For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్ తగ్గించే పొటాటో జ్యూస్ రెమెడీస్

By Staff
|

ఉల్లిపాయ జ్యూస్ జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది . ఎలాంటి సందేహం లేకుండా ఆనియన్ జ్యూస్ ను జుట్టు పట్టించవచ్చు . ఆనియన్ జ్యూస్ లాగే పొటాటో జ్యూస్ కూడా మరింత ఎఫెక్టివ్ గా బెనిఫిషయల్ గా జుట్టు మొదళ్ళను స్ట్రాంగ్ గా పెరగడంలో గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడి చేస్తున్నాయి .

ఎందుకంటే పొటాటో జ్యూస్ లో స్టార్చ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది తలలో అదనపు నూనెను లేదా జిడ్డును నివారిస్తుంది. అంతే కాదు పొటాటో జ్యూస్ లో బ్లీచింగ్ ప్రొపర్టీస్ అధికంగా ఉండటం వల్ల , ఈ జ్యూస్ ను డైగా వేసుకోడం చాలా మంచిదని, ఇది కేశాలకు నేచులర్ కలర్ ను అందిస్తుందని బ్యూటీ నిపుణులు తెలుపుతున్నారు .

అంతే కాదు, కేశ సంరక్షణలో గ్రేట్ గా సహాయపడటంతో పాటు చౌకైనది మరియు సులభంగా మనందరికీ అందుబాటులో ఉండే బ్యూటీ ఇన్ గ్రీడియంట్. దీన్ని నెలలో మూడు సార్లు ఉపయోగించడం మంచిది. పచ్చి బంగాళదుంప రసాన్ని కేశాలకు పట్టించడం వల్ల, జుట్టు మెదళ్ళు బలోపేతం అవుతాయి మరియు జుట్టు యొక్క వాల్యూమ్ పెరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? బంగాళదుంప జ్యూస్ తలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం...

జుట్టు రాలడం నివారించే పొటాటో జ్యూస్:

జుట్టు రాలడం నివారించే పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్ తో జుట్టు రాలడం నివారించుకోవచ్చు.50 ml పొటాటో జ్యూస్ లో 10ml కొబ్బరి నూనె మరియు 5ml ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి . ఈ మొత్తం మిశ్రమాన్ని తలకు పట్టించి, తర్వాత తలకు హాట్ టవల్ చుట్టాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

తెల్ల జుట్టును నివారించే పొటాటో జ్యూస్:

తెల్ల జుట్టును నివారించే పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్ తెల్ల జుట్టును నివారిస్తుందన్న విషయం మీకు తెలుసా ? తలస్నానానికి పొటాటో జ్యూస్ ను ఉపయోగించడం కంటే బంగాలదుంప జ్యూస్ ను ఉపయోగించుకోవడం మంచిది . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే 3 వారాల్లో మంచి ఫలితం చూడవచ్చు . ఈ హోం రెమెడీస్ జుట్టు కలర్ ను మార్చుతుంది.

పొడి జుట్టును నివారిస్తుంది:

పొడి జుట్టును నివారిస్తుంది:

పొటాటో జ్యూస్ తో డ్రై హెయిర్ నివారించుకోవచ్చు . 50ml పొటాటో .జ్యూస్ ను 9ml అలోవెర జెల్ ను మిక్స్ చేసి తర్వాత జుట్టుకు అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టులో జిడ్డును నివారిస్తుంది:

జుట్టులో జిడ్డును నివారిస్తుంది:

తలను మరియు కేశాలు జిడ్డుగా అనిపిస్తే పొటాటో జ్యూస్ లో కొద్దిగా రైస్ వాటర్ మిక్స్ చేసి తలకు పట్టించి తలస్నానం చేయడం వల్ల తలలో జిడ్డు తొలగిపోతుంది.

జుట్టు పెరుగుదలకు పొటాటో జ్యూస్:

జుట్టు పెరుగుదలకు పొటాటో జ్యూస్:

జుట్టు పల్చగా ఉందా..మరి అయితే ఈ సమస్యకు ఒక బెస్ట్ సొల్యూషన్ పొటాటో జ్యూస్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఈ పొటాటో జ్యూస్ ను ఆయిల్ మాదిరే తలకు అప్లై చేసి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . పొటాటో జ్యూస్ లో ఉండే లక్షనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఈ చిట్కాను నెలలో రెండు సార్లు ప్రయత్నించి ఫలితం చూడండి.

పొటాటో జ్యూస్ హెయిర్ డై:

పొటాటో జ్యూస్ హెయిర్ డై:

మీ జుట్టుకు డై లేదా బ్లీచ్ చేయాలంటే, బంగాళదుంప ఉత్తమమైనది . అరకప్పు పొటాటో చ్యూసులో రెండు టేబుల్ స్పూన్ల టమోటో జ్యూస్ మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఈ జ్యూస్ ను హెయిర్ ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

హెయిర్ జెల్ గా పొటాటో జ్యూస్ . హెయిర్ జెల్స్ ఉపయోగిస్తుంటే, ఈ సింపుల్ ట్రిక్ ను ఉపయోగించండి . ఒక టేబుల్ స్పూన్ పొటాటో జ్యూస్ లో, రెండు టేబుల్ స్పూన్ల అలోవెర జెల్ ను మిక్స్ చేయాలి. ఇది జుట్టుకు నేచురల్ లుక్ ను అందిస్తుంది.

English summary

Beat All Hair Problems With Potato Juice

Maintaining healthy hair has become a tough task these days. It takes a lot of our time and money too, in case we opt for modern methods to manage hair.
Desktop Bottom Promotion