Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
చుండ్రు, హెయిర్ ఫాల్, ఇతర సమస్యలను నివారించే పసుపు...
పసుపుతో ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు. పసుపుతో నీరుకలిపి మెత్తగా పేస్ట్ లా చేసి క్రమంగాలోనికి తీసుకుంటే శరీరానికి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేధం వెల్లడిస్తోంది.
పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్థాలు లేక మలినపధార్థాలు కలిసి ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావాలిసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంటలాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది.
సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుపుకు ఎంతో ఋణపడి ఉన్నాయి. మెత్తగా పేస్టులా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమవుతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతరప్రయోజనాలకు ఎంతాగానో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యంతో పాటు కేశ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. పసుపును కేశాలకు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చో ఈ క్రింద తెలపబడినది..

చుండ్రు నివారిస్తుంది: ప్రస్తుత రోజుల్లో చుండ్రు ఒక ప్రధాన సమస్య. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు తలలోని చుండ్రు, దురద, మొటిమలు, వంటి సమస్యలను తగ్గిస్తుంది. మరియు ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాదు తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
జుట్టు రాలడం నివారిస్తుంది: జుట్టు సంరక్షణలో పసుపును ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం నివారిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు కండీషనర్ గా పనిచేస్తుంది. పసుపు మరియు తేనె సమంగా తీసుకొని మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టుకు మంచి రంగును అందిస్తుంది: పసుపు జుట్టుకు హెయిర్ కలరింగ్ ప్రొసెస్ ను అందిస్తుంది. పసుపును హెన్నాతో మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మీరు మంచి ఫలితాలను గమనించవచ్చు. పసుపు హెర్బల్ నేచర్ కలిగి ఉండటం వల్ల ఇది జుట్టుకు ఎలాంటి హాని కలిగించదు మరియు మంచి ఫలితాలను చూపుతుంది.

కేశ సంరక్షణలో వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది: జుట్టుకు సంబంధించినంత వరకూ వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఎగ్జిమా మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. జుట్టు పల్చబడటం తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు దురద కూడా తగ్గుతుంది . అందుకు మీరు చేయాల్సిందే తలకు పసుపు పేస్ట్ ను మసాజ్ చేయడమే . అరగంట అలాగే వదిలి తర్వాత తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications
