆమ్లా ఆయిల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ నూనెను తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత షాంపుతో స్నానం చేయాలి.

వేప:

వేప:

వేప ఆకులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇది తలలో మురికి, ఇతర ఇన్ఫెక్షన్స్ , చుండ్రును నివారిస్తాయి. తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి . హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి.

ఎలా పనిచేస్తుంది :

రెగ్యులర్ గా తలకు పెట్టుకునే నూనెలో 10 చుక్కల వేపనూనెను మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత , నార్మల్ షాంపుతో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో విటమిన్స్, మినిరల్స్ , యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతాయి . హెయిర్ రూట్ నుండి స్ట్రాంగ్ గా మార్చి, జుట్టుకు మంచి షైనింగ్ ను వ్యాల్యూమ్ ను అందిస్తాయి .

ఎలా పనిచేస్తుంది :

నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీరు వంపేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. కొన్ని చుక్కల బాదం ఆయిల్ ను మిక్స్ చేసి పేస్ట్ లా చేసి తలకు అప్లై చేయాలి. జుట్టు పొడవును అప్లై చేయవచ్చు. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో సాలిసిలిక్ యాసిడ్, ఎంజైమ్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. అలోవెర తలలో సెబమ్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. తలలో మలినాలను తొలగిస్తుంది, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక బౌల్లో అలోవెర జెల్ తీసుకుని, తలకు అప్లై చేసి అరగంట తర్వాత తిరిగి అప్లై చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు :

కరివేపాకు :

కరివేపాకు ప్రీమెచ్చుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది, జుట్టు రాలడం క్రమబద్దం చేస్తుంది. హెయిర్ రూట్స్ కు పోషణను అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి , ఆలివ్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వేసి మరిగించాలి. తర్వాత క్రిందికి దింపి, 24 గంటలు అలాగే ఉంచాలి. తర్వాత దీన్ని తలకు రెగ్యులర్ గా అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజ్మెర్రీ ఆయిల్ :

రోజ్మెర్రీ ఆయిల్ :

రోజ్మెర్రీ ఆయిల్ తలను డిటాక్సిఫై చేస్తుంది. హెయిర్ పిగ్మెంటేషన్ రిస్టోర్ చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఎలా పనిచేస్తుంది :

ఒక కప్పు టీలో రోజ్మెర్రీ వాటర్ మిక్స్ చేయాలి. చల్లారిన తర్వాత తలస్నానం చేసి, చివరగా ఈ నీటిని తలారా పోసుకోవాలి. 10 నిముషాలు అలాగే ఉండనిచ్చి తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ ఆయుర్వేదిక్ హెర్బ్ ను వారంలో ఒకసారి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

బర్డక్ రూట్ :

బర్డక్ రూట్ :

బర్డక్ రూట్ లో ఫైటోస్టెరోల్స్ ఉంటాయి, ఇవి హెయిర్ రూట్స్ కు రక్తప్రసరణ అందించి, జుట్టు రాలకుండా క్రమబద్దం చేస్తుంది. జుట్టు ఒత్తుగా మరియు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది

ఎలా పనిచేస్తుంది:

ఒక టేబుల్ స్పూన్ బర్డక్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ పెరుగు మిక్స్ చేయాలి. తలను తడి చేసిన ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి.. అరగంట అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేసుకోవాలి

మందారం

మందారం

మందారంలో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇవి జుట్టుకు బలాన్ని, పోషణను అందిస్తాయి. హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తాయి.

ఎలా పనిచేస్తుంది:

ఒక కప్పు కొబ్బరి నూనెలో 12 మందారం ఆకులు కట్ చేసి వేసి 15 నిముసాలు బాయిల్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, 24 గంటలు అలాగే ఉంచి, తర్వాత వడగట్టి, తలకు రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

తులసి

తులసి

మెగ్నీషియం మరియు మినిరల్స్ తులసి ఎక్కువ, ఇవి హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తుంది. హెయిర్ బ్రేక్ కాకుండా నివారిస్తుంది.

ఎలా పనిచేస్తుంది :

ఒక కప్పు నీరు వేడి, చేసి అందులో తులసి ఆకులు వేసి,ఒక టీస్పూన్ తేనె మరో టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి. 15 నిముషాలు సిమ్ లో పెటి మరిగించాలి. తర్వాత చల్లార్చి, తలస్నానం పూర్తైన తర్వాత చివరగా తలారా పోసుకోవాలి. ఈ హెర్బల్ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

పుదీనా

పుదీనా

పుదీనాలో మెంథోల్ అధికంగా ఉండటం వల్ల ఇది తలలో మలినాలను తొలగిస్తుంది, హెయిర్ ఫాలిసెల్స్ ను క్రమబద్దం చేస్తుంది. హెయిర్ కు పోషణను అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది:

రెగ్యులర్ హెయిర్ ఆయిల్లో 10 చుక్కల పెప్పర్ మింట్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఈ ఆయుర్వేదిక్ రెమెడీ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది.

English summary

Ayurvedic Herbs That Can Make Your Hair Twice As Longer & Stronger

Did you know there are Ayurvedic herbs that can literally transform your hair, making it twice as thicker and longer? With no hitches! There are approximately 3,000,000 hair strands on your scalp, and each has its own growth and resting phase.
Story first published: Wednesday, September 21, 2016, 18:19 [IST]
Desktop Bottom Promotion