For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మృదువైన, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం.

|

ఆముదం, ఆముదం నూనె గురించి మీకు తెలుసా? ఈ కాలంలో చర్మంతోపాటూ జుట్టుకు సంబంధించిన రకరకాల సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటివన్నీ దూరమై మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం. భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. క్యాస్టోర్ ఆయిల్ (ఆముదం)ఒక నేచురల్ ప్లాంట్ ఆయిల్ ఆముదం మొక్క నుండి వచ్చిన విత్తనాల నుండి నూనెను తయారుచేస్తారు. ఇందులో రిసినోలిస్ యాసిడ్ సంవృద్ధిగా ఉంటుంది, ఇది యాంటీఇన్ఫ్లమేటరి, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఒక అందమైన శరీరానికి దోహదం చేస్తుంది.

పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!
ఆముదం నూనెను ప్రాచీన కాలం నుండి వివిధ రకాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ నూనెలో ప్రయోజనాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ బ్యాక్టారియల్, యాంటా ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆముదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. అందేకు ఈ నూనె అన్ని రకాల జుట్టు సమస్యలను గ్రేట్ గా నివారిస్తుంది. చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చివరల్లు చిట్లడం మరియు బట్టతల ను కూడా నివారించడంలో ఆముదం గ్రేట్ గా సహాయపడుతుంది. ఆముదం నూనెలో ఉండే ప్రోటీన్స్, మరియు మినిరల్స్ హెల్తీ హెయిర్ పొందడానికి బూస్ట్ లా పనిచేస్తుంది.

అనేక జుట్టు సమస్యలకు శాశ్వత పరిష్కారం మన ఇంటి వైద్యం

ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇది తలలో పిహెచ్ లెవల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే తలలో నేచురల్ ఆయిల్స్ కోల్పోకుండా సహాయపడుతుంది. డల్ మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఆయిల్. ఆముదం నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుకు నేచురల్ షైనింగ్ మరియు స్ట్రాంగ్ నెస్ ను అందిస్తుంది. అందువల్లే, ఆముదం నూనె అనేక జుట్టు సమస్యలను ఎదుర్కోగలుగుతుంది. ఇలాంటి ఆముదంను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల పొందే అనేక ప్రయోజనాలను లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింద తెలపడం జరిగింది...

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఆముదం నూనెలో రిసినోలిక్ యాసిడ్ మరియు ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది . దాంతో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టుకు పోషణను మరియు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయడపుతుంది. అందుకు కొబ్బరి నూనె మరియు ఆముదం నూనెను సమయంగా తీసుకొని, గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

ఆముదంనూనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఆముదం నూనెను రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల తలలో దురద, బట్టతలను నివారిస్తుంది. చుండ్రు నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ...

జుట్టు చివర్లు చిట్లకుండా చేస్తుంది:

జుట్టు చివర్లు చిట్లకుండా చేస్తుంది:

ఆముదం నూనె జుట్టు చిట్లకుండా చేస్తుంది. తలకు ఆముదం నూనెను అప్లై చేసినప్పుడు ఇది హెయిర్ క్యూటికల్స్ వరకూ చేరి, తలకు డీప్ కండీషర్ గా మరియు జుట్టును సాఫ్ట్ అండ్ షైనీగా మార్చుతుంది. తలకు ఈ నూనె అప్లై చేయడానికి ముందు గోరువెచ్చగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 కండీషనర్:

కండీషనర్:

ఆముదం నూనె జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది. ఈ నూనెలో ఉండే పుష్కలమైన లక్షణాలు జుట్టుకు నేచురల్ కండీషనర్ అందిస్తుంది. మరియు హెయిర్ షైనీగా అండ్ హెల్తీగా మార్చతుంది.

జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది:

జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది:

ఆముదం నూనె జుట్టు రాలడాన్ని అరికట్టి మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో బెస్ట్ హోం రెమెడీ . ఉత్తమ ఫలితాలను పొందడానికి వారానికొకసారి ఆముదంను తలకు పట్టించాలి.జుట్టు బాగా రాలుతున్నప్పుడు ఇలా చేయొచ్చు... నాలుగు చెంచాల చొప్పున కొబ్బరినూనె, ఆముదం సమపాళ్లలో తీసుకుని అందులో నాలుగు చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్ల సొన కలిపి... తలకు పూతలా వేసుకోవాలి. ఓ గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే....జుట్టు రాలకుండా ఉంటుంది.

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది:

జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది:

ఆముదం నూనెలో ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 9 ఫ్యాటీయాసిడ్స్ ఉండటం వల్ల, ఈ రెండా హెల్త్ హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించడం వల్ల ఆముదం నూనె కొత్తగా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు, బ్యూటీఫుల్ గా మరియు షైనీగా ఉంటుంది.

 జుట్టును నల్లగా మార్చుతుంది:

జుట్టును నల్లగా మార్చుతుంది:

కొందరి జుట్టు నలుపు దనం తగ్గి రాగి రంగులో కనిపిస్తుంది. అప్పుడు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకల పొడి వేసి మరిగించాలి. కొబ్బరి నూనె సగం అయ్యాక దానికి రెండు స్పూన్ల ఆముదం కలిపి తలకు రాసుకొని మరుసటి ఉదయం తల స్నానం చేయాలి. ఇలా చేయటం వలన జుట్టు క్రమంగా నలుపు రంగులోకి మారుతుంది.

హెయిర్ స్ట్రెక్చర్:

హెయిర్ స్ట్రెక్చర్:

ఆముదం నూనెను రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం చేయడం వల్ల హెయిర్ స్ట్రక్చర్ చాలా గ్రేట్ గా ఉంటుంది . ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ ను అందివ్వడంతో పాటు, జుట్టు ఆకారం అందంగా మారుతుంది.

English summary

Beat All Hair Problems With Castor Oil!

Castor oil is one of the oldest ingredients that was used in the beauty regimen since times immemorial. It has antibacterial and anti-inflammatory properties that can tackle most of the hair problems.
Story first published: Monday, February 1, 2016, 13:17 [IST]
Desktop Bottom Promotion