For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సంరక్షణకు స్ట్రాబెర్రీస్ ఎలా ఉపయోగపడతాయి ?

By Super
|

స్ట్రాబెర్రీస్ చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు సంరక్షణకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. స్ట్రాబెర్రీస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్టును తేమగా ఉంచుతుంది. హెయిర్ ఫోలిసెల్స్ కు రక్షణ కల్పిస్తుంది.

స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి జుట్టుకు తగిన పోషణను అందివ్వడం మాత్రమే కాదు, తలలో ఎక్కువ నూనె శ్రవించకుండా, జిడ్డుగా మారకుండా కాపాడుతుంది.

స్ట్రాబెర్రీస్ లో ఎనాల్జిక్ యాసిడ్, మెగ్నీషియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్ వంటివి అధికంగా ఉండటం వల్ల ఇవి జుట్టు ఆరోగ్యానికి అత్యంత అసవరమైనవిగా సూచిస్తున్నారు.

జుట్టు సంరక్షణలో స్ట్రాబెర్రీస్ వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వారానికొకసారి స్ట్రాబెర్రీ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో , సిల్కీగా మారుతుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్స్ హెయిర్ ఫాల్ ను నివారిస్తాయి. జుట్టు పల్చబడకుండా చేస్తాయి. అలాగే చుండ్రును నివారిస్తాయి.

అదేవిధంగా స్ట్రాబెర్రీస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల జుట్టు సంరక్షణ విషయంలో మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా జుట్టుకు స్ట్రాబెర్రీ అందించే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

స్ట్రాబెర్రీలో జుట్టు రాలడం నివారించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలో ఉండే విటమిన్ సి , ఐరన్ గ్రహించేలా ప్రోత్సహించడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్స్ లోపం వల్ల జుట్టు చిట్లడం, హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి, వ్యాధినిరోధకశక్తి లోపించడం వల్ల ఏర్పడే చుండ్రును నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ ను మెత్తగా చేసి, ఈ పేస్ట్ కు గుడ్డు మిక్స్ చేయాలి. అందులోనే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి, జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

ఫంగస్ పెరగకుండా నివారిస్తుంది :

ఫంగస్ పెరగకుండా నివారిస్తుంది :

స్ట్రాబెర్రీస్ లో ఫంగల్ ఏర్పడకుండా నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల తలలో ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. స్ట్రాబ్రెర్రీ పేస్ట్ లోకొద్దిగా తేనె, కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి తలకు పట్టించి కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చుండ్రుని నివారిస్తుంది.

షైనీ హెయిర్:

షైనీ హెయిర్:

స్ట్రాబెర్రీస్ వల్ల జుట్టు మెరుస్తూ కనబడుతుంది. స్ట్రాబెర్రీ పేస్ట్ ను మెయోనైజ్ తో కలపాలి . ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి . కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి.

జుట్టు పల్చబడకుండా నివారిస్తుంది:

జుట్టు పల్చబడకుండా నివారిస్తుంది:

స్ట్రాబెర్రీ పేస్ట్ లో ఉండే ఎనాల్జిక్ యాసిడ్ జుట్టు పల్చబడకుండా నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ జుట్టు పల్చబడకుండా, జుట్టు రాలకుండా నివారిస్తుంది.

ఎక్సలెంట్ హెయిర్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది:

ఎక్సలెంట్ హెయిర్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది:

స్ట్రాబెర్రీస్ జుట్టుకు ఒక మంచి మాయిశ్చరైజరచ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ వల్ల తలలో ఫోలిసెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. దాంతో ఒక అద్భుతమైన హెయిర్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

English summary

Benefits Of Strawberries For Hair Care

Benefits Of Strawberries For Hair Care. Strawberries are not only good for the skin, but they also work wonders for the hair.
Desktop Bottom Promotion