For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాండ్రఫ్ కు చెక్ పెట్టే వెనిగర్ అండ్ లెమన్ హెయిర్ మాస్క్

By Super
|

జుట్టు సమస్యల్లో సాధారణ సమస్యల చుండ్రు సమస్య. అందమైన...ఒత్తైన జుట్టును , ప్రకాశించే జుట్టు కలిగి ఉండటం వల్ల మరింత ఆకర్షనీయంగా కనబడుతారు, అదే డ్యామేజ్ అయిన, పొడి జుట్టు కలిగి ఉన్నట్లైతేమీ మీ అందం మరింత నిర్జవంగా మరియు డల్ గా కనబడుతారు.

జుట్టు యొక్క అందాన్ని బట్టే, మన శారీరక అందం ఆధారపడి ఉంటుంది. మరి అలాంటప్పుడు అందమైన జుట్టును పొందడం ఎలా?

వివిధ రకాల హెయిర్ స్టైల్ ప్రొడక్ట్స్, హెయిర్ స్ప్రేలు, లేదా ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అందమైన జుట్టు పాడు అవ్వడం మాత్రమే కాదు, ఉన్న అందాన్ని కూడాపాడుచేస్తుంది.

Apple Cider Vinegar And Lemon Mask

ఇలాంటి డ్యామేజబుల్ హెయిర్ పెరుగుదలకు కారణం తీసుకొనే ఆహారం, జీవనశైలి, మరియు ఇతర బహిర్గత లక్షణాలు ఆధారపడి ఉంటాయి . కొన్ని బహిర్గత కారణాల వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇవి మన జుట్టును రఫ్ గా , నిర్జీవంగా మరియు చుండ్రుకు కారణం అవుతుంది . ఇది జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది.

ఇలాంటి డ్యామేజ్ అయిన జుట్టును బాగు చేసుకోవడానికి ఇక ముందు అలా జరగకుండా ఉండాలంటే, రెండు నేచురల్ పదార్థాలు గొప్పగా ఉపయోగపడుతాయి. ఇవి జుట్టును సాప్ట్ గా మరియు చుండ్రులేకుండా మార్చుతాయి.

అందుకు మీరు చేయాల్సిందల్ల నిమ్మరసం మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవాలి . ఈ రెండింటి కాంబినేషన్ లో అద్భుతమైన హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవచ్చు. ఈ చౌకైన హెయిర్ మాస్క్ ను తయారుచేసుకోవడం చాలా సులభం మరియు పదార్థాలు కూడా మనకు ఎక్కువ అందుబాటులో ఉంటాయి.

Apple Cider Vinegar And Lemon Mask

ఈ రెండు పదార్థాలు వివిధ రకాల న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి , ఇవి హెయిర్ రిలేటెడ్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .

ఆపిల్ సైడర్ వెనిగర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హెయిర్ క్యూటికల్స్ ను బలోపేతం చేస్తుంది మరియు సాప్ట్ గా మార్చుతుంది.

ముఖ్యంగా, ఆపిల్ సైడర్ వెనిగర్ ను నిమ్మరసంతో మిక్స్ చేసి, హెయిర్ మాస్క్ గా వేసుకోవడం వల్ల ముందు ముందు జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారించడంలో చాలా సులభమైన పరిష్కార మార్గం.

ముఖ్యంగా ఈ హెయిర్ మాస్క్ ఆయిల్ హెయిర్ ఉన్నవారికి గ్రేట్ గా పనిచేస్తుంది. అయితే ఈ హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేయాలి, ఉపయోగించే పద్దతి ఏంటో తెలుసుకుందాం...

Apple Cider Vinegar And Lemon Mask

కావల్సినవి:
1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్

1 నిమ్మకాయ

తయారుచేసే పద్దతి:
నిమ్మకాయ మొత్తాన్ని తురుముకోవాలి. లేదా రసాన్ని పక్కకు పిండుకోవాలి.

తర్వాత నిమ్మరసంలో 1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేయాలి.

ఉపయోగించే పద్దతి:
ఈ హెయిర్ మాస్క్ ను జుట్టుకు నేరుగా మాస్క్ వేసుకోవాలి. ముఖ్యంగా బట్టతల ఉన్న ప్రదేశంలో ఈ హెయిర్ మాస్క్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 25నిముషాల తర్వాత మంచి నీటితో తలస్నానం చేసుకోవాలి.

సూచన: ఈ హెయిర్ మాస్క్ డ్రై హెయిర్ వారికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, అందువల్ల , ఇది ఆయిల్ హెయిర్ కు ఎక్కువగా సూట్ అవుతుంది.

Story first published: Monday, May 23, 2016, 9:52 [IST]
Desktop Bottom Promotion