For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు స్ట్రాంగ్ గా, హెల్తీగా.. రెండింతలు పెరగాలంటే మెంతులతో హెయిర్ ప్యాక్..!!

మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ ఉపయోగించి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు . మెంతులతో హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసేటప్పుడు మెంతులతో పాటు చాలా చౌకగా,

|

ప్రస్తుత రోజులలో జుట్టు రాలటమనే సమస్యను మహిళలు సైతం ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలడానికి అనేక పరిష్కార మార్గాలున్నాయి. అందులో రసాయనిక ఉత్పత్తులు మరియు హోం రెమెడీస్. జుట్టురాలడాన్ని అరికట్టడంలో అనేక మార్గాలున్నా కూడా వాటిలో ఏ ఒక్కటీ మంచి ఫలితాలను ఇవ్వలేదు. ఇప్పటీకి జుట్టు సమస్యలు అలాగే ఉన్నాయి. కొద్దో గొప్పో మార్పు కనపిస్తుంది కానీ పూర్తిగా ఎటువంటి మార్పు ఉండదు. అందులో ఈ మద్యకాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్స్ పుట్టుకొచ్చాయి . కాబట్టి కెమికల్ బేస్డ్ ఉత్పత్తులను జుట్టుకు ఉపయోగించడం కంటే సహజంగా ప్రక్రుతి పరంగా లభించే వాటిని మనం ఉపయోగించడం చాలా మేలు.

ప్రస్తుత రోజుల్లో 40 ఏళ్లు పైబడితే చాలు బట్టతల వచ్చేస్తోంది. దీనికి కారణం ఒత్తిడి. ఒత్తిడిని సహజమైన ఔషధమూలికలు తప్ప వేరేవీ తగ్గించలేవు. అదికూడా ఏ మాత్రం అధిక వ్యయం లేకుండానే తగ్గిస్తాయి. వాటిలో ఒకటి మెంతులు. మెంతులు తలపై భాగాన వున్న వేడిని తగ్గిస్తాయి. చుండ్రు నివారిస్తాయి, వెంట్రుకలను బిరుసుగా వుంచుతాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టును సున్నితంగా, మెత్తగా ఉంచుతాయి. కళ్ళకు, మెదడుకు చల్లదనాన్ని కలిగిస్తాయి. అనేక హెయిర్ ప్రాబ్లెన్స్ ను నివారిస్తాయి. మెంతులు నికోటినిక్ యాసిడ్ మరియు ప్రోటీన్ ను కేశాలకు పుష్కలంగా అందేలా చేస్తాయి. ఇది కేశాలు తిరగి పెరగడానికి మరియు బలంగా ఉండటానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి.

మెంతులు మరియు మెంతి ఆకులను ఉపయోగించి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ ఉపయోగించి అనేక హెయిర్ ప్రాబ్లెమ్స్ ను నివారించుకోవచ్చు . మెంతులతో హోం మేడ్ హెయిర్ మాస్క్ తయారు చేసేటప్పుడు మెంతులతో పాటు చాలా చౌకగా, విరివిగా ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మెంతులను ఏ రకంగా ఉపయోగించాలో, వాటి ప్రయోజనాలేమిటో చూద్దాం!

 జుట్టు రాలడం అరికడుతుంది:

జుట్టు రాలడం అరికడుతుంది:

మెంతులను నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం పేస్ట్ చేసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. కొన్ని నిముషాలు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ పేస్ట్ ను వారంలో రెండు మూడు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

ఒక కప్పు మెంతులు తీసుకుని , అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేయాలి. ఇప్పుడు ఈ నూనెను వేడి చేయాలి. మెంతులు బ్రౌన్ కలర్ లోకి మారగానే నూనెను చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు అప్లై చేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

దురదను తగ్గిస్తుంది:

దురదను తగ్గిస్తుంది:

కొన్ని మెంతులను ఒక కప్పు నీటిలో వేసి నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, అందులో గుడ్డు పచ్చసొన వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దీనికి కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల వాసన ఉండదు . అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పెరుగు జోడించి బాగా మిక్స్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉండనివ్వాలి. దీన్ని హెయిర్ రూట్స్ కు పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది, అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది:

జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది:

మెంతులు నీటిలో వేసి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో నిమ్మరసం, కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేసుకోవాలి. ఇది తలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సమిస్తుంది. జుట్టుకు తగినంత షైనింగ్ అందిస్తుంది. మెంతి పేస్ట్ లో నిమ్మరసం కలపడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. ఎక్కువ రోజులు మంచి షైనింగ్ తో ఉంటాయి.

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది:

రాత్రంతా నీటిలో నానబెట్టిన మెంతులను మెత్తగా పేస్ట్ చేసి అందులో రోజ్ వాటర్, మొయోనైజ్ మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను తలకు , వెంట్రుకల చివర్ల వరకూ అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది:

జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది:

మెంతులను నానబెట్టి, మెత్తగా పేస్ట్ చేసి దీన్ని తలకు అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టును స్మూత్ గా, సాప్ట్ గా మంచి కండీషనర్ తో ఉంటుంది. ఈ రెమెడీని రోజూ ఉపయోగించడం వల్ల జుట్టు హెల్తీగా, సాప్ట్ గా బౌన్సీగా ఉంటుంది.

ఆయిలీ హెయిర్ :

ఆయిలీ హెయిర్ :

కొద్దిగా మెంతులును వెనిగర్ లో నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

English summary

Fenugreek Hair Mask Recipes For 2x Thicker Hair

Fenugreek seeds or the yellow-white pellets often called methi seeds in Hindi are one among the best ingredients for healthy hair and scalp. Fenugreek seeds are often used to get rid of dandruff on hair and to make the scalp stronger.
Desktop Bottom Promotion