For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతల సమస్యకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్..!!

బట్టతల సమస్యకు చెక్ పెట్టే పర్ఫెక్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్..!!

|

అద్దంలో చూసుకున్నప్పుడల్లా జుట్టు లేకుండా ఏర్పడిన ప్యాచ్ లు చూసి దిగులుపడుతున్నారా ? ఒకవేళ మీరు ఇలాంటి ఫీలింగ్ కలిగి ఉంటే.. చింతించకండి. మీరొక్కరే కాదు.. చాలామంది ఇలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారు. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ.. ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారు.

ఇలాంటి జుట్టు సమస్యను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగని.. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రీట్మెంట్ కి వెళ్లనక్కరలేదు. సింపుల్ గా.. మీ చేతులతో పర్ఫెక్ట్ హోం రెమిడీస్ ట్రై చేసే అవకాశం వచ్చింది. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. ఖచ్చితంగా జుట్టు రావడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

baldness

బట్టతల ఏర్పడటానికి జెనెటిక్స్, హార్మోన్స్, బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్, అన్ హెల్తీ డైట్ వంటి రకరకాల కారణాలున్నాయి. కారణాలేవైనా.. బట్టతల మాత్రం మీ లుక్ పై తీవ్ర ప్రభావం చూపించి.. కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడానికి కొంతమంది కాస్మొటిక్ ట్రీట్మెంట్స్ కి వెళ్తారు. కానీ.. పూర్వకాలానికి చెందిన రెమిడీస్ ఉపయోగిస్తే.. చక్కటి ఫలితాలు పొందవచ్చు.

ఇంకెందుకు ఆలస్యం.. చాలా సింపుల్ గా, మీరే ఇంట్లో తయారు చేసుకునే అద్భుతమైన, ఫర్ఫెక్ట్ హోం రెమిడీస్ గురించి ఓ లుక్కేయండి..

MOST READ: తులసి సర్వరోగ నివారిణి MOST READ: తులసి సర్వరోగ నివారిణి

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

స్కాల్ప్ మొత్తానికి ఆలివ్ ఆయిల్ పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాలు బాగా మసాజ్ చేయాలి. తర్వాత షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా పెట్టుకోవాలి. ఉదయాన్నే మైల్డ్ షాంపూతో స్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. బట్టతలపై జుట్టు రావడం ఖాయం.

అలోవెరా జెల్

అలోవెరా జెల్

ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే సింపుల్ రెమెడీ. అలోవెరా నుంచి జెల్ తీసి.. స్కాల్ప్ మొత్తం పట్టించాలి. బట్టతల ఉన్న దగ్గర ఎక్కువ ఫోకస్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేస్తే మరింత ఎక్కువ ఫలితాలు పొందవచ్చు. లేదంటే.. రెండు మూడు గంటల తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.

గోరువెచ్చని కొబ్బరినూనె

గోరువెచ్చని కొబ్బరినూనె

4 స్పూన్ల కొబ్బరినూనెను గోరువెచ్చగా చేయాలి. 15 నిమిషాల పాటు బాగా మసాజ్ చేయాలి. షవర్ క్యాప్ వేసుకుని రాత్రంతా అలానే వదిలేయాలి. ఇలా వారానికి నాలుగుసార్లు చేయాలి. కొన్ని రోజులకే మార్పు చూస్తారు.

ఉసిరి ప్యాక్

ఉసిరి ప్యాక్

4 ఉసిరికాయలు తీసుకుని రసం తీయాలి. రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపాలి. తలంతా.. ఈ ప్యాక్ అప్లై చేయాలి. రెండు మూడు గంటల తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే.. బట్టతలపై జుట్టు రావడానికి సింపుల్ రెమిడీ.

MOST READ:కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ? MOST READ:కుజ దోషం ఉంటే ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఉండాల్సిందేనా ?

గోరువెచ్చని ఆముదం

గోరువెచ్చని ఆముదం

కొబ్బరినూనె ట్రీట్మెంట్ లాంటిదే ఇది. 4 టేబుల్ స్పూన్ల ఆముదంను గోరువెచ్చగా చేయాలి. స్కాల్ప్ అంతటికీ అప్లై చేసి.. రాత్రంతా అలానే ఉంచాలి. రాత్రిపూట షవర్ క్యాప్ వేసుకోవడం మంచిది. ఉదయం మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి చూడండి.. మ్యాజిక్.

బంగాళదుంప రసం

బంగాళదుంప రసం

3 బంగాళదుంపలు తీసుకుని.. ఫ్రెష్ గా రసం తీయాలి. స్కాల్ప్ కి ఈ రసం అప్లై చేసి.. 4 గంటల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ ఖచ్చితంగా ఉపయోగించాల్సిన అవసరం లేదు.

మెంతులు

మెంతులు

2 లేదా 3 టేబుల్ స్పూన్ల మెంతులు రాత్రంతా నానబెట్టాలి. ఉదయం 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బట్టతలకు పట్టించాలి. దాన్ని 2 నుంచి 3 గంటలు అలానే వదిలేసి.. నీటితో శుభ్రం చేసుకోవాలి. అవసరం అనుకుంటే.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు.

MOST READ:గుండె గురించి తెలుసుకోవాల్సిన అంశాలుMOST READ:గుండె గురించి తెలుసుకోవాల్సిన అంశాలు

ఉసిరికాయలు

ఉసిరికాయలు

6 లేదా 7 ఎండిన ఉసిరికాయలను 2 కప్పుల వేడినీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటి లోంచి ఉసిరికాయలను తీసి గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. ఇది అప్లై చేశాక షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకుని 30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ తలలో జుట్టు రీగ్రోత్ అవడం ఖాయం.

ఉల్లిపాయ, కొబ్బరినూనె

ఉల్లిపాయ, కొబ్బరినూనె

ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి.. రసం తీయండి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రీగ్రోత్ అవడానికి సహాయపడుతుంది.

మందార పువ్వు

మందార పువ్వు

జుట్టు సంరక్షణలో మందారం పువ్వు చాలా మ్యాజికల్ గా పనిచేస్తుంది. ఈ టిప్ ఫాలో అవడం కూడా చాలా సింపుల్. గుప్పెడు మందారం పువ్వులు తీసుకుని పేస్ట్ చేయాలి. దీనికి ఆముదం లేదా బ్రింగరాజ్ ఆయిల్ ఏది అందుబాటులో ఉంటే దాన్ని కలిపి తల మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ బట్టతలపై జుట్టు రావడం ఖాయం.

English summary

DIY Home Remedies For Baldness

DIY Home Remedies For Baldness. DIY home remedies that you can prepare at the comfort of your home, without spending an arm or a leg over it.
Desktop Bottom Promotion