For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పొడవుగా పెరగడానికి బాదంఆయిల్ తో పాటు, బాదం మిల్క్ చేసే మ్యాజిక్

జుట్టు సమస్యలను నివారించడంలో బాదం పాలు గొప్పగా సహాయపడుతాయి. అయితే వీటిని జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం ఏవిధంగా ఉపయోగించాలన్న విషయం తెలుసుకోవాలి. జుట్టు సమస్యల నివారణకు బాదం మిల్క్ ను ఉపయోగించే మ

|

డ్రై ఫ్రూట్స్ లేదా ఎండుఫలాలు అనగానే మొదట గుర్గొచ్చేది బాదంలు . బాదంలో న్యూట్రీషియన్స్ అత్యధికంగా ఉన్నాయి. కాబట్టి, ఇవి శరీర ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు కాల్సిన పోషకాలను అందించి. సమస్యలను తీర్చుతుంది. బాదంలు ఇటు ఆరోగ్యానికి అటు చర్మ సంరక్షణకు మాత్రమే కాదు, జుట్టు సంరక్షణకు కూడా గ్రేట్ గా సహాయపడుతుందని బ్యూటిషియన్లు చెబుతున్నారు.?

బాదంలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు చర్మ సంరక్షణకు , జుట్టు సంరక్షణకు అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను అందివ్వడంలో బాదంలు గ్రేట్ అని చెప్పొచ్చు.

రోజుకు మూడు నుండి 5 బాదం పప్పులను తింటే చాలు చర్మం, జుట్టుకు కావల్సినన్ని ప్రయోజనాలను పొందుతారు. అయితే అంతర్గతంగానే కాకుండి బహిర్గతంగా కూడా బాదంలను ఉపయోగించుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలను పొందవచ్చు. బాదంను వివిధ రూపాల్లో నేచురల్ రెమెడీస్, హోం రెమెడీస్ తో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. అయితే బెటర్ రిజల్ట్ పొందడానికి కొద్దిగా ఓపిక, శ్రమ కూడా ఉంది.

జుట్టు సమస్యలను నివారించడంలో బాదం పాలు గొప్పగా సహాయపడుతాయి. అయితే వీటిని జుట్టు సమస్యలను నివారించుకోవడం కోసం ఏవిధంగా ఉపయోగించాలన్న విషయం తెలుసుకోవాలి. జుట్టు సమస్యల నివారణకు బాదం మిల్క్ ను ఉపయోగించే మార్గాలు...

హెయిర్ కండీషనర్ గా :

హెయిర్ కండీషనర్ గా :

బాదం ఆయిల్లో కొద్దిగా బాదం ఆయిల్లో మిక్స్ చేసి, తలకు కండీషనర్ గా అప్లై చేయవచ్చు. దీన్ని తలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని, అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సాప్ట్ గా , మాయిశ్చరైజింగ్ గా మార్చుతుంది.

తలలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

తలలో ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

బాదం మిల్క్ ను చేతి వేళ్ళతో తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది తలలో ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ముఖ్యంగా పొల్యూషన్, ఇతర కారణాల వల్ల వచ్చే జుట్టు సమస్యలను నివారిస్తుంది.

జుట్టు పెరుగుదలకు :

జుట్టు పెరుగుదలకు :

మందారం పువ్వులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా బాదం మిల్క్, ఆముదం నూనె మిక్స్ చేయాలి. దీన్ని జుట్టు అప్లై చేయాలి. ఈ పదార్థాలన్ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది.

బలహీనంగా ఉండే జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది:

బలహీనంగా ఉండే జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది:

బాదంలో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్స్ జుట్టుకు అవసరమయ్యే బలాన్ని అందిస్తాయి . ఈ న్యూట్రీషియన్స్ జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతాయి .

తెల్ల జుట్టును నివారిస్తాయి:

తెల్ల జుట్టును నివారిస్తాయి:

బాదం మిల్క్ ను హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తో కలిపినప్పుడు తెల్ల జుట్టు నివారించబడుతుంది. ఇది డీప్ కండీషనర్ గా పనిచేస్తుంది. బాదం మిల్క్ వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది.

జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది.

కొన్ని చుక్కల బాదం ఆయిల్లో , ఒక టీస్పూన్ బాదం మిల్క్ జోడిస్తే తలలో చిక్కు ఉండదు. . బాదం మిల్క్ హెయిర్ మాస్క్ వల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందుతారు.

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

బాదం ఆయిల్, ల్యావెండర్ ఆయిల్ మరియు బాదం మిల్క్ ను సమంగా తీసుకుని, మిక్స్ చేసి జుట్టుకు పట్టించి మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం నివారించబడుతుంది.

English summary

Benefits Of Almond Milk For Your Hair

Almonds are really nutritious and help in a number of skin, hair and body problems. Did you know of just how many ways almonds can help your hair? Do you know about the benefits of almond milk for hair?
Story first published: Friday, November 25, 2016, 14:27 [IST]
Desktop Bottom Promotion